న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే యాత్రకు రావాల్సిందిగా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఎన్నో పెద్ద ఈవెంట్లు జరుగుతుంటాయని, అన్నిటికి తమను పిలవరని అన్నారు.
వెంటనే దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాంరమేష్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ న్యాయ యాత్ర షెడ్యూల్ ఇంకా ఖరారవలేదు. ఒకట్రెండు రోజుల్లో టూర్ షెడ్యూల్ ఫైనల్ అవుతుంది. న్యాయ యాత్రకు అఖిలేశ్ హాజరైతే ఇండియా కూటమి ఇంకా బలోపేతం అవుతుంది’ జైరాం రమేష్ అన్నారు.
రెండవ విడత మణిపూర్ నుంచి వరకు ప్రారంభమైన రాహుల్‌గాంధీ న్యాయ యాత్ర ఐదు రాష్ట్రాల్లో టూర్ పూర్తి చేసుకుంది. యాత్రలో ఈసారి ఎక్కువ భాగం రాహుల్‌గాంధీ బస్సులోనే పర్యటించారు. ఈ నెల 16న న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment