payment bank
-
అశ్లీల వేషాలు కుదరవు! బ్యాంకుల షాక్..
కంటెంట్ క్రియేషన్ కోసం స్వేచ్ఛను ఇస్తే.. కొందరు దానిని మితిమీరి ఉపయోగించుకుంటున్నారు. అశ్లీల కంటెంట్ పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ప్రీమియం మెంబర్షిప్ వెబ్సైట్.. ‘ఓన్లీఫ్యాన్స్’ తమ అడల్ట్ క్రియేటర్లకు షాక్ ఇచ్చింది. ఇకపై అశ్లీల కంటెంట్‌కు తమ సైట్లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అక్టోబరు 1 నుంచి యూకేకు చెందిన సబ్‌స్రి్కప్షన్ సర్వీస్.. ఓన్లీఫ్యాన్స్‌కు గ్లోబల్ వైడ్‌గా యూజర్లు(భారత్‌లో సుమారు మూడున్నర లక్షలు) ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు.. నేరుగా తమ కంటెంట్‌ను కస్టమర్లకు అమ్ముకోవచ్చు. తద్వారా క్రియేటర్లకు ఆదాయం, సైట్లకు.. పేమెంట్ ద్వారా బ్యాకింగ్ పార్ట్నర్స్కు కొంత వాటా వెళ్తుంది. ప్రారంభంలో డీసెంట్ సైట్‌గా పేరున్న ఓన్లీఫ్యాన్స్.. ఆ తర్వాతి కాలంలో అడల్ట్ కంటెంట్ , ఆశ్లీలతకు మధ్య సన్నని గీతను చెరిపేసింది. పూర్తి అశ్లీల వెబ్‌సైట్‌గా మారింది. దీంతో ఓన్లీఫ్యాన్స్పై విమర్శలు పెరిగాయి. త్వరలో ఇలాంటి కంటెంట్‌పై నిషేధం విధించనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుందని, ఈ మేరకు రాబోయే రోజుల్లో పూర్తి అప్డేట్లను యూజర్లకు అందుబాటులో ఉంచుతామని ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. కారణం ఇదే.. విచ్చలవిడిగా అశ్లీల కంటెంట్ సైట్లో కనిపిస్తుండడంపై బ్యాంకింగ్ పార్ట్నర్స్, పేఅవుట్ ప్రొవైడర్స్ ఓన్లీసైట్కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఓన్లీఫ్యాన్స్ వెల్లడించింది. అశ్లీల కంటెంట్‌తో పాటు యాక్టివిటీస్ కూడా ఉండకూడదని స్పష్టం చేస్తోంది. అయితే గత నెలలో ఈ చర్యల్లో భాగంగా మొదటి అడుగు వేసింది ఓన్లీఫ్యాన్స్. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ఆరోపణలపై 15 అకౌంట్లను డీయాక్టివ్ చేసింది. ఇకపై మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని యూజర్లను హెచ్చరించింది కూడా. ఇక NCOSE నైతిక విలువల పేరిట.. మాస్టర్‌కార్డ్(పేమెంట్ జరగకుండా) ఇలాంటి కంటెంట్‌ను చూడకుండా బ్యాన్ విధించింది. ‘సురకక్షితమైన పేమెంట్ కాద’ని పేర్కొంటూ.. ఓన్లీఫ్యాన్స్తో పాటు మైఫ్రీకామ్స్ ఇతరత్ర సైట్లకు వీలు లేకుండా చేసింది. నో పేమెంట్స్ మాస్టర్‌కార్డ్, వీసా ఇదివరకే పోర్న్‌హబ్‌తో డీల్ రద్దు చేసుసుకున్నాయి. కారణం.. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రొత్సహించడం. అయితే ఈ ఆరోపణలను ఖండించిన పోర్న్ హబ్.. వెరిఫై లేని యూజర్ల కంటెంట్‌ను అప్లోడ్ కానివ్వకుండా చూసుకుంటోంది. తాజాగా మాస్టర్‌కార్డ్.. ఓన్లీఫ్యాన్స్పైనా నిషేధం విధించింది. 2016 నుంచి లండన్ బేస్డ్గా పని చేస్తున్న ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌ను టిమ్ స్టోక్లే 2016లో స్థాపించాడు. మొదలట్లో కుకింగ్, ఫిట్ ద్వారా పేరు సంపాదించుకుంది. ఆపై పోర్నోగ్రఫీ ద్వారా పేరు మోసింది. సెక్స్ వర్కర్స్ వీటి ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సైట్ విలువ మూడు బిలియన్ల డాలర్లకు చేరింది. 2019లో ఓన్లీ ఫ్యాన్స్‌కు ఏడు మిలియన్ల కస్టమర్లు ఉండగా.. తాజాగా 130 మిలియన్ల యూజర్లకు చేరుకుంది. ఈ ఏడాదికి 1.2 బిలియన్లు, వచ్చే ఏడాదికల్లా 2.5 బిలియన్ల ఆదాయం రాబట్టే ఛాన్స్ ఉందని యాక్సియోస్ సర్వే వెల్లడించింది. లియోనిడ్పై ఎఫెక్ట్ ఓన్టీఫ్యాన్ వెబ్సైట్ ద్వారా సాలీనా 300 క్రియేటర్లు మిలియన్ డాలర్ల దాకా సంపాదిస్తుంటే.. 16 వేలమంది సంవత్సరానికి కనీసం యాభై వేలు సంపాదిస్తున్నారు. ఓన్లీఫ్యాన్స్‌లో ఎక్కువ వాటా ఉక్రెయిన్-అమెరికాకు చెందిన పోర్న్ ఎంట్రప్రెన్యూర్ లియోనిడ్ రాడ్వింస్కీ పేరిట ఉంది. ఇందులో ఆయన వాటా వన్ బిలియన్గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అశ్లీ కంటెంట్ బ్యాన్.. ఈ షేర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి : Facebook Horizon Workroom: ఈ టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
మార్చి 2 నుంచి ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 2 నుంచి ఆరంభం అవుతుంది. అదే నెల 5న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 13 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తారు. దీంట్లో ఎస్బీఐ 3.7 కోట్లు, కార్లైల్ గ్రూప్ 9.3 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. మార్కెట్ లాట్‌గా 19 షేర్లను నిర్ణయించారు. ఈ ఐపీఓకు ప్రైస్ బాండ్ రూ.750–755గా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్బీఐ ఉద్యోగులకు 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. జీఎమ్‌పీ రూ.320–330 వచ్చే నెల 16న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జీఎమ్‌పీ (గ్రే మార్కెట్ ప్రీమియమ్) రూ.320–330 రేంజ్లో ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, డీఎస్పీ మెరిల్ లించ్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి. ఎస్బీఐ కార్డ్స్ కంపెనీలో ఎస్బీఐకు 76 శాతం, కార్లైల్ గ్రూప్‌నకు 24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన షేర్లను కార్లైల్ గ్రూప్, 4 శాతం వాటాకు సమానమైన షేర్లను ఎస్బీఐ విక్రయిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేసిన రెండో అతి పెద్ద కంపెనీగా ఎస్బీఐ కార్డ్స్ నిలిచింది. మన దేశ క్రెడిట్ కార్డ్‌ల మార్కెట్లో ఈ కంపెనీ వాటా 18 శాతం. ఈ కంపెనీ వినియోగదారులు 90 లక్షలకు పైగా ఉన్నారు. ఈ కంపెనీ ఐపీఓ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఈ కంపెనీ అత్యధిక వాటా ఉన్న ఎస్బీఐ షేర్ లాభపడింది. బీఎస్ఈలో 2.3 శాతం లాభంతో రూ.328 వద్ద ముగిసింది. -
పోస్ట్ పేమెంట్ బ్యాంకు.. గొప్ప ఆవిష్కరణ
హైదరాబాద్: మంచి, చెడుతోపాటు అన్ని విషయాలను చేరవేసే ఒకే ఒక్క మహానుభావుడు పోస్ట్‌మాన్ అని, అలాంటి తపాలా సేవలను మరింత విస్తృతం చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు బ్యాంక్ సేవలను అందించడం గొప్ప విషయమని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం ఇక్కడ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తెలంగాణ బ్రాంచ్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు సీనియర్ సిటిజన్లు, మహిళలకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. దీనిని పోస్టల్ శాఖలో గొప్ప చరిత్రగా చెప్పవచ్చన్నారు. అనంతరం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేసేందుకుగాను డోర్ స్టెప్ బ్యాంక్ సేవలను అందించే క్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 23 బ్రాంచ్‌లను, 115 యాక్సెస్ పాయింట్లను ప్రారంభించినట్లు తెలిపారు. పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, హెడ్ పోస్టాఫీస్‌లను కలుపుకొని 5,695 యాక్సెస్ పాయింట్లను డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తపాలాశాఖ వనరులతో బ్యాంకింగ్ సేవలు తపాలాశాఖలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. ఇందులో ముఖ్యంగా సేవింగ్, కరెంట్ అకౌంట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బయోమెట్రిక్ క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా, ఆర్టీజీఎస్, బిల్లు పేమెంట్స్, ఇన్సురెన్స్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు లక్షల మంది సిబ్బంది మైక్రో ఏటీఎంల ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించబోతున్నారని వెల్లడించారు. ఇది పేపర్ లెస్ బ్యాంకింగ్ అని, కేవలం ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చన్నారు. బ్యాంకింగ్ సేవలపై సందేహాలను తెలుసుకునేందుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు అని పేర్కొన్నారు. పోస్టాఫీస్‌లోని సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు కూడా ఐపీపీబీ ద్వారా అన్ని సేవలను పొందవచ్చన్నారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ టెక్నాలజీకి అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ముందడుగు వేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. అనంతరం బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించి గవర్నర్ చేతుల మీదుగా క్యూర్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారి రాధికా చక్రవర్తి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 23 పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు పోస్టల్ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 23 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయమై బుధవారం హైదరాబాద్‌లోని డాక్‌సదన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్(సీపీఎంజీ) బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ మాట్లాడారు. పేమెంట్ బ్యాంక్ శాఖలను సెప్టెంబర్ 1న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఒకే రోజు దేశ వ్యాప్తంగా 650 పోస్టల్ బ్యాంకులు, 3,250 అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సర్కిల్లో తొలివిడతగా 115 అనుబంధ కేంద్రాలు ప్రారంభించి.. డిసెంబర్ 31 నాటికి అన్ని పోస్టల్ ఆఫీసులకు విస్తరించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. కరెంట్ ఖాతాల లావాదేవీలపై ఎటువంటి పరిమితి లేదని, సేవింగ్ ఖాతాలపై మాత్రం కొంత పరిమితి ఉందని స్పష్టం చేశారు. డోర్ స్టెప్ లావాదేవీలు..: ఇంటి వద్ద నుంచే పోస్టు మ్యాన్ వద్ద ఉన్న మైక్రో ఏటీఎం ద్వారా కొత్త ఖాతాలు ప్రారంభించవచ్చని చంద్రశేఖర్ తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్, నగదు రహిత లావాదేవీలు, కరెంట్ తదితర లావాదేవీలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. కేవలం 3 నిమిషాల్లో లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ సెల్‌ఫోన్‌కు వస్తుందన్నారు. సేవింగ్ ఖాతాలను రూ.100తో, కరెంట్ ఖాతాలను రూ.1000లతో ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని సైతం అందిస్తున్నామని తెలిపారు. -
ఖాతా... క్యాష్ ఇంటివద్దే..
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం ఉత్తరాల బట్వాడా.. చిన్న మొత్తాల పొదుపు, బీమా తదితర సేవలను అందిస్తున్న తపాలా శాఖ ఇకపై పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందించనుంది. గ్రామీణ ప్రాం తాల్లో సరిపడా బ్యాంకు శాఖలు లేకపోవడం, గ్రామీ ణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై పూర్తి అవగాహన లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తపాలా శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ)ను ఏర్పాటు చేసింది. ఐపీపీబీ ద్వారా ఖాతాదారులు, ప్రజలకు సులభతరంగా బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. ఇప్పటివరకూ పొదుపు ఖాతా తెరడానికి వినియోగదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటే ఇకపై ఇంటి వద్దనే పోస్టల్ బ్యాంకు ఖాతా తెరవవచ్చు. నగరంలోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో), ప్రధాన తపాలా కార్యాలయాలు(హెచ్‌పీవో), ఉప తపాలా కార్యాలయాలు(ఎస్పీవో), బ్రాంచి పోస్టాఫీసు(బీపీవో)ల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి తపాలా శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే తపాలా సిబ్బందికి కర్ణాటక లోని మైసూర్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. మేనేజర్లను నియమించింది. దేశంలోని 650 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తుండగా.. రాష్ట్రం లో తొలి విడతగా హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో కి తెచ్చింది. తపాలా శాఖ ఏ పథకం తెచ్చినా నగరంలోని జీపీవోలో మొదట ప్రారంభిస్తామని ఖైరతాబాద్ సీనియర్ పోస్టుమాస్టర్ జయరాజ్ తెలిపారు. ఇంటి వద్దనే లావాదేవీలు.. ♦ పొదుపు ఖాతా కోసం ఆధార్ కార్డు ఉంటే చాలు. సంబంధిత పోస్ట్‌మాన్ ఇంటికి వచ్చి ఖాతా తెరు స్తారు. వారికి ఆండ్రాయిడ్ ఫోన్, బయోమెట్రిక్ పరికరం ఇస్తారు. ♦ తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతా మాత్ర మే తెరవడానికి వీలుండేది. ప్రస్తుతం కరెంట్ ఖాతా కూడా తెరవవచ్చు. ♦ ఖాతాదారు రోజుకు రూ.లక్ష వరకు నగదు లావాదేవీలు చేయవచ్చు. తపాలా కార్యాలయాలకు వెళ్లలేని వారు వివిధ లావాదేవీలను ఇంటివద్దనే నిర్వహించే వీలుంది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆన్లైన్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డులు, చెక్కుల లావాదేవీలు నిర్వహించవచ్చు. ♦ నగదు డిపాజిట్, ఉపసంహరణ కోసం సంబంధిత పోస్ట్‌మాన్‌కు 24గంటల ముందు సందేశం పంపితే ఇంటికి వచ్చి లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ లావాదేవీలు రూ.10 వేలకు మించరాదు. బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్ర తీసుకుంటారు. ♦ నగదు ఉపసంహరించుకున్నా, డిపాజిట్ చేసినా వాయిస్ మెసేజ్ వస్తుంది. దీంతో చదువు రాని వారు కూడా లావాదేవీలు తెలుసుకోవచ్చు. ♦ పోస్టల్ ఏటీఎం ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీ లు వసూలు చేయరు. ఎన్నిసార్లు నగదు తీసుకు న్నా అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదు. -
నెల రోజుల్లో ఎన్ఎస్డీఎల్ పేమెంట్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించనుంది. ఆర్బీఐ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉందని.. మరో నెల రోజుల్లో ముంబై కేంద్రంగా సేవలను ప్రారంభిస్తామని ఎన్ఎస్డీఎల్ సీఎండీ జి.వి.నాగేశ్వర్ రావు చెప్పారు. పోటీ పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలతో పోలిస్తే మెరుగైన సేవలందించేందుకు యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. నగదు లావాదేవీలతో పాటూ వాలెట్, సినిమా, ట్రావెల్ టికెట్లు ఇతరత్రా సేవలను వినియోగించుకునే వీలుంటుందని నాగేశ్వర్ రావు వెల్లడించారు. స్టడీ సర్టిఫికెట్లు డిజిటల్ రూపంలో.. ఎన్ఎస్డీఎల్ నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) సేవలను కూడా అందిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు చెందిన అన్ని సర్టిఫికెట్లు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చడమే దీని పని. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఖాతా ఉంటుంది. ఇది అకడమిక్ స్థాయిలో పూర్తిగా ఉచితమని.. ఆ తర్వాత రుణాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగిస్తే మాత్రం కొంత చార్జీ ఉంటుందని రావు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని సీబీఎస్ఈతో పాటూ 40 యూనివర్సిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయని.. ఇప్పటివరకు 50 లక్షల సర్టిఫికెట్లను భద్రపరిచామని తెలియజేశారు. మరో 300 యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నామని.. వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని విద్యా సంస్థలూ ఎన్ఏడీలో భాగస్వాములవుతాయని ధీమావ్యక్తం చేశారు. ఎన్ఏడీతో నకిలీ, ఫోర్జరీ సర్టిఫికెట్ల సమస్య ఉండదని.. పైగా విదేశీ విద్యా, రుణాల మంజూరు త్వరితగతిన పూర్తవుతుందని చెప్పారాయన. స్టాక్ మార్కెట్లో తెలంగాణ నుంచి రూ.5,400 కోట్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రోజుకు నగదు ప్రవాహం రూ.45 వేల కోట్లుగా ఉంటుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి 11–12 వేల కోట్లుంటుందని కొటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (కేఎస్ఎల్) సీఎండీ కమలేశ్ రావు తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ నుంచి రూ.5,400 కోట్లు ఉంటుందని.. ఇందులో 10 శాతం నగదు ప్రవాహం కోటక్ నుంచి జరుగుతుందని కమలేశ్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో కేఎస్ఎల్కు 16 లక్షల మంది కస్టమర్లున్నారని.. 18 నెలల్లో రెండింతలకు చేర్చాలని లకి‡్ష్యంచామని పేర్కొన్నారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధ సంస్థే ఈ కేఎస్ఎల్.. బుధవారమిక్కడ ఫ్రీ ఇంట్రాడే ట్రేడింగ్ సేవలను ప్రారంభించింది. వార్షిక సబ్స్క్రిప్షన్ చార్జీ రూ.999. -
మరో పేమెంట్స్ బ్యాంకు వచ్చేసింది
సాక్షి,ముంబై: దేశీయంగా మరో పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆదిత్య బిర్లా సొంతమైన ఐడియా సెల్యూలర్ కు చెందిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు షురూ అయ్యాయి. గురువారం నుంచి దేశవ్యాప్తంగా తమ చెలింపుల బ్యాంకు ఆపరేషన్స్ మొదలయ్యాయయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ సేవలను అందిస్తున్న ఇతర కంపెనీలు ఎయిర్టెల్, పేటీఎం, ఇండియా పోస్ట్ సరసన చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 1949 లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22 (1) ప్రకారం తమకు లైసెన్స్ జారీ అయిందని ప్రకటించింది. సుధాకర్ రామసుబ్రమణియన్ దీనికి సీఈవోగా వ్యవహరించనున్నారు. అయితే ఈ బ్యాంకు అందించే వడ్డీ రేటు,ఇ తర సేవల గురించి సమాచారం ఇంకా వెల్లడికాలేదు. కాగా చెల్లింపుల బ్యాంకు లైసెన్స్ కోసం .ఆదిత్య బిర్లా నువో భాగస్వామ్యంతో కంపెనీ 2015 లో దరఖాస్తు చేసుకుంది పేమెంట్ బ్యాంకు సేవల అనుమతికి దరఖాస్తు చేసుకున్న11 మందితో ఐడియా కూడా ఒకటి. ఇప్పటికే ఎయిర్టెల్, పేటీఎం పేమెంట్‌బ్యాంకు సేవల్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు త్వరలో రిలయన్స్ జీయో తన చెల్లింపులు బ్యాంకును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. -
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు షురూ!
• రాజస్థాన్ నుంచి సేవలు ఆరంభం • త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి • పొదుపు ఖాతా నిల్వలపై 7.25% వడ్డీ న్యూఢిల్లీ: టెలికం రంగంలో దేశీయ అగ్రగామి కంపెనీ అరుున భారతీ ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవల్లోకి అడుగుపెట్టింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు పేరుతో రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా బుధవారం సేవల్ని ప్రారంభించింది. దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కస్టమర్లు రాజస్థాన్ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎరుుర్‌టెల్ అవుట్లెట్లలో ఇక బ్యాంకు ఖాతాలు ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఎరుుర్‌టెల్ అవుట్లెట్లు బ్యాంకింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయని, ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్, విత్‌డ్రా సేవలు అందిస్తాయని పేర్కొంది. నిమిషాల్లో బ్యాంకు ఖాతా పేపర్‌తో పనిలేకుండా ఆధార్ ఈ కేవైసీ ఆధారంగా సత్వరమే ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతాదారుల ఎరుుర్‌టెల్ మొబైల్ నంబరే వారి ఖాతా నంబర్‌గానూ పనిచేస్తుంది. సేవింగ్స ఖాతాలోని నగదు నిల్వలపై వార్షికంగా 7.25 శాతం వడ్డీని కంపెనీ చెల్లిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఖాతాకై నా నగదును బదిలీ చేసుకునే సౌకర్యం ఉంది. ఎరుుర్‌టెల్ నుంచి ఎరుుర్‌టెల్ నంబర్లకు ఉచితంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ప్రతి సేవింగ్స ఖాతాదారుడికి రూ.