హీరోకు చుక్కలు చూపించిన సినిమా | Controlling hunger during 'I' shoot was challenging: Vikram | Sakshi
Sakshi News home page

హీరోకు చుక్కలు చూపించిన సినిమా

Published Tue, Jan 13 2015 4:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

హీరోకు చుక్కలు చూపించిన సినిమా

హీరోకు చుక్కలు చూపించిన సినిమా

దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఐ' సినిమా ఏ రేంజిలో హిట్టవుతుందో గానీ.. అందులో హీరో విక్రమ్కు మాత్రం చుక్కలు చూపించింది. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా తన శరీరబరువును సగానికి తగ్గించుకోవాల్సి వచ్చింది. తనకు విపరీతంగా ఆకలి వేసేదని, తినాలని కూడా అనిపించేదని, ఆకలి ఆపుకోవడం చాలా కష్టంగా ఉండేదని విక్రమ్ అన్నాడు. దాంతో చివరకు పిచ్చెక్కినట్లు అనిపించేదని చెప్పాడు. ఐ సినిమాలో విక్రమ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. వాటిలో ఒకటి బాడీ బిల్డర్ పాత్ర. మరొకటి అందవికారంగా కనపడే వ్యక్తి పాత్ర. ఈ పాత్ర కోసమే తాను తిండి మానుకుని, విపరీతంగా జిమ్లో వ్యాయామాలు చేయాల్సి వచ్చిందని విక్రమ్ చెప్పాడు.

కావాలనుకుంటే స్టెరాయిడ్లు వాడి సులభంగా పెంచుకోవచ్చని, కానీ తానలా చేయదలచుకోలేదని అన్నాడు. దర్శకుడు శంకర్ తనను బరువు తగ్గాలని చెప్పలేదు గానీ, తనంతట తానే అలా చేశానన్నాడు. కావల్సిన లుక్ కోసం తాను ఆకలి చంపుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. కేవలం జ్యూసులు తాగి పొట్ట నింపుకున్నట్లు వివరించాడు. బయటకు వెళ్తే రహస్యం తెలిసిపోతుందని తాను ఎక్కడికీ వెళ్లలేదని తెలిపాడు. ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండేవాడినని, ఇంట్లో కూడా బిర్యానీలు నోరు ఊరించినా.. నోరు కట్టుకున్నానని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement