పెసర్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
తిరుమలగిరి
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పెసర్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పాశం విజయయాదవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యత గల పెసర్లను తీసుకొచ్చి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.4800 మద్దతు ధర, రూ.425 బోనస్ ధర చెల్లిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం సునీత, మార్కెటింగ్ ఏడీఎం అలీమ్, తహసీల్దార్ జగన్నాథరావు, దేవేందర్, వీరస్వామి, కార్యదర్శి నవీన్‌రెడ్డి, సర్పంచ్ హరిశ్చంద్రనాయక్, అబ్బాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.