'భవిష్యత్ లో తెలుగు సినిమా చేస్తా' | Will direct Telugu film in future, says Shankar | Sakshi
Sakshi News home page

'భవిష్యత్ లో తెలుగు సినిమా చేస్తా'

Published Tue, Dec 30 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

'భవిష్యత్ లో తెలుగు సినిమా చేస్తా'

'భవిష్యత్ లో తెలుగు సినిమా చేస్తా'

హైదరాబాద్: భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని తమిళ దర్శకుడు శంకర్ అన్నారు. విక్రమ్ హీరోగా తాను తెరకెక్కించిన 'ఐ' సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉన్నానని అన్నారు. భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఇది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మగధీర సినిమా చూసి రాజమౌళి అభిమాని అయ్యాయని శంకర్ అన్నారు. 'ఐ' సినిమా అందరినీ అలరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

హీరో విక్రమ్, కెమెరామన్ పీసీ శ్రీరాం, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'ఐ' సినిమా సంక్రాంతికి విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement