పెసర్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం | Start center to spearhead acquisitions | Sakshi
Sakshi News home page

పెసర్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published Wed, Sep 21 2016 1:33 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

Start center to spearhead acquisitions

తిరుమలగిరి
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో పెసర్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పాశం విజయయాదవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యత గల పెసర్లను తీసుకొచ్చి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.4800 మద్దతు ధర, రూ.425 బోనస్‌ ధర చెల్లిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం సునీత, మార్కెటింగ్‌ ఏడీఎం అలీమ్, తహసీల్దార్‌ జగన్నాథరావు, దేవేందర్, వీరస్వామి, కార్యదర్శి నవీన్‌రెడ్డి, సర్పంచ్‌ హరిశ్చంద్రనాయక్, అబ్బాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement