
సాక్షి,ముంబై: దేశీయంగా మరో పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆదిత్య బిర్లా సొంతమైన ఐడియా సెల్యూలర్ కు చెందిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు షురూ అయ్యాయి. గురువారం నుంచి దేశవ్యాప్తంగా తమ చెలింపుల బ్యాంకు ఆపరేషన్స్ మొదలయ్యాయయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ సేవలను అందిస్తున్న ఇతర కంపెనీలు ఎయిర్‌టెల్, పేటీఎం, ఇండియా పోస్ట్ సరసన చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 1949 లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22 (1) ప్రకారం తమకు లైసెన్స్ జారీ అయిందని ప్రకటించింది. సుధాకర్ రామసుబ్రమణియన్ దీనికి సీఈవోగా వ్యవహరించనున్నారు. అయితే ఈ బ్యాంకు అందించే వడ్డీ రేటు,ఇ తర సేవల గురించి సమాచారం ఇంకా వెల్లడికాలేదు.
కాగా చెల్లింపుల బ్యాంకు లైసెన్స్ కోసం .ఆదిత్య బిర్లా నువో భాగస్వామ్యంతో కంపెనీ 2015 లో దరఖాస్తు చేసుకుంది పేమెంట్ బ్యాంకు సేవల అనుమతికి దరఖాస్తు చేసుకున్న11 మందితో ఐడియా కూడా ఒకటి. ఇప్పటికే ఎయిర్‌టెల్, పేటీఎం పేమెంట్‌బ్యాంకు సేవల్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు త్వరలో రిలయన్స్ జీయో తన చెల్లింపులు బ్యాంకును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.