new hero
-
క్రేజీ కాంబినేషన్లో వైష్ణవ్ తేజ్ తొలి మూవీ
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ కుటుంబం నుంచి పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీశ్, సాయిధరమ్‌తేజ్, నిహారికలు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇటీవల చిరంజీవి చిన్న అల్లుడు(శ్రీజ భర్త) కల్యాణ్ దేవ్ విజేత చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా చిరు మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా హీరోగా పరిచయవుతున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు, ఆయన దర్శకత్వంలో ఘనవిజయం సాధించిన ‘రంగస్థలం’ చిత్రానికి రైటర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి పనిచేసే సాంకేతిక నిపుణల, నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. -
శివాజీ రాజా తనయుడు హీరోగా..
నెగెటివ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నటుడు శివాజీ రాజా. మధ్యలో హీరోగా ట్రై చేసినా.. మళ్లీ సహాయ పాత్రల్లోనే నటించారు. ప్రస్తుతం మా ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ పదవిలో యాక్టివ్‌గా ఉన్నారు. శివాజీ రాజా తనయుడు విజయ్ రాజాను హీరోగా పరిచయం చేయనున్నారు. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ డిఫరెంట్ టైటిల్‌తో రానున్న ఈ సినిమాను జూలై 11న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. -
యూ ట్యూబ్ టు హీరో
‘మళ్ళీ రావా’ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్. తొలి ప్రయత్నంలోనే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాహుల్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘మళ్ళీ రావా’ తర్వాత చాలా కథలు విన్నా. నూతన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా చేస్తున్నా. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ‘ఆల్ ఇండియా బక్చోద్’ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాం. ‘మెంటల్ మదిలో’ చిత్రదర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ‘అ’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె. రాబిన్ మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: అమిత్ త్రిపాఠి, మాటలు: వివేక్ ఆత్రేయ. -
శంకర్ దర్శకత్వంలో కొత్త హీరో!
ఇక్కడ కుడి పక్క ఫొటోలో కనిపిస్తున్న కుర్రాణ్ణి చూస్తుంటే, హీరో విక్రమ్ గుర్తొస్తున్నారు కదూ. టీనేజ్‌లో ఉన్నప్పుడు విక్రమ్ దిగిన ఫొటోనేమో అని ఊహించుకునే అవకాశం కూడా ఉంది. కానీ, ఇదసలు విక్రమ్ ఫొటో కాదు. ఆయన తనయుడు ధ్రువ్ కృష్ణ ఫొటో. హ్యాండ్సమ్గా ఉన్నాడు కదూ. ధ్రువ్ వెండితెర రంగప్రవేశానికి రంగం సిద్ధమవుతోందని సమాచారం. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా ధ్రువ్ పరిచయమవుతాడని చెన్నయ్ టాక్. శంకర్ వంటి దర్శకుడి చిత్రం ద్వారా పరిచయమైతే తనయుడి భవిష్యత్తు బాగుంటుందని విక్రమ్ భావిస్తున్నారట. ధ్రువ్ కోసం తాను విలన్‌గా చేయడానికి కూడా సిద్ధపడ్డారని సమాచారం. శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘రోబో 2’లోనే విక్రమ్ ప్రతినాయకునిగా నటించనున్నారట. వాస్తవానికి రజనీకాంత్ కథానాయకునిగా, ఆమిర్‌ఖాన్‌ని ప్రతినాయకునిగా అనుకుని శంకర్ ఈ కథ రెడీ చేశారట. కానీ, ఆమిర్ తిరస్కరించడంతో విక్రమ్‌ని శంకర్ అడిగారని, ఆయన ఆనందంగా అంగీకరించారని భోగట్టా. -
నటించే సమయం నాకు లేదు
పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం మన హీరోయిన్లకే తగునేమో. ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇంతకు ముందు కథ, దర్శకుడే ముఖ్యం అన్న సమంత, హీరో ఎవరన్నది అస్సలు పట్టించుకోనన్నారు. అన్నట్లుగానే ఇటీవల ఒక టాలీవుడ్ చిత్రంలో నవ నటుడితో ఁఅల్లుడు శీనురూ. చిత్రంలో రొమాన్స్ చేశారు. ఆ చిత్రానికి కోటిన్నరకు పైనే పారితోషికం అందుకున్నట్టు వార్తల్లోకెక్కారు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ రేంజే వేరు. కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. దీంతో ఇకపై నూతన హీరోల సరసన నటించనని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. టాలీవుడ్లో ఒక చిత్రంలో కొత్త హీరో సరసన నటించడంతో ఆ తరువాత అలాంటి అవకాశాలు చాలా వస్తున్నాయట. పారితోషికం కూడా భారీగా ముట్ట జెబుతామని ఆశ చూపుతున్నారట. అలా పారితోషికానికి ఆశపడి ఆ చిత్రాలను అంగీకరిస్తే తన మార్కెట్‌కు భంగం కలుగుతుందని భయపడ్డ సమంత నవ హీరోలకూ నో అంటున్నారని సమాచారం. నూతన నటులతో నటించే సమయం తనకు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారట. ప్రస్తుతం సమంత సూర్యతో జత కట్టిన అంజాన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత విజయ్‌తో నటించిన కత్తి విడుదల కానుంది.