పచ్చతోరణం లఘుచిత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రామన్న
ఆదిలాబాద్ రూరల్ : మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్ ఆలయంలో శుక్రవారం మిట్టు రవి దర్శకత్వంలో రూపొందిస్తున్న పచ్చతోరణం లఘుచిత్ర చిత్రీకరణను రాష్ట్ర మంత్రి జోగురామన్న ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో ఆలయ పూజరి కిషన్‌మహరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహార కార్యక్రమంలో ప్రతీఒక్కరు భాగస్వాములై విజయవంతం చేస్తున్నారన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికి నల్లా కనెక్షన్ అందిస్తామని తెలిపారు. వీరి వెంట జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, సర్పంచ్ ఉష్కం రఘుపతి, మండల అధ్యక్షుడు ఆరే రాజన్న, ప్రధానకార్యదర్శి భరత్, బండారి దేవన్న, తదితరులు ఉన్నారు.