
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో ప్రతియేటా ఏర్పాటు చేసే గణనాథుడిని ఈసారి కోవిడ్ నేపథ్యంలో తొమ్మిది అడుగులకే పరిమితం చేసిన విషయం విదితమే. వ్యాధులను నయం చేసే ధన్వంతరి అవతారంలో ఈసారి గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణను ఎదుర్కోవడంలో సాయం చేస్తాడనే విశ్వాసంతో ఈ ఏడాది స్వామివారిని ధన్వంతరి గణపతిగా రూపొందిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాన్ని ఈసారి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా మట్టితో తయారు చేస్తున్నారు. వినాయకుడి తయారీ తుది దశకు చేరుకున్నట్లు వారు తెలిపారు. వినాయకుడికి ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవి విగ్రహాలను కూడా మట్టితోనే తయారు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment