ఎట్టకేలకు ప్రారంభమైన పెసళ్ల కొనుగోళ్లు
Published Sat, Sep 17 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఎట్టకేలకు శుక్రవారం మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వై.రంజిత్‌రెడ్డి పర్యవేక్షణలో పెసళ్ల కొనుగోళ్లను చేపట్టారు. గురువారం నుంచే పెసళ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా, కారణంగా లేకుండా కొనుగోళ్లను వాయిదా వేశారు. దీంతో సాక్షి దినపత్రిక ‘పెసరఽ రైతులకు నిరాశ’ అనే కథనాన్ని శుక్రవారం ప్రచురించింది.
దీంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు శుక్రవారం కొనుగోళ్లను చేపట్టారు. కాగా గురువారం పెసళ్లను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4,900తో కొనుగోలు చేయగా, శుక్రవారం మార్క్‌ఫెడ్, నాఫెడ్ అధికారులు సంయుక్తంగా క్వింటాల్‌కు రూ.5,326తో కొనుగోలు చేశారు. ఒక్కరోజు తేడాలో క్వింటాల్‌కు రూ.400కు పైగా అదనపు డబ్బులు సమకూరడంతో పెసరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు 365 పెసరు బస్తాలు అమ్మకానికి రాగా, దాదాపు 330 బస్తాల పెసళ్లను అధికారులే కొనుగోలు చేశారు. మొదటి రోజు కొనుగోళ్లలో రవీందర్‌రెడ్డి, ఉసెన్‌తో పాటు గ్రేడ్-2 కార్యదర్శి జగన్‌మోహన్, సూపర్‌వైజర్లు లక్ష్మీనారాయణ, వేణు పాల్గొన్నారు.
Advertisement