hunger
-
యాప్ ఆకలి తగ్గించుకోండి
మార్కెట్లో ఆపిల్‌పండు దొరుకుద్దోలేదో తెలీదుగానీ, దొరికినా కొనగలుగుతామో లేదో తెలియదు కానీ, తిన్నా ఆరోగ్యంగా ఉంటామో లేదో తెలియదు కానీ, తిన్నది కాశ్మీర్దా ఆస్ట్రేలియాదా అర్థం కాదు కానీ, యాప్‌లు మాత్రం అందరికీ అర్థమౌతున్నాయి. ముక్కు తుడుచుకోడానికి, మూతి తుడుచుకోడానికి కూడా యాప్‌లు ఉన్నాయి. యాప్‌లకు అంత వ్యాప్తి ఉంది. ‘ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పూస్తా’ లాంటి యాప్‌లు కూడా ఉన్నాయి. కానీ ఆకలి కాక ముందే మీకు ఆకలి ఎప్పుడు వేస్తుందో కనుక్కుని, మీ ఆకలిని నింపడానికి కూడా యాప్ ఉందట! వెటకారం అయినా, వచ్చినా వస్తుంది లెండి అలాంటిది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీ ఎత్తు, బరువు, లైక్స్, డిస్‌లైక్స్, మీ పేరెంట్ జీన్సు, మీరు చదువుకున్న చదువు, మీరు ఏడుస్తున్న ఉద్యోగం వగైరా వగైరా వగైరాలను బట్టి మీకు ఆకలి వెయ్యకముందే ఈ కొత్త యాప్ గంట కొట్టుద్దంట. కొట్టి, మీకిష్టమైన ఫుడ్డు ప్యాక్ చేసి పంపిస్తుందట. ‘ఔరా! నిజమేనా..’ అంటూ ఓ ప్రబుద్ధుడు.. ‘మరి ముద్ద కలిపి నోట్లో కూడా పెట్టుద్దా?’ అని అడిగాడట. ఇదమ్మా నేటి యటకారం వైరలు. -
ఎమోషనల్ ఈటింగ్ డేంజరే!
కొంతమంది కోపంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, తోచకపోయినా తింటూ ఉంటారు. అది చాలా డేంజర్. అలాంటి వారి కోసం..కంపెనీ కోసమో, టైం పాస్ కోసమో తినే అలవాటును వెంటనే మానుకోవాలి. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినే అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలను నివారించవచ్చు. భోజనం చేసిన తరువాత (లంచ్) అది పూర్తిగా జీర్ణం కావడానికి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. అంటే కాయగూరలు, మాంసాహారం, ఆయిలీ ఫుడ్... ఇలా తీసుకున్న ఆహారాన్ని బట్టి సమయం ఆధారపడి ఉంటుంది. ఓవర్ ఈటింగ్ మంచిది కాదు. పొట్టను మూడు వంతుల వరకే నింపాలి. బుక్ లేదా పేపర్ చదువుతూ, టీవీ చూస్తూ, మరేదో పని చేసుకుంటూ తినే అలవాటు మానేయాలి. ప్రశాంతంగా కూర్చుని భోజనం మీదే మనసు కేంద్రీకరించి తినడాన్ని అలవాటు చేసుకోవాలి. భోజనం పూర్తయిన తరవాత ఐదు నుంచి పది నిమిషాల పాటు కూర్చుని సుమారు వంద అడుగులు నెమ్మదిగా నడవాలి. రాత్రి భోజనం మరీ పొద్దుపోయిన తరవాత చేయకూడదు. భోజనానికి పడుకోవడానికి మధ్య విరామం తప్పనిసరి. -
తాగునీటి కోసం నిరహార దీక్షా?
ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఐటీడీఏ ఎదురుగా ఆందోళన రంపచోడవరం : ఏజెన్సీలో గిరిజనులు రక్షితనీటి కోసం ధర్నాలు, నిరాహార దీక్షాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో వై.రామవరం మండలం కోట గ్రామంలో ఒక వీధికి తాగునీరు కావాలంటూ శుక్రవారం రిలే నిరాహారదీక్ష చేశారు. దీక్ష శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి సందర్శించారు. గిరిజనుల ఆందోళనకు ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. గిరిజన గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఎంతదూరమైన కాలినడకే శరణ్యమన్నారు. చాపరాయిలో 17 మంది గిరిజనులు చనిపోతే సీఎం చంద్రబాబు ఏజెన్సీకి రావడానికి కుదరలేదన్నారు. మంత్రులు వచ్చి చూసి వెళ్లాలన్నారు. గిరిజన, సాంఘిక సంక్షేమ మంత్రి రంపచోడవరం ఐటీడీఏలో అధికారులతో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. ఇప్పటికీ ఏజెన్సీలో కాళ్లవాపుతో 17 మంది, మతాశిశు మరణాలు 216, చాపరాయిలో జ్వరాలతో 17 మంది చనిపోయినా ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ టోల్ ఫ్రీ నంబర్‌కు పోన్ చేస్తే మంచినీటి సమస్యలు పరిష్కారిస్తామంటున్నారు. ఏజెన్సీలో బోర్లు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. గిరిజనుల సమస్యలపై ఐక్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎంతో చక్కగా పనిచేస్తున్నారని, నాలుగు అవార్డులు కూడా వచ్చినట్లు సెలవిచ్చారన్నారు. అవార్డులు ఎవరిచ్చారని అయన ఎక్కడ పెట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు. విశాఖ, తూర్పు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తే వణుకున్న గిరిజనుల పరిస్థితులు తెలుస్తాయన్నారు. కోట గ్రామం నుంచి కిందివీధి బోర్ల నుంచి తెచ్చిన బురద నీటిని ఎమ్మెల్యే రాజేశ్వరి, రామకృష్ణలు పరిశీలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, డివిజన్ నాయకుడు జుత్తుక కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో పాల్గొన్న గిరిజనులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. గిరిజనులతో మాట్లాడిన పీఓ.. ఐటీడీఏ ఎదురుగా రిలే దీక్ష చేసిన కోట గిరిజనులతో పీఓ దినేష్‌కుమార్ మాట్లాడారు. గ్రామంలో బోర్ల మరమ్మతులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గిరిజనులు తెచ్చిన బోరు నీటిని పీఓ పరిశీలించారు. అలాగే ఆదివాసీ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బోండ్ల వరప్రసాదరావు కూడా దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. -
ఆకలి రాజ్యం
మనదేశంలో చిట్టి బొజ్జలకు తగినంత తిండి దొరకడం లేదు! 6 నుంచి 23 నెలల మధ్య ఉన్న పిల్లల్లో.. ప్రతి 10 మందిలో ఒకరికే కడుపు నిండా తిండి దొరుకుతోంది. మిగతా తొమ్మిది మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35.7 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. అంతేకాదు.. పౌష్టికాహార లేమితో బాధపడుతున్న పిల్లలు ఆఫ్రికాలో కంటే భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారట! ప్రపంచంలో పౌష్టికాహార లేమితో ఉన్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు భారత్‌లోనే ఉన్నారని ‘ఇండియాస్పెండ్’ అనే వెబ్సైట్ తెలిపింది. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను విశ్లేషించి ఈ వాస్తవాలను వెల్లడించింది. –సాక్షి, తెలంగాణ డెస్క్ సరైన బరువు లేక బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు 35.7% మంది ఆరు నెలలలోపు చిన్నారులకు తల్లిపాలతోనే ఆహారం అందుతుంది. అయితే 55 శాతం మంది చిన్నారులకు మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. 2005–06 నుంచి పోలిస్తే తల్లిపాలు అందుతున్న చిన్నారుల సంఖ్య 9 శాతం పెరగడం ఆశించదగ్గ పరిణామం. రెండేళ్లలోపు చిన్నారులంతా పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు.. ► అవసరమైన చిన్నారులకు రెండేళ్ల వరకూ తల్లిపాలు అందించాలి. ► చిన్నారికి ఆరు నెలలు వచ్చినప్పుటి నుంచి బయటి ఆహారం అందించడం ప్రారంభించాలి. ► 6 నుంచి 8 నెలల చిన్నారికి రోజుకు 2 నుంచి 3 సార్లు ఆహారం అందించాలి. ► 9 నుంచి 23 నెలల చిన్నారికి రోజుకు 3 నుంచి 4 సార్లు ఆహారం అందించాలి. రోజుకు 2 సార్లు స్నాక్స్ ఇవ్వాలి. ► విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారం తప్పనిసరి. -
రిజిస్ట్రేషన్ల కోసం రిలే దీక్షలు
నాలుగు గ్రామాల రైతులు, ప్రజల ఆందోళన కోరుకొండ : తమ భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుకొండ, జంబూపట్నం, కోరుకొండ, కాపవరం శ్రీరంగపట్నం గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు బుధవారం కోరుకొండలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెండున్నరేళ్లుగా ఇళ్ల స్థలాలు, పొలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేశారని పలువురు విమర్శించారు. న్యాయం కోరుతూ అన్నవరం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. ఇటీవల వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా తమకు అండగా శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. తమ భూములు దేవస్థానానికి సంబంధం లేకున్నా రిజిస్ర్టేషన్లు నిలిపివేయడం దారుణమని తెలిపారు. బాధితులు నీరుకొండ నాగేశ్వరరావు, బొండాడ గొల్లారావు, దేవినేని ప్రభాకరరావు, పసుపులేటి సత్యనారాయణ, కాటూరి రాంమ్మోహన్, సూరిశెట్టి లక్ష్మణరావు, ఉప్పలపాటి వీరాస్వామి, ముండ్రు రామారావుచౌదరి, గరగ వెంకటేశ్వరరావు, ద్వారంపూడి చిన్ని తదితరులు రిలే దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, లోక్‌సత్తా, కాంగ్రెస్ ‡పార్టీల నేతలు శిబిరానికి చేరుకుని వీరి ఆందోళనకు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సాయంత్రం దీక్షధారులకు డ్రింక్ ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. డాక్టర్ పెద్దింటి సీతారామ భార్గవ, కల్యాణం రాంబాబు, కటకం చలం, ఇసుకపల్లి రాజారావు, బావన రాంబాబు, నీరుకొండ బాబ్జీ, జాజుల సత్తిబాబు, వుల్లి ఘననాథ్, మాతా ప్రభు, తరగరంపూడి గణపతి, ముత్యం గిరి, కర్రి వీరగణేష్, గరగ శ్రీధర్‌బాబు, రొంగలి శ్రీను, కాళ్ల శ్రీరాములు తదితరులు మద్దతు పలికిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ వివిద విభాల నాయకులు తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, గరగ మధు, వాకా నరసింహరావు, తిక్కిరెడ్డి హరిబాబు, సూరిశెట్టి భద్రం, గుగ్గిలం భాను, తోరాటి శ్రీను, సూరిశెట్టి అప్పలస్వామి, అయిల రామకృష్ణ తదితరులున్నారు. వారికి అండగా ఉంటాం... కోరుకొండలో భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేయడంపై సబ్ రిజిష్టర్, అన్నవరం ఈఓ తీరుపై వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. రైతులు, ప్రజలకు న్యాయం చేసేంతవరకూ పార్టీ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని హమీ ఇచ్చారు. సబ్ రిజిష్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆమె ఈ విషయంలో సబ్‌రిజిష్టార్ నరసింహరావును నిలదీశారు. భూముల రిజిస్ట్రేషన్లు చేయరాదని అన్నవరం దేవస్థానం నోటిసు ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని కలెక్టర్, దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
కొనసాగుతున్న దివీస్ బాధితుల దీక్షలు
భగ్నం చేసేందుకు పోలీసుల యత్నాలు? తొండంగి : కోనప్రాంతంలో రైతులకు కోర్టు స్టేటస్కో ఇచ్చిన, రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దివీస్ వ్యతిరేకపోరాటకమిటీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. కొత్తపాకల గ్రామంలో ఏర్పాౖటెన దీక్షలో రెండో రోజు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మట్ల ముసలయ్య, గంపల దండు, సన్ని సత్యనారాయణ, తాటిపర్తి బాబూరావు, యనమల సత్తిబాబు, మారేటి లక్ష్మణరావు, కుక్కాసత్తిబాబు, పి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షా శిబిరానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్, సీపీఎం నాయకులు వచ్చి మద్దతు పలికారు. తహసీల్దార్ టీవీ సూర్యనారాయణ, ఎస్సై బి.కృష్ణమాచారి తదితరులు దీక్షా స్థలికి వచ్చి విచారణ చేస్తామని దీక్ష విరమించాలని కోరారు. తమకు ఆమోదయోగ్యంగా ఉమ్మడిగా సర్వేయర్లను ఏర్పాటు చేసి విచారణ జరపాలని, రేపటికి వాయిదా వేయాలని సీపీఎం నాయకులతో పాటు పోరాట కమిటీ సభ్యులు కోరారు. అలా కుదరదంటూ గంట వ్యవధిలోనే విచారణను ముగించి అక్రమ నిర్మాణాలు లేవని అధికారులు తెలిపారని దివీస్ వ్యతిరేకపోరాట కమిటీ సభ్యులు వివరించారు. న్యాయం జరిగే వరకూ రిలే దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. శాంతియుతంగా చేపట్టి్టన తమ దీక్షలను భగ్నం చేసేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బాధిత రైతులు లేకుండా విచారణ ఎలా చేస్తారు? దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతులు భూములకు కోర్టు స్టేటస్కో విధించినా అక్రమ నిర్మాణాలు జరిగాయని రైతులు ఫిర్యాదు చేస్తే, వారు లేకుండా అధికారులు ఏ విధంగా విచారణ చేశారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి జనవరి 21న తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పుడు రైతులు లేకుండా విచారణ చేయడం అన్యాయమన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
80 కోట్ల మందికి రోజూ రాత్రి భోజనం కరువు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు, పోషకాహార లోపంతో బాధ పడుతున్నవారు రోజురోజుకు కోకొల్లలుగా పెరిగిపోతున్నారంటూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోక పోయినట్లయితే 2035 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఈ పోషకాహార లోపానికి గురవుతారని ఐక్యరాజ్య సమితి ఆహారం, వ్యవసాయ సంఘం గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలో మూడోవంతు జనాభా ఆకలితో, పౌషకాహార లోపంతో బాధ పడుతున్నారని, ఫలితంగా వీరి ఆరోగ్య ఖర్చులకు, వీరి ఉత్పాదన శక్తి తగ్గిపోవడం వల్ల ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నామని నివేదిక అంచనా వేసింది. ప్రతి రోజు 80 కోట్ల మంది ప్రజలు రాత్రిపూట భోజనం లేక కాలే కడుపులతోనే కలత నిద్ర పోతున్నారని నివేదిక పేర్కొంది. మరోపక్క 190 కోట్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారట. పౌష్టికాహార సమస్యను ప్రభుత్వం తన సమస్యగా భావించి నివారించేందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పౌష్టికాహార లోపంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో సమితి ఆహార, వ్యవసాయ సంఘం డెరైక్టక్ జనరల్ జోష్ గ్రజియానో హెచ్చరించారు. సరైన డైట్, వ్యాయామం లేకపోవడం వల్లనే ప్రపంచంలో ఎక్కువ మంది ఆస్పత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. -
ఆకలి రాజ్యం
► భారత్‌లో ఆందోళనకరంగా ఆకలి ప్రపంచ ఆకలి సూచీ వెల్లడి ► దేశంలో 15 శాతం మంది చిన్నారుల అర్థాకలి ► ప్రతి 20 మంది పిల్లల్లో ఒకరు ఐదేళ్ల లోపే మృతి ► భారత్‌కన్నా బంగ్లా, శ్రీలంక, కెన్యా, ఇరాక్‌లే బెటర్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థికవ్యవస్థ భారతదేశం. ప్రపంచ వేదికలపై పాలకులు ఈ విషయాన్ని ఎంతో గర్వంగా ప్రకటిస్తున్నారు. ఇండియా అతి త్వరలో ‘సూపర్‌పవర్’గా అవతరిస్తుందని ఎంతో ధీమాగా చెప్తున్నారు. కానీ.. అదే సమయంలో దేశంలో పేదల ఆకలి కేకలు పెద్దగా తగ్గుతున్న దాఖలాలు లేవు. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పిఆర్ఐ) ఇటీవల విడుదల చేసిన 2016 ప్రపంచ ఆకలి సూచీలో (గ్లోబల్హంగర్ఇండెక్స్ జీహెచ్ఐ).. మొత్తం 118 దేశాల జాబితాలో భారతదేశం అట్టడుగున 97వ స్థానంలో ఉంది. దేశంలో ఆకలి ఆందోళనకర స్థాయిలో ఉందని ఈ సూచీ చెప్తోంది. ఐదేళ్ల లోపే అర్థంతర మరణం: భారతదేశంలో ఐదేళ్ల వయసు లోపున్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు పూర్తిగా ఎదగడం లేదు. ప్రతి 20 మందిలో ముగ్గురు పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు పెరగడం లేదు. ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు ఐదేళ్లు నిండకముందే చనిపోతున్నారు. దీనికి కారణం వారికి తగినంత ఆహారం లభించకపోవడమే. పొరుగు దేశాలు ఎంతో మెరుగు: ఆకలి సూచీ సర్వే ప్రకారం.. భారత్‌కన్నా కెన్యా, మలావి, ఇరాక్వంటి దేశాల్లో మెరుగైన పరిస్థితి ఉంది. పొరుగు దేశాల్లో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్లు కూడా భారత్‌కన్నా మెరుగుగానే ఉంటే.. ఒక్క పాకిస్తాన్మాత్రమే భారత్‌కన్నా కొంత వెనుకబడి ఉంది. ఇక చైనాలో ఆకలి నామమాత్రంగానే ఉంది. భారతదేశం శిశు మరణాల రేటులో కనీసం శ్రీలంక స్థాయిని చేరుకోగలిగితే.. 2016లో జన్మించిన శిశువుల్లో సుమారు 9 లక్షల మంది 2021 లోపే చనిపోకుండా కాపాడవచ్చు. పేదల ఆకలికి లేదు ప్రాధాన్యం దేశంలో పేదల ఆకలి, ప్రజారోగ్యం అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో కానీ, ప్రచారంలో కానీ, పార్లమెంటు లోపల కానీ, వెలుపల కానీ, రాజకీయ పార్టీల విధానాల్లో కానీ, వాదనల్లో కానీ, ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకునే విషయాల్లో కానీ.. పొరుగుదేశంతో సంబంధాలు, ఉగ్రవాదం, అభివృద్ధి, అవినీతి, నల్లధనం వంటి అంశాల స్థాయిలో.. ఈ కీలకాంశాలకు పెద్దగా చోటు లభించడం లేదని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఆదివాసీలు, దళితులే అధికం: ఆహార లోపంతో అలమటిస్తున్న, అర్థంతరంగా చనిపోతున్న చిన్నారుల్లో అత్యధికులు ఆదివాసీలు, దళితులు, ఇతర వెనుకబడ్డ కులాల వారేనని ఎకానమిక్అండ్పొలిటికల్వీక్లీ 2011లో ప్రచురించిన ఒక అధ్యయనం చెప్తోంది. దాని ప్రకారం.. అగ్ర కులాల చిన్నారులతో పోలిస్తే.. ఎదుగుదల లోపం ఆదివాసీ చిన్నారుల్లో 69 శాతం, దళిత చిన్నారుల్లో 53 శాతం, ఇతర వెనుకబడిన కులాల వారిలో 35 శాతం అధికంగా ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: ఇదే ఆకలి సూచీలో 2000 సంవత్సరంలో భారత్‌కన్నా బంగ్లాదేశ్ఒక స్థానం దిగువనే ఉంది. కేవలం 15 సంవత్సరాల్లో భారత్‌ను బంగ్లా ఏడు స్థానాలు అధిగమించి ముందుకు సాగింది. 2000 సూచీలో భారత్‌కన్నా కేవలం ఆరు స్థానాలు మెరుగుగా ఉన్న నేపాల్ఇప్పుడు ఏకంగా 25 స్థానాలు మెరుగుపడింది. కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రధాన మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘భారతదేశపు పోషకాహార సవాళ్లపై ప్రధానమంత్రి మండలి’ని ఏర్పాటు చేసింది. ఆ మండలి దేశంలో పోషకాహారం పరిస్థితిపై పీఎంఓకు త్రైమాసిక నివేదికలు అందించాల్సి ఉంది. కానీ అది ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక్కసారి సమావేశమైంది. నాలుగు దశాబ్దాలుగా ఉన్న జాతీయ పోషకాహార పర్యవేక్షణ బ్యూరో (ఎన్‌ఎన్‌ఎంబి)ని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసింది. ఆ సంస్థ పోషకాహార సర్వేలు నిర్వహించినా ఆ నివేదికలను ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలున్నాయి. అన్నార్తుల్లో అగ్రస్థానం... 2015లో ఐక్యరాజ్యసమితి సంస్థలు విడుదల చేసిన ఆహార అభద్రత నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అర్థాకలితో అలమటిస్తున్న వారు అత్యధికంగా భారతదేశంలోనే ఉన్నారు. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో పాకిస్తాన్ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 79.46 కోట్ల మంది అర్థాకలితో జీవిస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచ జనాభాలో 11 శాతం. సాక్షి నాలెడ్జ్సెంటర్ -
తేనె పూసిన కత్తి అక్కరలేదు!
జెన్‌పథం ఆయన ఓ జెన్ గురువు. ఊరూరూ తిరుగుతూ తోచిన నాలుగు మంచి మాటలు చెప్పడం ఆయనకు ఇష్టం. ఆయన వెళ్ళే ప్రాంతంలో ఎవైరనా ఏైదనా తినడానికి ఇస్తే అది తిని ఆకలి తీర్చుకునే వారు. ఎప్పుైడనా తినడానికి ఏదీ దొరకకపోయినా బాధపడేవారు కాదు. ఉంటే తినడం లేదంటే పస్తు ఉండిపోవడం ఆయనకు మామూలే. ఒకరోజు ఓ ధనికుడు ఆయనను చూడటానికి వచ్చి - ‘‘అయ్యా! మీలాంటి ఓ గొప్ప జ్ఞానులు ఎందుకు ఉంటారు? మీకు నేనో ఆశ్రమం ఏర్పాటు చేస్తాను. మీరు అక్కడే ఉండొచ్చు. మీ ధ్యానానికి ఎలాంటి లోటూ రాకుండా మీకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసిపెడతాను. మీరు ఎక్కడికీ వెళ్ళకుండా ఇరుగుపొరుగు వారు మీ దగ్గరకే వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకునేలా ప్రచారం చేస్తాను. మీరు దర్జాగా ఇక్కడే ఉండొచ్చు... ఏమంటారు?’’ అని అడిగాడు. ఆయన చెప్పినదంతా సావధానంగా విన్న జెన్ గురువు ఓ నవ్వు నవ్వి - ‘‘మీరన్నది నిజమే. వినడానికి బాగుంది. కానీ నాకది సరిపోదు. క్షమించండి’’ అన్నారు. ‘‘తప్పుంటే మన్నించండి’’ అన్నాడు ధనికుడు. అప్పుడు గురువు ఇలా అన్నారు - ‘‘మీరు చెప్పినదానిలో ఒక్క తప్పూ లేదు. కానీ నేను చెప్పేది వినండి. అగరవత్తులు వెలిగించి గదిలో ఓ చోట పెట్టినప్పుడు ఆ గది అంతా గుబాళిస్తుంది. నిజమే. కానీ కాస్సేపటికి ఆ అగరవత్తులు ఆరిపోయి బూడిద, పుల్లలూ మిగులుతాయి. వాసన ఉండదు. అలా నాకిష్టమైన సంచారాన్నీ పద్ధతులనూ విడిచిపెట్టి పేరుప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడటం వల్ల ఎవరికి ఏం లాభముంటుంది? డబ్బూ, పేరూ, ప్రతిష్టలూ, పదవులూ, హోదా, గౌరవం వంటివన్నీ తేనె పూసిన కత్తి లాంటివి... కత్తికి తేనె పూశారన్న విషయాన్ని మరచిపోయి రుచి బాగుంటుందని తొందరపడి నాకితే రుచి మాట దేవుడెరుగు... నాలుక తెగి రక్తం కారుతుంది. కనుక నాకు తేనె పూసిన కత్తి అంటే ఇష్టం లేదు. దానికన్నా కొలనులో ఉన్న నీటిని దోసిలిలోకి తీసుకుని దాహం తీర్చుకుంటే చాలు అనుకునే వాడిని... దానితోనే నేను తృప్తి పడతాను. నాకు అంతకన్నా ఏదీ అక్కరలేదు’’ అన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత ధనికుడు మరొక్క మాట మాట్లాడితే ఒట్టు. - యామిజాల జగదీశ్ -
హెల్త్‌కార్నర్
* జీర్ణశక్తిని మెరుగుపరచడానికి పుదీనా కూడా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా రసం తరచు తీసుకుంటున్నట్లయితే, జీర్ణకోశ సమస్యలు చాలావరకు నయమవుతాయి. అలాగే, పుదీనా నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. * ఆకలి మందగించడం, భోజనం తర్వాత వికారం వంటి సమస్యలకు దాల్చినచెక్క చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చెంచాడు దాల్చినచెక్క పొడిని గ్లాసు నీళ్లలో వేసి కషాయంగా కాచుకుని, చల్లారిన తర్వాత తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, దాల్చినచెక్క రక్తంలో చక్కెరస్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. * జీలకర్రను నీళ్లలో వేసి, కషాయంగా చేసుకుని తాగితే కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణసంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్రలో పుష్కలంగా ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అకాల వార్ధక్యాన్ని నివారిస్తాయి. * గర్భిణులకు తలెత్తే వేవిళ్ల సమస్యకు అల్లం బాగా ఉపయోగపడుతుంది. చిన్న అల్లం ముక్కను దంచుకుని, అందులో చిటికెడు ఉప్పు కలుపుకొని బుగ్గన వేసుకుని చప్పరిస్తూ ఉంటే అజీర్తితో పాటు వివిధ కారణాల వల్ల తలెత్తే వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. * వెల్లుల్లి జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. రోజూ కనీసం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటున్నట్లయితే, జీర్ణప్రక్రియతో పాటు జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. * జ్వరం పడి లేచాక చాలామందికి నోరు అరుచిగా అనిపించడం, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మిరియాలు ఈ సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి. మిరియాల కషాయం తాగితే నోటికి రుచి పెరగడమే కాకుండా, ఆకలి కూడా పుడుతుంది. -
అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు...
ఆదర్శం ఒక్క రూపాయితో ఆకలి తీరుతుందా? ఆకలి తీరడం వరకు ఎందుకు? సింగిల్ టీ కూడా తాగలేము. కానీ అక్కడికి ఒక్క రూపాయితో వెళితే చాలు... కమ్మని భోజనంతో కడుపు నిండుతుంది. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కరూపాయికి పేదసాదలకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు వెంకట్రామన్. ఈరోడ్ జనరల్ హాస్పిటల్ సమీపంలో తాను నిర్వహిస్తున్న ‘ఏఎంవీ హోమ్లీ మెస్’లో ఒక్క రూపాయికే పేదలకు భోజనం సమకూరుస్తున్నడు వెంకట్రామాన్. ప్రతి మంచి పని వెనుక ఏదో ఒక సంఘటన ఉంటుంది. వెంకట్రామన్ విషయంలోనూ ఇది జరిగింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక యువతి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వెంకట్రామన్ రెస్టారెంట్‌కు వచ్చింది. ఆమె ఇడ్లీలు కొనడానికి వచ్చింది. ఆరు ఇడ్లీలకు పది రూపాయలు. పది రూపాయలు పెట్టి ఇడ్లీలు కొనడానికి ఆమె సుముఖంగా లేకపోవడంతో దోశలు కొనమని చెప్పాడు వెంకట్రామన్. పది రూపాయలకు మూడు దోశలు. మూడు దోశలు తన కుటుంబానికి సరిపోవంటూ కొనడానికి తిరస్కరించింది. ఆమె పరిస్థితికి జాలి పడి పది రూపాయలకే ఆరు దోశలు ఇచ్చాడు వెంకట్రామన్. వేరే రెస్టారెంట్ యజమానులు అయితే ఈ సంఘటనను ఇక్కడితో మరిచిపోయి ఉండేవారు. అయితే వెంకట్రామన్ చాలా రోజుల వరకు ఈ సంఘటనను మరవలేకపోయాడు. కొందరు కేవలం పది రూపాయల మీదే రోజంతా వెళ్లదీస్తున్న కఠిన వాస్తవాన్ని గ్రహించాడు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పేద రోగుల దీనపరిస్థితిని, ఆకలిని కళ్లారా చూశాడు. మనసు కదిలిపోయింది. ‘‘నా పరిధిలో ఏదైనా చేయాలి’’ అని అప్పుడే గట్టిగా అనుకున్నాడు వెంకట్రామన్. తన భార్యతో కలిసి రోజూ పొద్దున హాస్పిటల్‌కు వెళ్లి పేదవారికి రూపాయి కూపన్ ఇస్తాడు. కూపన్ తీసుకున్నవారు మధ్యాహ్నం రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం తెచ్చుకుంటారు. ఒకప్పుడు 20 మందికి టోకెన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు 70 మందికి ఇస్తున్నాడు. ఈ రెస్టారెంట్లో రెగ్యులర్ కస్టమర్ల విభాగం కూడా ఉంది. అక్కడ మాత్రం ప్లేట్ భోజనం రూ.50కి విక్రయిస్తారు. రూపాయి భోజనానికయ్యే ఖర్చు కోసం మొదట్లో ఎవరీ దగ్గర సహాయం తీసుకోలేదు వెంకట్రామన్. తన రెస్టారెంట్ లాభాల నుంచే ఈ మొత్తాన్ని కేటాయించేవాడు. అయితే రెస్టారెంట్‌కు వచ్చే లాభాలు తక్కువ కావడంతో ఖర్చులు సర్దుబాటు చేయడం కష్టంగానే ఉండేది. అయితే వెంకట్రామన్ చేస్తున్న పని నచ్చి అడగకుండానే దాతలు ఆయనకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. వెంకట్రామన్ కూతురికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చినప్పుడు కాలేజీ ఫీజు కట్టడానికి అతని దగ్గర డబ్బులేదు. ఇది తెలిసిన చెన్నై రామక్రిష్ణ మఠ్ వెంకట్రామన్ కూతురు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందడానికి అవసరమైన సహాయం చేసింది. ‘‘కష్టం ఉందని బాధ పడనక్కర్లేదు. ఆ కష్టాన్ని తీర్చే ఆపన్న హస్తం కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది’’ అని నమ్ముతాడు వెంకట్రామన్. ‘‘చదువు అయిపోయిన తరువాత నా కూతురుకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నేను మరింత ఎక్కువ మందికి సహాయం చేయగలను’’ అంటున్నాడు వెంకట్రామన్. యోగా టీచర్‌గా పని చేస్తున్న వెంకట్రామన్ భార్య తనవంతుగా సహాయం అందిస్తోంది. ‘‘పేద కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ నేనేమీ ఆర్థికంగా స్థిరపడలేదు. అయినా... ఒక్క రూపాయికి భోజనం మాత్రం సమకూర్చడాన్ని మాత్రం మానుకోను. రోజుకు వంద కూపన్లు ఇవ్వాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నాడు వెంకట్రామన్. ‘‘మానవత్వం అనేది సముద్రం లాంటిది. అందులో రెండు చుక్కలు కలుషితం అయినంత మాత్రాన... సముద్రం అంతా కలుషితం కాదు’’ అంటారు మహాత్మగాంధీ. వెంకట్రామన్ చేస్తున్న మంచిపనిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మహాత్ముడి మాటలు గుర్తుకు వస్తాయి. మానవత్వం మీద పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఈ కాలానికి ఇంత కంటే కావాల్సింది ఏముంది! -
ఖాళీ కడుపుతో విధులెలా?
పుష్కర వైద్య సిబ్బంది ఆవేదన అల్పాహారం, భోజన పంపిణీ ఒట్టిమాటే విజయవాడ (లబ్బీపేట) : నిత్యం మంత్రులూ..ముఖ్యమంత్రి ఘాట్ల చుట్టూ తిరుగుతూ అన్ని సౌకర్యాలు పక్కాగా ఉన్నాయని చెప్పుకుంటున్నా వాస్తవాలు వేరు. 24 గంటలూ యాత్రికులకు సేవలు చేస్తున్న వైద్య ఉద్యోగుల ఆకలి కేకలు వారి చెవికెక్కడం లేదు. చేరినా పట్టిం చుకోవడం లేదు. పుష్కరఘాట్లు, పుష్కరనగర్లు, రైల్వే, బస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి సకాలంలో అల్పాహారం, భోజనం అందించక పోవడంతో ఆకలి కడుపులతోనే పనిచేస్తున్నారు. జిల్లావైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే సర్దుకుపోండంటూ ఉచిత సలహా ఇచ్చారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిట్ నెహ్రు బస్ స్టేషన్లో ఐదు వైద్య శిబిరాలు, ఒక వైద్య కేంద్రం ఉండగా, ఆ సిబ్బందికి అల్పాహారం , భోజనం, ఆఖరికి మంచినీరు కూడా సరఫరా చేయడం లేదు. వారే కొనుక్కోవాలి. అన్ని చోట్లా ఇదే దుస్థితి జిల్లాలో 3 వేల మందికిపైగా సిబ్బంది పుష్కర విధులు నిర్వహిస్తుండగా, వారికి భోజనం ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. కానీ అన్ని ప్రాంతాల్లో సకాలంలో భోజనాలు పెట్టడం లేదు, ఉన్నతాధికారులు బిస్కెట్లు, అరటిపండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ బస్టాండ్‌లో శిబిరానికి అవికూడా వెళ్లకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. -
3న సామూహిక నిరహార దీక్షలు ప్రారంభం
సూర్యాపేట : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద వేలాది ఉపాధ్యాయులతో సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించే ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ ఇస్తూ 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగ సేవలు అందించే ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వెంటనే సీఎం స్పందించి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పదో పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, పండిట్, పీఈటి పోస్టుల అప్‌గ్రేడేషన్ చేయాలని, స్పెషల్ టీచర్స్‌కు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యామా రమేష్, ఎ.బ్రహ్మచారి, తిరుమలేష్, జితేందర్‌రెఇ్డ, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు ప్లేటులో...
ఆకలిలో మర్చిపోయే ప్రేమను కూడా ప్రేమ అనవచ్చు.ప్రేమలో ఆకలిని కూడా మరిచిపోయేలా చేసేది నాన్న ప్రేమ అనవచ్చు. నిజమే! నాన్న ప్రేమ కడుపు నింపేస్తుంది.రేపు ఫాదర్స్ డే! నిజానికి ప్రతిరోజూ ఫాదర్స్ డే! రేపు ఫాదర్స్ డే వేడుకలు.నాన్నకు ఏమైనా వండిపెడితే బాగుంటుంది కదూ! ప్రేమగా వండిపెడితే ఇంకా బాగుంటుంది కదూ! పెసరట్టు అమ్మ ఆరు నెలలుగా అమెరికాలో ఉంటోంది. ఇంకో రెండు మూడు నెలల్లో వచ్చేస్తుంది. అమ్మ ఉన్నప్పుడు వంటిల్లు ఎలా ఉంటుందో కూడా నాన్నకు తెలియదు. ఇప్పుడు నాన్న నేను లేచేసరికి టిఫిన్లు చేసి సిద్ధంగా ఉంచుతారు. ‘ఎందుకు నాన్నా.. పనివాళ్లు ఉన్నారుగా’ అంటే వినరు. సండే అయితే స్పెషల్స్‌తో అదరగొట్టేస్తారు. నాన్నకు పెసరట్టు అంటే చాలా ఇష్టం. నాన్నను సర్ప్రైజ్ చేయడానికి పెసరట్టు ట్రై చేస్తుంటాను. పెసరట్టు కాలుతుంటే దాని మీద అన్ని ఉల్లిపాయలు, ఇన్ని పచ్చిమిర్చి ముక్కలు, అంత కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ ఉంటుందీ.. అదన్నమాట. - నానీ కావల్సినవి: గుండు పెసరపప్పు - కప్పు; కొత్తిమీర - కొద్దిగా బియ్యం - 2 టీ స్పూన్లు; ఉల్లిపాయ - 1 (తగినన్ని) అల్లం - చిన్నముక్క; జీలకర్ర - టీ స్పూన్ పచ్చిమిర్చి - 4; ఉప్పు - తగినంత తయారీ: పెసరపప్పును కడిగి, కనీసం 5 గంటల సేపు నానబెట్టాలి. మిక్సర్జార్లో నానిన పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. స్టౌపై పెనం పెట్టి వేడిచేయాలి. పెనం మధ్యలో పిండి వేసి గరిటెతో గుండ్రంగా తిప్పాలి. దోసెలా వేయాలి. అట్టు మీద తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లి చుట్టూ టీ స్పూన్ నూనె వేయాలి. మంట తగ్గించి పెనం మీద మూత పెట్టాలి. 2-3 నిమిషాలాగి మూత తీసి, అట్టు కాలిందేమో చూసుకొని, జాగ్రత్తగా రెండోవైపుకు తిప్పాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. పెసరట్టుకు అల్లం పచ్చడి కాంబినేషన్ అద్దిరిపోతంది. ట్రై చేయండి. కొబ్బరిపాల పాయసం నాన్నకు కొబ్బరి పాల పాయసం అంటే చాలా ఇష్టం. నా పుట్టిన రోజున, పండగలప్పుడు అమ్మ అదే చేస్తుంది. నేనూ అమ్మ దగ్గరే ఈ పాయసం చేయడం నేర్చుకున్నాను. బాగా కిస్మిస్లు, జీడిపప్పులు, నెయ్యి వేస్తే కొబ్బరి పాల పాయసం ఎంతైనా లాగించవచ్చు. ఈ ఫాదర్స్ డే కి నాన్నకోసం కొబ్బరి పాలపాయసం చేస్తాను. - ఆదాశర్మ కావల్సినవి: వెన్నతీయని పాలు - 4 కప్పులు; కొబ్బరి పాలు - కప్పు; పచ్చికొబ్బరి పేస్ట్ - కప్పు (కొబ్బరి ముక్కలను మిక్సర్జార్లో వేసి మెత్తగా చేయాలి, పేస్ట్ మెత్తగా అవ్వాలంటే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలపచ్చు); పచ్చికొబ్బరి తరుగు - పావు కప్పు, పంచదార - కప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూన్, జాజికాయ పొడి - పావు టీ స్పూన్; నెయ్యి - టీ స్పూన్; జీడిపప్పు పలుకులు - 10; కిస్మిస్ - తగినన్ని తయారీ: మందపాటి గిన్నెలో పాలు మోసి మరిగించాలి. దీంట్లో కొబ్బరి పాలు, పేస్ట్, సన్నగా తరిగి కొబ్బరిముక్కలు వేసి ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా యాలకులపొడి, జాజికాయపొడి, నెయ్యి వేసి కలపాలి. చివరగా నెయ్యిలో వేయించి జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసిదించాలి. గోంగూర పచ్చడి నాకు నార్త్ ఇండియన్ వంటకాల రుచులే తెలుసు. అమ్మ చేసే వంటలన్నీ బాగా ఇష్టంగా తింటాను. టాలీవుడ్‌కి వచ్చాక ఇక్కడి పచ్చళ్లు బాగా నచ్చాయి. మా నాన్నగారు గోంగూర పచ్చడిని బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా సరదాగా ట్రై చేస్తుంటాను. కావల్సినవి: గోంగూర - 300 గ్రాములు నూనె - టీ స్పూన్; ఎండుమిర్చి - 10 ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు మెంతులు - 1/2 టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు - 3; ఉప్పు - తగినంత ఎర్ర ఉల్లిపాయ - 1 (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి) పోపులోకి: నూనె - 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి - 4 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి); నల్ల గుండు మినప్పప్పు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ; శనగపప్పు - టీ; స్పూన్; ఎండుమిర్చి - 2; ఆవాలు - అర టీ స్పూన్ తయారీ: గోంగూరను శుభ్రపరిచి తడిపోయేంతవరకు ఆరబెట్టాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి నూనె వేసి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో గోంగూర వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. రోట్లో లేదా మిక్సర్జార్లో వెల్లుల్లి రెబ్బలు, వేయించిన దినుసులు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. దీంట్లో ఉడికించిన గోంగూర వేసి బ్లెండ్ చేయాలి. రుబ్బిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. మూకుడులో టీ స్పూన్ నూనె వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చివేయించాలి. కరివేపాకు వేసి పోపు చల్లారాక గోంగూర పచ్చడిలో కలపాలి. కావాలనుకుంటే చిటికెడు ఇంగువ కూడా పోపులో వేసుకోవచ్చు. - రకుల్ ప్రీత్‌సింగ్ సింధీ ఆలూ టుక్ ‘నాన్నకు ఆలూ టుక్ ఇష్టం’ కావల్సినవి: బేబీ పొటాటోలు (చిన్న బంగాళదుంపలు) - 20 కారం - 3/4; ఉప్పు - తగినంత; మిరియాలపొడి - పావు టీ స్పూన్ తయారీ: గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి బంగాళదుంపలను ఉడికించాలి. తర్వాత నీళ్లు వడకట్టి బంగాళదుంపలను పక్కన ఉంచాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగాక ఉడికిన బంగాళదుంపలను గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. చల్లారాక ఒక్కో బంగాళదుంపను అరచేతితో అదమాలి. మళ్లీ కాగుతున్న నూనెలో వేసి వేయించి, ప్లేట్లోకి తీసుకొని కారం, మిరియాల పొడి, ఉప్పు చల్లి వెంటనే సర్వ్ చేయాలి. - తమన్నా గుత్తొంకాయ నేను కిచెన్‌లోకి వెళ్తానంటే నాన్న కంగారు పడతారు. సరదాగా అమ్మతో కలిసి ఆటపట్టిస్తుంటారు. నాన్నకు గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. గుత్తొంకాయ కూరంటే చాలా పెద్ద పనే! కానీ, అమ్మ సాయంతో ఈ కర్రీ చేసి నాన్న చేత మార్కులు కొట్టేస్తా! కావల్సినవి: పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము - ఒకొక్కటి 100 గ్రాముల చొప్పున; చింతపండు - నిమ్మకాయ పరిమాణం (నీళ్లు పోసి నానబెట్టాలి); వంకాయలు - 6; ఉల్లిపాయలు - 1 (పెద్దది. సన్నగా తరగాలి); ఎండుమిర్చి - 4; నూనె - 2 టేబుల్ స్పూన్లు; కారం - టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత కొత్తిమీర - టీ స్పూన్ తయారీ: పల్లీలు, నువ్వులు వేయించి చేసిన పొడి, కొబ్బరి, చింతపండు గుజ్జు, కారం, తగినంత ఉప్పు కలిపి ముద్ద చేయాలి. వంకాయలను నాలుగువైపు లా కట్ చేయాలి. పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కట్ చేసిన వంకాయల్లో కూరాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలపాలి. కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, స్టఫ్డ్ వంకాయలు, మిగిలిన గ్రేవీ వేసి కలిపి ఉడికించాలి. వంకాయలు, మిశ్రమం చక్కగా ఉడికాక కొత్తిమీర చల్లి దించాలి. - నిహారిక -
బతకడమంటే మైలురాళ్లు దాటడం కాదు!
పేతురు యొప్పే (ఇప్పటి టెల్ అవీవ్ పట్టణం)కొచ్చి సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. మధ్యాహ్నం పూట మిద్దెమీద ప్రార్థన చేస్తూ బాగా ఆకలిగొన్నాడు. అప్పుడు అన్ని రకాల జంతువులు, పురుగులు, పక్షులున్న ఒక దుప్పటి నాలుగు చెంగులతో ఆయన ముందు దించబడగా, వాటిని చంపుకొని తిని ఆకలి తీర్చుకొమ్మని చెప్పే ఒక స్వరం వినపడింది. ఎంతో నిష్ట కలిగిన యూదుడనైన తాను నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి ఎన్నడూ తినలేదని పేతురు బదులిచ్చాడు. దేవునిలో కొచ్చిన తర్వాత మనిషి మారడం అనివార్యం. అలా దేవునిలో మారిన ప్రతి విశ్వాసీ ఒక అద్భుతమైన శక్తిగా పరిణామం చెందుతాడు. అలాంటివాళ్లే లోకాన్ని కూడా మార్చుతారు. అలా మూడుసార్లు జరిగింది. ఆ దర్శన భావమేమిటో పేతురుకి అర్థం కాలేదు. అంతలో కైసరయ పట్టణం నుండి వచ్చిన కొందరు ఆయన్ను కలిశారు. అక్కడి కొర్నేలీ అనే భక్తిపరుడైన శతాధిపతి తన ఇంటికొచ్చి తన వారందరికీ క్రీస్తు సువార్త ప్రకటించమంటూ పంపిన ఆహ్వానాన్ని వారు పేతురుకు తెలిపారు. పేతురులాంటి ఛాందస యూదుల దృష్టిలో సున్నతిలేని రోమీయుడైన కొర్నెలీ అన్యుడు, అంటరానివాడు. అతడిచ్చే మంచినీళ్లు కూడా ముట్టరువారు. అయితే అపవిత్రమైనవి ఆరగించమన్న దైవదర్శన భావం క్రీస్తు రక్షణ సువార్తను ఇక నుండి అన్యులకు కూడా ప్రకటించమన్న దైవాదేశంగా అర్థం చేసుకొని పేతురు దానికి విధేయుడై అప్పటికప్పుడు కొర్నేలీ వద్దకు వెళ్లి వాళ్లింట్లో బసచేసి అక్కడి ఐదుమందిని ప్రభువులోనికి నడిపించాడు. అలా అన్యులై క్రైస్తవంలోకి వచ్చిన వారందరికీ ఆద్యుడయ్యాడు (అపొ.కా. 9-43). యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి విశ్వాసిలో మార్పు తేకుండా ఉండదు. పేతురులో కూడా క్రమంగా మార్పులొచ్చాయి. సత్యవాక్య ప్రబోధకుడుగా పేతురు జీవితంలో ముందు సత్యప్రతిష్ట జరగాలి. ‘దేవుడు పరమ తండ్రిగా గల వసుధైక కుటుంబంగా ఈ లోకాన్ని మార్చే పనిలో అతను అందరితో కలిసేవాడుగా మారాలి. వృత్తి కారణాలవల్ల చర్మకారులతో ఛాందస యూదులు కలవరు. కాని పేతురు వచ్చి చర్మకారుని ఇంట్లో బస చేసి అతని ఆతిథ్యం స్వీకరించడమే అతనిలో మార్పునకు నిదర్శనం. అయితే చర్మకారులకే కాదు సున్నతి లేని అన్యులకు కూడా ప్రభువు మార్గం బోధించమని ఆదేశిస్తే పేతురు అందుకు కూడా సిద్ధమై మరో అడుగు ముందుకేయడం ఆత్మీయంగా అతను సాధించిన ఒక గొప్ప విజయం. ఎందుకంటే క్రైస్తవంలోకి సున్నతి కలిగిన యూదులకు మాత్రమే ప్రవేశముంటుందన్నది అతని స్థిరాభిప్రాయం. ఆ విషయంలో అపొస్తలుడైన పౌలుతో విభేదించాడు కూడా (గలతి 2:11-21). అయితే ఆ దర్శనంతో పేతురు చాలా మారాడు. దేవునిలో కొచ్చిన తర్వాత మనిషి మారడం అనివార్యం. అందుకే దేవునిలోకి వచ్చిన తర్వాత మోసగాళ్లు నిజాయితీపరులుగా, స్వార్థపరులు నిష్కామయోగులుగా, క్రూరులు ఎంతో సాత్వికులుగా మారడం చూస్తున్నాం. రంధ్రం పడిన చెంబు తనను తానెలా బాగుచేసుకోలేదో, పరిశుభ్రపర్చుకోలేదో మనిషి కూడా తనను తాను మార్చుకోలేడు, బాగు చేసుకోలేదు. అందుకు అతని సృష్టికర్తయైన దేవుడే పూనుకోవాలి. అలా దేవుడు మార్చిన వాడే నూతనసృష్టి అవుతాడు (2 కొరింథీ 5:17). దేవునిలో మారిన ప్రతి విశ్వాసీ ఒక అద్భుతమైన శక్తిగా పరిణామం చెందుతాడు. అలాంటివాళ్లే లోకాన్ని కూడా మార్చుతారు. మనమెవరమూ పుట్టుకతోనే పరిపూర్ణులం కాదు. కాబట్టే దేవుని తోడ్పాటుతో రోజూ కొంత నేర్చుకుంటూ క్రమంగా పరిపూర్ణులవుతాం. ఆ విధంగా విశ్వాస జీవన ప్రయాణంలో ప్రతి మజిలీని ఆస్వాదిస్తాం. అంతిమంగా యేసుక్రీస్తు స్వరూపాన్ని సంతరించుకునే అంతిమ గమ్యానికి చేరుకుంటాం. ఈ ప్రయాణంలో అందరికీ కలుపుకొంటూ పదిమందికీ చేయూతనిస్తూ ముందుకు సాగాలి. జీవించడమంటే అలా మనుషులను సంపాదించుకొంటూ ముందుకు సాగడమే తప్ప మైలురాళ్లు దాటడం కాదు. గుండెనిండా పగ, ద్వేషం నింపుకుంటే అవి చివరికి మనల్నే దహించేస్తాయి. ప్రేమ నిండిన గుండె ప్రేమనే గుబాళింప చేస్తుంది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
నినాదాలపై నిఘా సరే... ఆకలికేకల మాటో..?
అవలోకనం ఆంగ్లీకరణకు గురైన మధ్యతరగతిలోని మనం.. భారతదేశంలోని మెజారిటీ ప్రజల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోం. మన బాధలు, ఆరాటాలు, ఆదుర్దాలను మాత్రమే చర్చించాలని తాపత్రయ పడుతుంటాం. మిగిలిన భారతీయులందరూ మనకు అసందర్భం కిందే లెక్క. ఇది జాతి వ్యతిరేకత కాకపోతే దీన్ని మరే పేరుతో పిలవాలి? ఒక విధంగా చూస్తే భారత్ ఓ ప్రత్యేక జాతి. తమది కాని, ప్రజానీకం ఉపయోగించే భాషకు భిన్నమైన భాషలో మాట్లాడే కులీన వర్గాన్ని కలిగిన ఒకే ఒక ప్రధాన దేశం మనది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ మరే ఇతర ప్రధాన నగరం విషయంలో అయినా సరే ఇది ముమ్మాటికీ నిజం. కులీనవర్గం అంటే నా దృష్టిలో జనాభా పరంగా మైనారిటీ లో ఉన్నప్పటికీ ఆర్థిక ఎజెండాలో, జాతీయ వార్తల ఎజెండాలో ఆధిపత్యం చలాయిస్తున్న వర్గమని అర్థం. ఐదు కోట్లమంది భారతీయులకు మాత్రమే పాస్‌పోర్టులు ఉన్నాయని ప్రభుత్వ డేటా చెబుతోంది. అంటే జనాభాలో ఐదు శాతం మంది అన్నమాట. నా అంచనా ప్రకారం ఇంగ్లిష్‌ను తమ ప్రథమ భాషగా కలిగిన భారతీయుల కంటే వీరి సంఖ్య ఎక్కువన్నమాట. వీరు తమ ‘మాతృభాష’లో అంటే హిందీ, గుజ రాతీ, తమిళం, మరాఠీ, తెలుగు, ఒరియా, కన్నడ వంటి భాషల్లో మాట్లాడగలు గుతూ ఉండొచ్చు కానీ అంత బాగా మాట్లాడలేరు. అక్షరాలను చదవొచ్చు కానీ వీరు ఈ ‘మాతృభాష’లో సాహిత్యం లేదా వార్తలను చదవలేరు. టీవీ సీరియళ్లు, సినిమా వంటి వాటిలో సంగీతం కోసం తప్పితే, వీరి సాంస్కృతిక ప్రాధాన్యత ఇంగ్లిష్‌లోని విషయంపైనే మొగ్గుచూపుతుంటుంది. భారతీయులు సాధ్యమైనంత ఎక్కువగా ఇంగ్లిష్ మాట్లాడుతూ, రాస్తుంటా రని, అందుకే ఇప్పుడు ఇంగ్లిష్‌ని భారతీయ భాషగా గుర్తిస్తున్నారని చెబుతున్నారు. దీన్ని నేను షరతులతో ఒప్పుకుంటూనే, మన టీవీ చానళ్లలో మాట్లాడు తున్న, మన మీడియాలో రాస్తున్న ఇంగ్లిష్ అసలైన భాషకు ముతక రూపం మాత్ర మేనని చెప్పదలిచాను. మరి ఈ రకమైన ఇంగ్లిష్ ఆధిక్యత మనల్ని ఏయే రూపాల్లో ప్రభావితం చేస్తోంది? మొదటి అంశం ఏమిటంటే, పట్టణ మధ్యతరగతి ప్రజల ఆరాటాలను, ఆదుర్దాలను జాతీయ ప్రాధమ్యాలుగా ముందుపీటిని ఉంచడం. పోషకాహార లోపం వల్ల దేశంలో సంభవిస్తున్న మరణాల కంటే విద్యార్థుల నినాదాలకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టడానికి మన మీడియా అమితాసక్తి చూపు తోంది. జాతి వ్యతిరేక నినాదాల వల్ల ఎంతమంది భారతీయులు నేరుగా ప్రభావి తులవుతున్నారో అస్పష్టమే. ఆ నినాదాల వల్ల దేశభక్తిపరులుగా మనం విచారం వ్యక్తం చేసి ఉండొచ్చు. కాని ఆ నినాదాలు మాటలు మాత్రమే. అదే సమయంలో ఒక సంవత్సరంలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఏటా దేశంలో పోషకాహార లోపం వల్ల 5 లక్షల మంది భారతీయ పిల్లలు విషాద మరణాలకు గురవుతు న్నారు. కానీ టీవీల్లో ఆగ్రహావేశాలతో కూడిన చర్చకు తగిన విషయంగా ఈ మరణాలకు చోటు లభించడం లేదు. ఎందుకంటే ఈ మరణాలు ఇంగ్లిష్ మాట్లాడే మధ్యతరగతిని ఏమాత్రం ప్రభావితం చేయవు. దీనివల్లే మన ఆర్థిక ప్రాధాన్యతలు వక్రీకరణకు గురవుతున్నాయి. జాతీయ వాద మధ్యతరగతిపైనే మీడియా దృష్టి పెడుతోంది కాబట్టి మనం లక్ష కోట్ల విలు వైన బుల్లెట్ ట్రైన్‌పైనే తీవ్రంగా చర్చిస్తుంటాము. దేశంలో 30 కోట్లమంది ప్రజలు హీనావస్థలో కాకున్నా భయంకరమైన దారిద్య్ర పరిస్థితుల్లో ఉంటున్న విషయం మన కంటికి ఆనదు. దీనికి కారణం చాలా సాధారణమైనది. భారత్‌లో పేదలకు తమదైన వాణి లేదంతే. మన దేశంలో రాజకీయాలు ఈ మధ్యతరగతి తోనే తీవ్ర వైపరీత్యంతో ప్రభావితం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం, కశ్మీరీ వేర్పాటు వాదం లేదా ఇస్లామిక్ ఉగ్రదాడుల కంటే ఎక్కువగా ఈశాన్య భారత్ లేదా మధ్య భారత్‌లోని తీవ్రవాదుల దాడుల్లోనే భారతీయులు అధికంగా చనిపోతున్నారు. దీనికి సంబంధించిన డేటా చాలా స్పష్టంగా ఉంది. కాని మన పట్టణ మధ్య తరగ తి ఆదుర్దాను ప్రతిఫలిస్తుంది కాబట్టే మీడియాలో ఇస్లామిక్ ప్రమాదంపై పదే పదే చర్చలు జరుగుతుంటాయి. అదే సమయంలో మావోయిస్టు తీవ్రవాదం, ఈశాన్య భారత్‌లోని వేర్పాటువాదం వీరిని అంతగా ప్రభావితం చేయదనుకోండి. ఇందు వల్లే పాకిస్తాన్‌కు ఎదురొడ్డుతున్న మన సైనికులు ప్రమాదవశాత్తూ చనిపోయినా వారిని హీరోలుగా చూపిస్తుంటాం. సౌరవ్ కాలియా నుంచి హనుమంతప్ప వరకు సరిహద్దుల్లో చనిపోతున్న పలువురి సైనికుల పేర్లు మధ్యతరగతి భారతీయులకు సుపరిచితమే కానీ ఈశాన్య భారత్‌లో లేదా ఛత్తీస్‌గఢ్‌లో నేలకొరిగిన ఒక పోలీసు లేదా పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న వారి పేర్లు చెప్పాలంటే మన మధ్య తరగతి తల్లకిందులైపోతుంటుంది. వందలాది భారతీయులు బోట్లు తల్లకిందులై, ఆలయాల్లో తొక్కిసలాటకు గురైన ఘటనల్లో మరణించడం గురించి మన పత్రికలు నిత్యం నివేదిస్తూనే ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో యాదృచ్ఛికంగా విషాహారాన్ని ఆరగించి పిల్లలు మరణించడంపై, నేత్ర చికిత్స శిబిరాల్లో చూపు కోల్పోయిన అంధులపై, కల్తీ సారా వల్ల చూపు కోల్పోతున్న, చనిపోతున్న వారిపై మనం వార్తలు చూస్తూనే ఉంటాం. కాని విద్యార్థుల నినాదాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇలాంటి ఘటనలపై టీవీ చర్చలో లభించదు. కులీనవర్గానికి చెందిన ఒక మహిళ హత్యకు (షీనా బోరా కేసులోవలే) ఇస్తున్న కవరేజితో దీన్ని పోల్చి చూడాలని నేను సూచిస్తున్నాను. ఆంగ్లీకరణకు గురైన మధ్యతరగతిలోని మనం భారతదేశంలోని మెజారిటీ ప్రజల సమస్యలను పట్టించుకోం. మన బాధలు, ఆదుర్దాలను మాత్రమే చర్చించాలని మనం తాపత్రయపడుతుంటాం. మిగిలిన భారతీయులందరూ మనకు అసంద ర్భం కిందే లెక్క. ఇది జాతి వ్యతిరేకత కాకపోతే దీన్ని మరే పేరుతో పిలవాలి? ఇంగ్లిష్ ఆధిపత్యంకి సంబంధించి మరొక అంశాన్ని చూద్దాం. యూరప్ శాస్త్రీయ సంస్కృతిలోకి భారత మధ్యతరగతి చాలా తక్కువగా చొచ్చుకుపో యింది. మనం జనరంజకమైన వాటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటాం. యూరప్ శాస్త్రీయ సంగీతాన్ని, దాని ఏకస్వరమేళనను అర్థం చేసుకోనిదే యూరప్ సంస్కృతి గురించి అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. భారత్‌లో ఏక స్వర మేళన సంప్రదాయం లేదు. అంటే ఏకకాలంలో రెండు స్వరాలను ఆలపిస్తుం టాం. శాస్త్రీయ సింఫనీ కచ్చేరీని చూస్తున్నవారు ఆ కచ్చేరీలో హీరో లేకపోవడాన్ని గుర్తిస్తారు. సింఫనీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కండక్టర్ (నిర్వాహకుడు) అంటారు. ఈ నిర్వాహకుడు కనీసం ఒక పరికరాన్ని కూడా వాయించరు. తను సమయాన్ని మాత్రమే నిర్వహిస్తుంటారు. సింఫనీలో సంగీతకారులందరూ సమానమే. అదే హిందూస్తానీ లేదా కర్ణాటక సంగీత కచ్చేరీలో అంతరాల వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంటుంది. యూరప్ సమాజానికి ఈ సాంస్కృతిక సమానత్వం, ఏకస్వరమేళనకు ఉన్న సంబంధం ఏమిటి? నిజమైన టీమ్ క్రీడగా చెబుతున్న ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో వారిని ఉత్తమ జట్లుగా నిలుపుతున్నది ఇదేనా? భారతీయులకు ఇది తెలియక పోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో మన భారతీయులకు ఆసక్తికరమైన ఏకైక అంశం ఏదంటే పాప్ మ్యూజిక్, ట్వీటర్. ఇవి గాఢతను లేదా అర్థవంతమైన ఏర్పాటును కలిగి ఉండదు. ఇది సారహీనమైనది. అందుకే అనివార్యంగా అర్ధవంతమైనది కాదు. నిజమే. ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం వల్ల భారతీయులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆర్థికపరమైనది. ఇక్కడ సైతం మధ్యతరగతికే ప్రయోజనాలు కలుగుతున్నాయి. కానీ, మన జాతీయ సంవాదం, మన ప్రాధమ్యాలు, మన ఎజెండాకు ఇంగ్లిష్ మాట్లాడుతున్న మధ్యతరగతి కల్గించిన నష్టం తీవ్రాతితీవ్రమైంది. ఆ నష్టాన్ని పూరించడం కూడా సాధ్యం కాదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
ఆకలితో విద్యార్థుల విలవిల
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కుప్పం బహదూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్న భోజనం కోసం అలమటించారు. మధ్యాహ్న భోజనం బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీకి ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో వారు మంగళవారం భోజనం వండలేదు.అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 130 మంది విద్యార్థులు ఆకలితో విలవిలలాడిపోయారు. -
ఆకలి రాజ్యం.. భారత్
దేశంలో 19.4 కోట్ల మంది ఆకలి కేకలు చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే మొదటిస్థానం: ఐరాస వెల్లడి రోమ్/న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆకలితో అలమటించేవారు భారత్‌లోనే ఎక్కువ మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దేశంలో ఏకంగా 19.4 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య 79.5 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇది 1990-92లో వందకోట్లుగా ఉంది. చైనాలో ఆకలితో బాధపడేవారి సంఖ్య 28.9 నుంచి 13.3 కోట్లకు పడిపోవడంతో ఈ తగ్గుదల నమోదైందని వివరించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహారం, వ్యవసాయ విభాగం (ఎఫ్ఏఓ) తాజాగా 2014-15 సంవత్సరానికిగాను ప్రపంచ దేశాల్లో ఆకలిపై నివేదిక(ద స్టేట్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ 2015) విడుదల చేసింది. ఇందులో 19.4 కోట్ల మందితో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. 1990తో పోల్చుకుంటే దేశంలో ఆకలి కేకలు తగ్గినా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనానికి తిండి అందడం లేదని వివరించింది. ఆకలిని తరిమికొట్టేందుకు భారత్‌లో అనేక పథకాలు అమలవుతున్న విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించారు. అలాగే పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంలో ఎఫ్ఏఓ అధ్యయనం చేసిన 129 దేశాల్లో 72 దేశాలు గడచిన దశాబ్దకాలంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శించాయని తెలిపింది. -
కలలో ఆకలేల?
స్వప్నలిపి కడుపు పట్టుకుంటూ నిద్ర నుంచి టక్కుమని లేస్తాం. ఆకలిగా అనిపిస్తుంది. ఇంతలోనే అది భ్రమ అని తేలిపోతుంది. మరి ఆకలిగా ఎందుకు అనిపించింది? అది కల ఫలితం! కలలో మీరు ఆకలితో అలమటిస్తుంటారు. చేతిలో డబ్బులు ఉంటాయి. కాని భోజనం ఎక్కడా దొరకదు. మరోసారేమో... ఎటు చూస్తే అటూ నోరూరించే వంటకాలు కనిపిస్తుంటాయి. కానీ... చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇలా ‘ఆకలి’ నేపథ్యంగా రకరకాల కలలు వస్తుంటాయి. ‘ఈ నెల రోజుల కాలంలో ఒక్కరోజు కూడా ఆకలితో పడుకోలేదు. రోజూ సుష్టుగా భోజనం చేస్తున్నాను. మరి ఈ ఆకలి కల ఏమిటి?’ అనే సందేహం రావచ్చు. నిజానికి కలలో మన అనుభవంలోకి వచ్చే ఆకలి అనేది ఆహారానికి సంబంధించినది కాదు.. రకరకాల విషయాలకు అది సూచనప్రాయమైన వ్యక్తీకరణ మాత్రమే. ఆర్థిక సంక్షోభాలు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, అనుకున్న స్థాయిలో జీవనప్రమాణాలు లేవనుకున్నప్పుడు, ప్రేమరాహిత్యంతో బాధ పడుతున్నప్పుడు ఇలాంటి కలలు సాధారణంగా వస్తుంటాయి. చేస్తున్న పనిలో సంతృప్తి లభించనప్పుడు, చేయబోయే పనిలో సంతృప్తి ఉండదనే ఆలోచన వచ్చినప్పుడు, నేర్చుకోవాల్సిన విషయమేదో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ నిరాశ కలిగిస్తున్నప్పుడు... సాధారణంగా ఇలాంటి కలలు వస్తుంటాయి. -
ఇంకెన్నాళ్లీ అగచాట్లు..
బాలికల చదువుకు ఎన్నో అడ్డంకులు.. ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి అరకొర అవకాశాలు, ఆకలి, పేదరికం.. ఆర్థిక సమస్యలే అధికం వారంలో రెండు రోజులు కూలికి వెళ్తున్న విద్యార్థినులు 60 శాతంపైగానే.. లైంగిక వేధింపులకు గురవుతున్నామని చెప్పినవారు 34.1 శాతం మంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునేందుకు ఆడపిల్లలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. చదువుకునే అవకాశాల దగ్గరి నుంచి కుల వివక్ష, లైంగిక వేధింపుల వ రకూ నిత్యం ఏదో ఒక సమస్యతో వారు కొట్టుమిట్టాడుతున్నారు. సర్కారు బడులు, కాలేజీల్లో చదువుతున్న బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అధ్యయనంలో ఇటువంటి ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ శైలాజా రామయ్యర్, జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా ఈ సర్వే వివరాలను విడుదల చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ర్యాండమ్ పద్ధతిలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ప్రైవేట్ కళాశాలలు, నాలుగు రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులను ప్రశ్నించి.. ఈ సర్వే నివేదికను రూపొందించారు. పరిస్థితులకు అద్దం పడుతున్నాయి..: ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఇంటర్ బోర్డు కమిషనర్ శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. విద్యార్థినులకు ఫీజుల చెల్లింపు, హాస్టల్ సౌకర్యం, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థినులకు ఉచిత బస్‌పాస్‌లను అందించడం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి... ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ సర్వే వివరాల ద్వారా బాలికల దుర్భర పరిస్థితి వెల్లడైందని.. వారి చదువుకు తోడ్పడేలా ప్రభుత్వం విధానాలు రూపొందించాలని శాంతసిన్హా పేర్కొన్నారు. విద్యార్థినులకు చదువుకునే అవకాశాన్ని మెరుగుపర్చాలంటే మొదట ప్రతి నియోజకవర్గంలో ఒక బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఈనాటికీ అక్షరాలు నేర్వని, నేర్చుకునే వీలులేని పరిస్థితులు ఉండడం విచారకరమని ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఎం.వెంకటరెడ్డి పేర్కొన్నారు. సర్వే వివరాలివీ.. రాష్ట్రంలోని 62.7 శాతం మంది బాలికలు జూనియర్ కాలేజీ స్థాయిలోనూ కూలి పనికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. వారానికి రెండు రోజులు కూలిపనికి వెళుతున్నామని 46.2 శాతం బాలికలు వెల్లడించారు. వారానికి 1 నుంచి 3 రోజులు మాత్రమే కాలేజీకి వెళ్లే ముందు తింటామని, మిగతా రోజుల్లో ఖాళీ కడుపుతోనే కాలేజీకి వెళ్లాల్సి ఉంటుందని 30.2 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న దళిత, ఆదివాసీ విద్యార్థినుల్లో 98.1 శాతం మంది ఉపాధ్యాయుల నుంచి కులవివక్ష ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇక 19.6 శాతం మంది బాలికలు ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురైనట్లు సర్వే వెల్లడించింది. వారిలో 37 శాతం మంది బాలికలు ప్రాథమిక స్థాయిలోనే లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. ఇక 12 శాతం మంది ఉపాధ్యాయుల నుంచి లింగ వివక్ష ఎదుర్కొన్నామని చెప్పారు. దాదాపు అందరు విద్యార్థినులు తాము ఇంటినుంచి కళాశాలకు వెళ్లడం, రావడం వల్ల వారికి సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా హాస్టళ్లను నెలకొల్పితే చదువు కొనసాగించగలుగుతామన్నారు. 73.7 శాతం మంది బాలికలు తమ తల్లి మద్దతుతోనే చదువును కొనసాగించగలుగుతున్నామని, తండ్రి నుంచి ప్రోత్సాహం ఉండడం లేదని పేర్కొన్నారు. -
కరెంట్ షాక్‌తో ఆకలిని చంపేస్తుంది..
వాషింగ్టన్: బరువు తగ్గేందుకు రకరకాల పద్ధతులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అందులోకి తాజాగా మరో కొత్త పద్ధతి చేరింది. అదే.. షాక్ కొట్టించి ఆకలిని చంపేసే పద్ధతి! కడుపులోని నాడులకు విద్యుత్ ప్రేరణలు ఇచ్చి ఆకలిని చంపేసే ఈ పద్ధతికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఇటీవల అనుమతి ఇచ్చేసింది. ఈ పద్ధతిలో ‘మ్యాస్ట్రో రీచార్జబుల్ సిస్టమ్’ అనే పరికరంతో స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్లకు చికిత్స చేసేందుకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) 35 నుంచి 45 మధ్యలో ఉండి, 18 ఏళ్లు నిండిన రోగులకే దీనిని ఉపయోగించాలని షరతు కూడా పెట్టింది. స్థూలకాయ చికిత్సకు ఇలాంటి పరికరం తయారు చేయడం, దానికి ఆమోదం లభించడం ఇదే తొలిసారట. ఈ పరికరం సాయంతో కొన్ని నెలలపాటు ప్రయోగాలు చేయగా.. వాలంటీర్లలో సగంమందికి పైగా 20 శాతం వరకూ అదనపు బరువును కోల్పోయారట. హైబీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకూ ఇది ఉపయోగపడుతుందట. ఇతర ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండానే రోగులకు ఆకలి లేకుండా చేయొచ్చు కాబట్టి.. ఈ పద్ధతి చాలా సురక్షితమని దీని తయారీదారులు చెబుతున్నారు. -
హీరోకు చుక్కలు చూపించిన సినిమా
దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఐ' సినిమా ఏ రేంజిలో హిట్టవుతుందో గానీ.. అందులో హీరో విక్రమ్‌కు మాత్రం చుక్కలు చూపించింది. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా తన శరీరబరువును సగానికి తగ్గించుకోవాల్సి వచ్చింది. తనకు విపరీతంగా ఆకలి వేసేదని, తినాలని కూడా అనిపించేదని, ఆకలి ఆపుకోవడం చాలా కష్టంగా ఉండేదని విక్రమ్ అన్నాడు. దాంతో చివరకు పిచ్చెక్కినట్లు అనిపించేదని చెప్పాడు. ఐ సినిమాలో విక్రమ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. వాటిలో ఒకటి బాడీ బిల్డర్ పాత్ర. మరొకటి అందవికారంగా కనపడే వ్యక్తి పాత్ర. ఈ పాత్ర కోసమే తాను తిండి మానుకుని, విపరీతంగా జిమ్‌లో వ్యాయామాలు చేయాల్సి వచ్చిందని విక్రమ్ చెప్పాడు. కావాలనుకుంటే స్టెరాయిడ్లు వాడి సులభంగా పెంచుకోవచ్చని, కానీ తానలా చేయదలచుకోలేదని అన్నాడు. దర్శకుడు శంకర్ తనను బరువు తగ్గాలని చెప్పలేదు గానీ, తనంతట తానే అలా చేశానన్నాడు. కావల్సిన లుక్ కోసం తాను ఆకలి చంపుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. కేవలం జ్యూసులు తాగి పొట్ట నింపుకున్నట్లు వివరించాడు. బయటకు వెళ్తే రహస్యం తెలిసిపోతుందని తాను ఎక్కడికీ వెళ్లలేదని తెలిపాడు. ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండేవాడినని, ఇంట్లో కూడా బిర్యానీలు నోరు ఊరించినా.. నోరు కట్టుకున్నానని అన్నాడు. -
ఉపాధి మర్రి
చెట్టు నీడనిస్తుంది. కానీ ఈ చెట్టు.. బతుకుదెరువునిస్తోంది. కాలమేదైనా సరే... అక్కడి పుచ్చకాయలు చల్లగా కడుపునింపుతాయి. నగరంలో తిరిగి అలసిన వారికి ఆ చెట్టు కింది నిమ్మ సోడా సాంత్వననిస్తుంది. మోటార్ సైకిల్‌పై మొబైల్ మెస్... ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతుంది. అద్దెలు చెల్లించలేని చిరు వ్యాపారులకు బతుకు నీడనిస్తోంది మింట్ కాంపౌండ్ సమీపంలోని మర్రి చెట్టు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆ చెట్టు డజనుకుపైగా వ్యాపారాలకు కేంద్రమైంది. ట్యాంక్‌బండ్‌పై షికార్లు కొట్టి అలసిన వారు, కార్యాలయాల్లో పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వచ్చిన ఉద్యోగులు, ఆయా పనుల నిమిత్తం సెక్రటేరియేట్‌కు వచ్చే సామాన్యుల అవసరాలను తీర్చే కేంద్రంగా మారింది. ప్రతి కాలంలో పుచ్చకాయ... వేసవిలోనే పుచ్చకాయలు దొరుకుతాయి. ఈ మర్రిచెట్టు నీడలో కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పుచ్చకాయలు అందుబాటులో ఉంటాయి. చుట్టుపక్కల కార్యాలయాల వాళ్లే కాదు... కూడలిలో ఉండటంతో వచ్చీపోయే జనం కూడా అక్కడ ఆగి మరి పుచ్చకాయలు తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ పుచ్చకాయల వ్యాపారంపై ఆధారపడి రెండు కుటుంబాలు బతుకుతున్నాయి. ‘ఫుల్’గా భోజనం... ఆకలి అవుతుంటే దగ్గర్లో ఏ హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దామన్నా వందకు పైగా చెల్లించాల్సిందే. కానీ ఈ చెట్టు నీడన 40 రూపాయలకే పూర్తి భోజనం లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయలేని విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు... అనేక మంది ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఇలా మూడు నుంచి నాలుగు కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. భోజనం వద్దనుకుంటే... అల్పాహార కేంద్రం కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్య పరీక్షలు... ఇదే మర్రిచెట్టు నీడన ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. 20 రూపాయలు ఇస్తే చాలు మీ ఎత్తుకు తగ్గ బరువున్నారా? మీ ఒంట్లో ఎంత కొవ్వు శాతం ఎంత? బీపీ తక్కువా? ఎక్కువా? తెలిపే ఓ యువకుడు కనిపిస్తాడు. ఒంటి నొప్పులకు, ఒత్తిడికి అక్యుపంక్చర్ వైద్యం ఎంతో ఉపశమనం. దీనికి సంబంధించిన పరికరాలు కూడా ఈ చెట్టు కింద లభిస్తాయి. వస్త్ర వ్యాపారం అదుర్స్.. సామాన్యులకు అందుబాటు ధరలో దుస్తుల వ్యాపారం ఓ పక్క జరుగుతుంటే... మరోపక్క కాలి బూట్లు, చెప్పులు అమ్ముతుంటాడో వ్యక్తి. ఓవైపు సోడా బండి, ఆ పక్కనే ఫ్రూట్ జ్యూస్ బండి ఉంటుంది. ఇంత మంది వచ్చే చోట వాహనాల రద్దీ ఉంటుంది కదా! వాటి పొల్యూషన్ చెకప్ చేయడానికి ఆర్టీఏ అనుమతి పొందిన ఏజెంట్ కూడా అక్కడే సిద్ధంగా ఉంటాడు. ఇలా చిరు వ్యాపారులకు ఆ మర్రి చెట్టు కల్పవృక్షంగా మారింది. ...::: వాంకె శ్రీనివాస్ -
బరువు తగ్గాలి.. సాయం చేయరూ!
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... ఒక్కో దేశంలో ఒక్కోరకమైన సమస్య... తినడానికి తిండి లేదు, ఆకలితో చచ్చిపోతున్నాం... సాయం చేయండి అనేది ఒకరకమైన అర్థింపు. దీని గురించి మనకు బాగా తెలుసు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమైన భారతదేశంలో ఇది చాలా సహజమైన అర్థింపు. మనకు ఇదే పెద్ద సమస్య. మరి తినడానికి పుష్టిగా తిండి ఉన్నా... ఇలాంటి అర్థింపు సమస్యలెన్నో ఉంటాయి! అవేమిటో అభివృద్ధి చెందిన దేశాల్లోని మనుషుల జీవనశైలిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఉదాహరణకు క్రిస్టియనా బ్రిగ్స్(26) అనే ఈ బ్రిటన్ మహిళ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను చూడండి.... ఊభకాయం ఇబ్బందిగా మొదలై ఇప్పుడు క్రిస్టియానాను తీవ్రంగా బాధపెడుతోంది. ఇప్పుడు క్రిస్టియానా బరువు తగ్గే ప్రయత్నంలో ఉంది. అందుకు ట్రీట్మెంట్ ఏమిటి? అంటే... ఆహార నియంత్రణ పాటించడం. నియంత్రణ అంటే తినడం మానేయడం కాదు... మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం కాకుండా.. శరీరంలో కొవ్వును కరిగించే ఆహారం తీసుకోవాలి. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, తనకు ఈ విషయంలో ప్రభుత్వమే సాయం చేయాలని మీడియాకు తన దీనగాథను వివరించి ప్రభుత్వం నుంచి సహాయం కోరుకొంటోంది. పోషకాహారం తిని ఊబకాయాన్ని నిరోధించుకోవడానికి అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తోంది. నిరుద్యోగి అయిన క్రిస్టియానాకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. రెండుసార్లు విడాకులూ అయ్యాయి. ఒక్కో వివాహ ఫలితంగా ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలతో కలిసి ఉండే ఆమెకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏడాదికి 20వేల పౌండ్ల భృతి అందుతోంది. ఇది సరిపోవడం లేదు. తక్కువ కొవ్వు పదార్థాలుండే ఆహారం ధర చాలా ఎక్కువ ఉంది... అందుకోసం సాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆమె బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొంటోంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో! -
చివరి క్షణాలు
ఆకలి... మనిషికి అతి పెద్ద శత్రువు. గుప్పెడు మెతుకులు లేక పేగులు మెలిపడుతుంటే... కలిగే బాధ కన్నీరుగా కనుల జారుతుంటే... బతుకు మీద ఆశ అడుగంటిపోతుంది. ఇలాంటి జన్మనిచ్చినందుకు భగవంతుడి మీద సైతం కోపం వస్తుంది. ఎనభైల్లో ఇథియోపియా ప్రజల పరిస్థితి అదే! 1983 నుంచి 85 వరకు ఇథియోపియాలో దారుణమైన కరవు కమ్ముకుంది. ఆకలి మంటలకు నాలుగు లక్షల మంది జీవితాలు ఆహుతైపోయాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలు. అభాగ్యుల ఆక్రందనలు. వీధుల నిండా శవాల గుట్టలు. వాటిని పీక్కు తినడానికి వచ్చిన రాబందుల రెక్కల చప్పుళ్లు. అంతా భయానకం... బీభత్సం... బాధాకరం... హృదయ విదారకం! పెద్దవాళ్లే ఆకలికి తాళలేక అలమటిస్తుంటే... ఇక పసివాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది! డొక్కలు ఎండిపోయి, చర్మాలు అతుక్కుపోయి, ఎముకల గూళ్లలా ఉన్న బిడ్డలను చూసి కన్నవాళ్ల మనసులు కుంగిపోయేవి. కళ్లముందే బిడ్డలు నిర్జీవంగా రాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూండి పోవడం తప్ప ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డని కాపాడుకోవడానికి ఓ తండ్రి పడిన తపనకు సాక్ష్యమే ఈ చిత్రం. ఆ దారుణ కరవును తరిమి కొట్టలేకపోయినా... కొందరి ప్రాణాలనైనా నిలబెట్టాలన్న ఆశతో కొన్ని ఎన్జీవోలు ఆహా రంతో అక్కడకు చేరుకున్నారు. వారు జావను ఇవ్వగానే ఓ తండ్రి... చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు గబగబా దాన్ని తాగించసాగాడు. ‘తాగు నాన్నా తాగు’ అంటూ కొడుకును బతికించుకోవాలని తపన పడ్డాడు. అప్పుడే ఫొటోగ్రాఫర్ జాన్ ఐజక్ ఈ ఫొటో తీశాడు. కానీ దురదృష్టం... తర్వాతి రోజు రాత్రే ఆ చిన్నారి కన్నుమూశాడు. అతడు పోయినా... అతడి చివరి క్షణాలను ఈ ఫొటో తనలో దాచుకుంది. నాటి దారుణ స్థితిని ప్రపంచానికి పదే పదే గుర్తు చేస్తూనే ఉంది!