శంకర్ దర్శకత్వంలో కొత్త హీరో! | new hero in Director Shankar movie | Sakshi
Sakshi News home page

శంకర్ దర్శకత్వంలో కొత్త హీరో!

Published Thu, Jul 9 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

శంకర్ దర్శకత్వంలో కొత్త హీరో!

శంకర్ దర్శకత్వంలో కొత్త హీరో!

 ఇక్కడ కుడి పక్క ఫొటోలో కనిపిస్తున్న కుర్రాణ్ణి చూస్తుంటే, హీరో విక్రమ్ గుర్తొస్తున్నారు కదూ. టీనేజ్‌లో ఉన్నప్పుడు విక్రమ్ దిగిన ఫొటోనేమో అని ఊహించుకునే అవకాశం కూడా ఉంది. కానీ, ఇదసలు విక్రమ్ ఫొటో కాదు. ఆయన తనయుడు ధ్రువ్ కృష్ణ ఫొటో. హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు కదూ. ధ్రువ్ వెండితెర రంగప్రవేశానికి రంగం సిద్ధమవుతోందని సమాచారం. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా ధ్రువ్ పరిచయమవుతాడని చెన్నయ్ టాక్. శంకర్ వంటి దర్శకుడి చిత్రం ద్వారా పరిచయమైతే తనయుడి భవిష్యత్తు బాగుంటుందని విక్రమ్ భావిస్తున్నారట. ధ్రువ్ కోసం తాను విలన్‌గా చేయడానికి కూడా సిద్ధపడ్డారని సమాచారం. శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘రోబో 2’లోనే విక్రమ్ ప్రతినాయకునిగా నటించనున్నారట. వాస్తవానికి రజనీకాంత్ కథానాయకునిగా, ఆమిర్‌ఖాన్‌ని ప్రతినాయకునిగా అనుకుని శంకర్ ఈ కథ రెడీ చేశారట. కానీ, ఆమిర్ తిరస్కరించడంతో విక్రమ్‌ని శంకర్ అడిగారని, ఆయన ఆనందంగా అంగీకరించారని భోగట్టా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement