3న సామూహిక నిరహార దీక్షలు ప్రారంభం
సూర్యాపేట : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద వేలాది ఉపాధ్యాయులతో సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించే ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ ఇస్తూ 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగ సేవలు అందించే ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వెంటనే సీఎం స్పందించి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పదో పీఆర్‌సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, పండిట్, పీఈటి పోస్టుల అప్‌గ్రేడేషన్ చేయాలని, స్పెషల్ టీచర్స్‌కు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యామా రమేష్, ఎ.బ్రహ్మచారి, తిరుమలేష్, జితేందర్‌రెఇ్డ, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.