క్రేజీ కాంబినేషన్‌లో వైష్ణవ్‌ తేజ్‌ తొలి మూవీ | Vaishnav Tej First Movie Directed By Buchi Babu Sana | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 26 2018 8:18 PM | Last Updated on Sun, Oct 28 2018 3:29 PM

Vaishnav Tej First Movie Directed By Buchi Babu Sana - Sakshi

హైదరాబాద్‌: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఆ కుటుంబం నుంచి పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, అల్లు శిరీశ్‌, సాయిధరమ్‌తేజ్‌, నిహారికలు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇటీవల చిరంజీవి చిన్న అల్లుడు(శ్రీజ భర్త) కల్యాణ్‌ దేవ్‌ విజేత చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా చిరు మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌  మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా హీరోగా పరిచయవుతున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.

సుకుమార్‌ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు, ఆయన దర్శకత్వంలో ఘనవిజయం సాధించిన ‘రంగస్థలం’  చిత్రానికి రైటర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి పనిచేసే సాంకేతిక నిపుణల, నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement