చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కుప్పం బహదూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్న భోజనం కోసం అలమటించారు.
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కుప్పం బహదూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్న భోజనం కోసం అలమటించారు. మధ్యాహ్న భోజనం బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీకి ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో వారు మంగళవారం భోజనం వండలేదు.అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 130 మంది విద్యార్థులు ఆకలితో విలవిలలాడిపోయారు.