లక్ష మేరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితంగా అందిస్తారు. ఎరుుర్‌టెల్ మొబైల్ కస్టమర్లు తమ స్మార్ట్ఫోన్లలో ఎరుుర్‌టెల్ మనీ యాప్ ద్వారా పేమెంట్ బ్యాంకు సేవలు పొందవచ్చు. లేదా ూ400ు కోడ్‌ను తమ మొబైల్లో టైప్ చేయడం ద్వారా, 400 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా సేవలు పొందవచ్చు. నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు.. దేశవ్యాప్తంగా పేమెంట్ బ్యాంకు సేవలు పూర్తి స్థారుులో ప్రారంభించే ముందు రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టినట్టు కంపెనీ తెలియజేసింది. దీని ద్వారా తమ నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించుకోనున్నట్లు ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఎండీ, సీఈవో శశి అరోరా చెప్పారు. వ్యాపారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సురక్షిత విధానంలో ఎరుుర్‌టెల్ బ్యాంకు నుంచి డిజిటల్ రూపంలో చెల్లింపులను స్వీకరించవచ్చని, నగదు రహిత వస్తు, సేవలను అందించవచ్చని ఎరుుర్‌టెల్ సూచించింది. ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్‌లో తమ బ్యాంకు నెట్వర్క్ పరిధిలో దుకాణాల సంఖ్యను లక్షకు విస్తరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవలు ప్రధాని సంకల్పమైన అందరికీ ఆర్థిక సేవలు, డిజిటల్ ఇండియాకు అనుకూలమని, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని వారికి ప్రయోజనకరమని రాజస్థాన్ సీఎం వసుంధరరాజే అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పేమెంట్ బ్యాంకు లెసైన్‌సను సంపాదించిన ఎరుుర్‌టెల్ దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల రిటైల్ అవుట్లెట్ల ద్వారా సేవలు అందించే ఆలోచనల్లో ఉంది. -
పోస్ట్ బ్యాంక్ దిశగా మరో అడుగు
♦ ప్రత్యేక విభాగం ఏర్పాటు ♦ బ్యాంకు ఏటీఎంలతో అనుసంధానానికి త్వరలో అనుమతి న్యూఢిల్లీ : పోస్ట్ బ్యాంకు ఏర్పాటు దిశగా మరో అడుగు ముందుకు పడింది. పేమెంట్ బ్యాంకు సేవల నిర్వహణ కోసం తపాలా శాఖ గతేడాదే అనుమతి సంపాదించగా... ఈ దిశగా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. దీంతో పోస్ట్ ఏటీఎంలు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎంల మధ్య అంతర్గత లావాదేవీల నిర్వహణకు ఆర్బీఐ నుంచి అనుమతి పొందడానికి మార్గం సుగమం అయింది. ‘పోస్టాఫీసు ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల మధ్య అంతర్గత లావాదేవీలు వెంటనే ప్రారంభం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, పోస్టాఫీసు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తేనే తన నియంత్రణ పరిధిలోకి వస్తుందని, అప్పుడు అనుమతి జారీ చేస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో తపాలా శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ విభాగం తర్వాత కాలంలో పోస్ట్ బ్యాంకులో విలీనం అవుతుందని వెల్లడించారు. అంతర్గత లావాదేవీల నిర్వహణకు అనుమతి లభిస్తే నగదు చలామణీ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పోస్ట్ బ్యాంకు సేవలు లాంఛనంగా ప్రారంభం కావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, ముందు ఏటీఎంల సేవలను వినియోగించుకోవడం ద్వారా సత్వరమే కార్యకలాపాలు ప్రారంభం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. అంతర్గత లావాదేవీలకు అనుమతి లభిస్తే పోస్టాఫీసు ఖాతాదారులు తమ పోస్టల్ ఖాతాల్లోని నగదును ఏ ఇతర బ్యాంకు ఖాతాకైనా బదిలీ చేసుకోవడానికి వీలవుతుంది. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 28 వేల శాఖాపరమైన కార్యాలయాలు, రూ.1.50 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరికి 20 వేల మైక్రో ఏటీఎంలు సహా మొత్తం 30వేల ఏటీఎంలను ఏర్పాటు చేసే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రూ.800 కోట్ల నిధితో పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిపిన విషయం విదితమే.