విన్నపాలు షురూ.. | request letters now start | Sakshi
Sakshi News home page

విన్నపాలు షురూ..

Published Wed, Aug 24 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

విన్నపాలు షురూ..

విన్నపాలు షురూ..

  • రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు డిమాండ్
  • సత్తుపల్లిని రెవెన్యూ డివిజన్‌ చేయాలి..
  • రెండు రోజుల్లో.. 95 వినతులు
  • సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్‌లు.. మండలాల ఏర్పాటు.. ఉన్న వాటిని విడదీÄñæ¬ద్దని.. పక్క జిల్లాలో కలపొద్దని.. ప్రస్తుతం ఉన్న వాటిలోనే సర్దుబాటు చేయాలని’ వినతులు వెల్లువెత్తాయి.. జిల్లా పునర్విభజనకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌కు రెండు రోజుల్లోనే(బుధవారం రాత్రి పది గంటల వరకు) 94 వినతులొచ్చాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని నెల రోజుల గడువిచ్చారు. 
    కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఈనెల 22న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విదితమే. నోటిఫికేషన్‌ ప్రకారం ఖమ్మం జిల్లాకు 22 మండలాలు, కొత్తగూడెం జిల్లాకు 18 మండలాలు రానున్నాయి. ప్రస్తుతం పునర్విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే ఠీఠీఠీ.n్ఛఠీఛీజీట్టటజీఛ్టిటజౌటఝ్చ్టజీౌn.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో వినతులు ఇవ్వాలని సూచించింది. దీంతో రెండు జిల్లాలకు సంబంధించి మంగళ, బుధవారం 95 వినతులు వచ్చాయి. వీటిలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. 
    జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి 52, రెవెన్యూ డివిజన్లపై 12, మండలాల ఏర్పాటుపై 31 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 35 దరఖాస్తులు రాగా.. వీటిలో జిల్లాకు.. 15, రెవెన్యూ డివిజన్‌కు.. 9, మండలాలకు సంబంధించి వినతులు 11 వచ్చాయి. కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 59 దరఖాస్తులు రాగా.. జిల్లాకు.. 37 దరఖాస్తులు, రెవెన్యూ డివిజన్‌కు.. 3, మండలాలకు సంబంధించి 19 వినతులు వచ్చాయి. 
    కొత్తగూడెం జిల్లాపైనే ఎక్కువగా..
    కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వినతులు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి 95 దరఖాస్తులు రాగా.. కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 60 ఉన్నాయి. వీటిలో గార్ల, బయ్యారం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారంను మహబూబాబాద్‌ జిల్లాలో కలిపితే ఇబ్బందులు ఎదురవుతాయని వినతుల్లో పేర్కొన్నారు. అలాగే.. జిల్లా విభజనకు సంబంధించి చేసిన ప్రతిపాదనల్లో కొత్తగూడెం జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేయాలని నివేదికల్లో పేర్కొన్నారు. ఆళ్లపల్లి, కరకగూడెం, కొత్తగూడెం రూరల్, పాల్వంచ రూరల్‌ మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిలో ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో ఈ మండలాల ఏర్పాటు ఊసే లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. అలాగే భద్రాచలం జిల్లా ఏర్పాటు చేయాలని, ఇల్లెందును డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వినతులు వచ్చాయి. 
    ఖమ్మం జిల్లాకు 35 దరఖాస్తులు..
    ఖమ్మం జిల్లాకు సంబంధించి 35 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌ జిల్లాలో కాకుండా.. ఖమ్మం జిల్లాలో కలపాలని కొందరు వినతులు చేశారు. అలాగే సత్తుపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉందని, దానిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని వినతుల్లో పేర్కొన్నారు. జిల్లా విభజనపై 15, రెవెన్యూ డివిజన్‌పై 9, మండలాల ఏర్పాటుపై 11 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం రూరల్‌లో కూడా మరో మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వినతులు వెబ్‌సైట్‌కు వచ్చాయి. 
    గార్ల, బయ్యారంపై..
    గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపడంపై జిల్లా ప్రజలు విముఖంగా ఉన్నట్లు వినతులను చూస్తే తెలుస్తోంది. ఇల్లెందు నియోజకవర్గంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు ఇతర ప్రాంతాల వారు కూడా గార్ల, బయ్యారంను ఇటు ఖమ్మంలో కానీ, అటు కొత్తగూడెం జిల్లాలో కానీ ఉంచాలని వెబ్‌సైట్‌లో పేర్కొంటుండటం విశేషం. ఈ రెండు మండలాలను ఇక్కడే ఉంచుతారో.. లేదంటే డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా మహబూబాబాద్‌ జిల్లాలోనే ఉంచుతారో నెల రోజుల తర్వాతే తేలనుంది. కాగా.. పలు పార్టీలకు చెందిన నేతలు ఎక్కువగా వినతులు వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేసిన వారిలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement