ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు షురూ!
• రాజస్థాన్ నుంచి సేవలు ఆరంభం
• త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి
• పొదుపు ఖాతా నిల్వలపై 7.25% వడ్డీ
న్యూఢిల్లీ: టెలికం రంగంలో దేశీయ అగ్రగామి కంపెనీ అరుున భారతీ ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవల్లోకి అడుగుపెట్టింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు పేరుతో రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా బుధవారం సేవల్ని ప్రారంభించింది. దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కస్టమర్లు రాజస్థాన్ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎరుుర్‌టెల్ అవుట్‌లెట్లలో ఇక బ్యాంకు ఖాతాలు ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఎరుుర్‌టెల్ అవుట్‌లెట్లు బ్యాంకింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయని, ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్, విత్‌డ్రా సేవలు అందిస్తాయని పేర్కొంది.
నిమిషాల్లో బ్యాంకు ఖాతా
పేపర్‌తో పనిలేకుండా ఆధార్ ఈ కేవైసీ ఆధారంగా సత్వరమే ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతాదారుల ఎరుుర్‌టెల్ మొబైల్ నంబరే వారి ఖాతా నంబర్‌గానూ పనిచేస్తుంది. సేవింగ్‌స ఖాతాలోని నగదు నిల్వలపై వార్షికంగా 7.25 శాతం వడ్డీని కంపెనీ చెల్లిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఖాతాకై నా నగదును బదిలీ చేసుకునే సౌకర్యం ఉంది. ఎరుుర్‌టెల్ నుంచి ఎరుుర్‌టెల్ నంబర్లకు ఉచితంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ప్రతి సేవింగ్‌స ఖాతాదారుడికి రూ.లక్ష మేరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితంగా అందిస్తారు.
ఎరుుర్‌టెల్ మొబైల్ కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో ఎరుుర్‌టెల్ మనీ యాప్ ద్వారా పేమెంట్ బ్యాంకు సేవలు పొందవచ్చు. లేదా ూ400ు కోడ్‌ను తమ మొబైల్‌లో టైప్ చేయడం ద్వారా, 400 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా సేవలు పొందవచ్చు.
నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు..
దేశవ్యాప్తంగా పేమెంట్ బ్యాంకు సేవలు పూర్తి స్థారుులో ప్రారంభించే ముందు రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టినట్టు కంపెనీ తెలియజేసింది. దీని ద్వారా తమ నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించుకోనున్నట్లు ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఎండీ, సీఈవో శశి అరోరా చెప్పారు. వ్యాపారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సురక్షిత విధానంలో ఎరుుర్‌టెల్ బ్యాంకు నుంచి డిజిటల్ రూపంలో చెల్లింపులను స్వీకరించవచ్చని, నగదు రహిత వస్తు, సేవలను అందించవచ్చని ఎరుుర్‌టెల్ సూచించింది.
ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్‌లో తమ బ్యాంకు నెట్‌వర్క్ పరిధిలో దుకాణాల సంఖ్యను లక్షకు విస్తరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవలు ప్రధాని సంకల్పమైన అందరికీ ఆర్థిక సేవలు, డిజిటల్ ఇండియాకు అనుకూలమని, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని వారికి ప్రయోజనకరమని రాజస్థాన్ సీఎం వసుంధరరాజే అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పేమెంట్ బ్యాంకు లెసైన్‌సను సంపాదించిన ఎరుుర్‌టెల్ దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా సేవలు అందించే ఆలోచనల్లో ఉంది.