సాక్షి, సిటీబ్యూరో: జై గణేశ్ నినాదాలు ఈ సంవత్సరం ఇళ్లకే పరిమితం కానున్నాయి. కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఆడంబరాలు, అన్నదానాలు, సాంస్కృతిక
ప్రదర్శనలు, సామూహిక ప్రార్థనలకు అవకాశంఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి గణేశ్ ఉత్సవసమితులు కూడా సరే చెప్పాయి. అయితే వీటి నుంచి ఖైరతాబాద్, బాలాపూర్ తదితర వినాయకులకుమినహాయింపు లభించే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఆయా భక్త మండళ్లు విగ్రహాలు నెలకొల్పినా సామూహిక పూజలు, ఇతర కార్యక్రమాలునిర్వహించకుండా చూడనున్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర అధికారులు, ఉత్సవ సమితిలతోనిర్వహించిన సమావేశంలో పరిస్థితి సమీక్షించి, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లోని వినాయక దేవాలయాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం తరపునే పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ యేడు కూడా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల ఆధ్వర్యంలో మట్టివిగ్రహాలను ఉచితంగా పంచుతామని ప్రకటించారు.
ఆన్‌లైన్‌లోనే..మహాగణపతి దర్శనం
తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టిరూపంలో రూపుదిద్దుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈ మారు ఆన్‌లైన్‌లోనే దర్శనమివ్వనున్నాడు. కోవిడ్ నిబంధనలకులోబడి శిల్పి నగేష్ ఆధ్వర్యంలో 22 మంది కోల్‌కతా నుంచి వచ్చిన కార్మికులు గంగానది మట్టితో వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఉత్సవ కమిటీకి మాత్రమే పూజలు చేసే అవకాశం కల్పించి, మిగిలిన భక్తులందరికి ఆన్‌లైన్లో దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉంటే నిమజ్జన శోభాయాత్రను కూడా బాహాటంగా అనుమతించే విషయంలో ఒకింత సందిగ్ధత నెలకొంది. ఒక వేళ అన్ని విగ్రహాలను శోభాయాత్రకు అనుమతించకపోతే బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాల వరకైనా అనుమతించాలని నిర్వహణ కమిటీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment