యూ ట్యూబ్‌ టు హీరో | Naveen Polishetty to be lead of Swadharm Entertainment's next | Sakshi
Sakshi News home page

యూ ట్యూబ్‌ టు హీరో

Published Thu, Apr 19 2018 1:14 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Naveen Polishetty to be lead of Swadharm Entertainment's next - Sakshi

నవీన్‌ పొలిశెట్టి

‘మళ్ళీ రావా’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌. తొలి ప్రయత్నంలోనే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్న నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాహుల్‌ యాదవ్‌ మాట్లాడుతూ– ‘‘మళ్ళీ రావా’ తర్వాత చాలా కథలు విన్నా. నూతన దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా చేస్తున్నా.

యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ‘ఆల్‌ ఇండియా బక్చోద్‌’ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాం. ‘మెంటల్‌ మదిలో’ చిత్రదర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ‘అ’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్‌ కె. రాబిన్‌ మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: అమిత్‌ త్రిపాఠి, మాటలు: వివేక్‌ ఆత్రేయ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement