ఎమోషనల్‌ ఈటింగ్ డేంజరే! | Emotional eating dangers! | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌ ఈటింగ్ డేంజరే!

Aug 29 2017 1:01 AM | Updated on Sep 17 2017 6:03 PM

ఎమోషనల్‌ ఈటింగ్ డేంజరే!

ఎమోషనల్‌ ఈటింగ్ డేంజరే!

కొంతమంది కోపంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, తోచకపోయినా తింటూ ఉంటారు.

కొంతమంది కోపంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, తోచకపోయినా తింటూ ఉంటారు. అది చాలా డేంజర్‌. అలాంటి వారి కోసం..కంపెనీ కోసమో, టైం పాస్‌ కోసమో తినే అలవాటును వెంటనే మానుకోవాలి. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినే అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలను నివారించవచ్చు. భోజనం చేసిన తరువాత (లంచ్‌) అది పూర్తిగా జీర్ణం కావడానికి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది.

అంటే కాయగూరలు, మాంసాహారం, ఆయిలీ ఫుడ్‌... ఇలా తీసుకున్న ఆహారాన్ని బట్టి సమయం ఆధారపడి ఉంటుంది. ఓవర్‌ ఈటింగ్‌ మంచిది కాదు. పొట్టను మూడు వంతుల వరకే నింపాలి. బుక్‌ లేదా పేపర్‌ చదువుతూ, టీవీ చూస్తూ, మరేదో పని చేసుకుంటూ తినే అలవాటు మానేయాలి. ప్రశాంతంగా కూర్చుని భోజనం మీదే మనసు కేంద్రీకరించి తినడాన్ని అలవాటు చేసుకోవాలి. భోజనం పూర్తయిన తరవాత ఐదు నుంచి పది నిమిషాల పాటు కూర్చుని సుమారు వంద అడుగులు నెమ్మదిగా నడవాలి. రాత్రి భోజనం మరీ పొద్దుపోయిన తరవాత చేయకూడదు. భోజనానికి పడుకోవడానికి మధ్య విరామం తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement