14 నుంచి రాహుల్‌ గాంధీ ‘న్యాయ్‌ యాత్ర’  | Rahul Gandhi Nyay Yatra Start on January 14 2024 | Sakshi
Sakshi News home page

14 నుంచి రాహుల్‌ గాంధీ ‘న్యాయ్‌ యాత్ర’ 

Published Fri, Jan 12 2024 3:33 AM | Last Updated on Fri, Jan 12 2024 3:33 AM

Rahul Gandhi Nyay Yatra Start on January 14 2024 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 14 నుంచి రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ప్రారంభిస్తారని ఏఐసీసీ జాతీ య అధికార ప్రతినిధి షమా అహ్మద్‌ తెలిపారు. గురువారం ఆమె గాం«దీభవన్‌లో మాట్లాడుతూ మణిపూర్‌ నుంచి ముంబై వరకు ఈ యాత్ర ఉంటుందని, మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. దేశంలో యువత ఉద్యోగాలు, ఉపాధిలేక అల్లాడుతోందని ఆవే దన వ్యక్తం చేశారు.

ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ సర్కార్‌ మోసం చేసిందని, పెట్రోల్, గ్యాస్, డీజిల్‌ ధరలు పెరి గిపోయాయని విమర్శించారు. దీంతో సామా న్య ప్రజల జీవనం కష్టంగా మారిందని అన్నా రు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై ఈడీ, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారన్నా రు. మరోవైపు కిసాన్, దళిత, ఆదివాసీలు, మ ణిపూర్‌లో చర్చిలు, ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement