Nimarjanam
-
ఇద్దరు చిట్టి గణపతులు: ఇంట్లోనే నిమజ్జనం చేసిన సూర్యకుమార్ యాదవ్ (ఫొటోలు)
-
బొజ్జ గణపయ్య నిమజ్జనంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (ఫొటోలు)
-
ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాలకే నిమజ్జన భాగ్యం?
సాక్షి, సిటీబ్యూరో: జై గణేశ్ నినాదాలు ఈ సంవత్సరం ఇళ్లకే పరిమితం కానున్నాయి. కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఆడంబరాలు, అన్నదానాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సామూహిక ప్రార్థనలకు అవకాశంఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి గణేశ్ ఉత్సవసమితులు కూడా సరే చెప్పాయి. అయితే వీటి నుంచి ఖైరతాబాద్, బాలాపూర్ తదితర వినాయకులకుమినహాయింపు లభించే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఆయా భక్త మండళ్లు విగ్రహాలు నెలకొల్పినా సామూహిక పూజలు, ఇతర కార్యక్రమాలునిర్వహించకుండా చూడనున్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర అధికారులు, ఉత్సవ సమితిలతోనిర్వహించిన సమావేశంలో పరిస్థితి సమీక్షించి, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లోని వినాయక దేవాలయాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం తరపునే పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ యేడు కూడా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో మట్టివిగ్రహాలను ఉచితంగా పంచుతామని ప్రకటించారు. ఆన్లైన్లోనే..మహాగణపతి దర్శనం తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టిరూపంలో రూపుదిద్దుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈ మారు ఆన్లైన్లోనే దర్శనమివ్వనున్నాడు. కోవిడ్ నిబంధనలకులోబడి శిల్పి నగేష్ ఆధ్వర్యంలో 22 మంది కోల్‌కతా నుంచి వచ్చిన కార్మికులు గంగానది మట్టితో వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఉత్సవ కమిటీకి మాత్రమే పూజలు చేసే అవకాశం కల్పించి, మిగిలిన భక్తులందరికి ఆన్లైన్లో దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉంటే నిమజ్జన శోభాయాత్రను కూడా బాహాటంగా అనుమతించే విషయంలో ఒకింత సందిగ్ధత నెలకొంది. ఒక వేళ అన్ని విగ్రహాలను శోభాయాత్రకు అనుమతించకపోతే బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాల వరకైనా అనుమతించాలని నిర్వహణ కమిటీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
బైబై గణేశా..
ఎదులాపురం(ఆదిలాబాద్): పదకొండు రోజులపాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరాయి. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆనందోత్సహాల నడుమ ఆయా వినాయక మండపాల వారు నృత్యాలు, కోలాటాల మధ్య గణపయ్యకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రత్యేక వాహనాల్లో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లు మైమరిపించాయి. నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు భక్తులు జిల్లా కేంద్రం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపాలిటీ, పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో మంచినీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. పులిహోర, తదితర వాటిని భక్తులకు పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకుందాం.. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని, వచ్చే ఏడాది ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యవరణ పరిరక్షణకు సహకరించాలని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో పండుగలను జరుపుకోవాలని అన్నారు. ఆదివారం పట్టణంలోని వినాయక్‌చౌక్‌లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. ప్రతియేటా నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆదిలాబాద్‌లో ప్రజలందరూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించాలని కోరారు. ప్రతియేటా రాష్ట్ర ఖైరతాబాద్‌లో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేవారని, ఈసారి జిల్లాకేంద్రంలో 58 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్టించి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకతను చాటిచెప్పారని అన్నారు. అంతకుముందు సరస్వతీ పాఠశాలలో ప్రతిష్టించిన గణనాథునికి కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, బీజేపీ నాయకులు పాయల శంకర్, హిందు ఉత్సవ సమితి నాయకులు జంగిలి ఆశన్న, తదితరులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు హిందు ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు. అలరించిన నృత్యాలు.. వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో యువకులు చేసిన నృత్యాలు అలరించాయి. దీంతోపాటు గుస్సాడీ వేషధారణలో చేపట్టిన నృత్యాలు మైమరిపించాయి. బ్యాండ్ మేళాలతో యువతీ యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయంగా భజనలు చేస్తూ వినాయకులను నిమజ్జనానికి తరలించారు. పట్టణంలో నిమజ్జన శోభాయాత్రను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు.. పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ప్రత్యేక బలగాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తులో ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 390 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, షీటీమ్ పోలీసులు విధులు నిర్వహించారు. కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో పర్యవేక్షించారు. -
గణనాథా... ఇక సెలవు
స్టేషన్ మహబూబ్‌నగర్: అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు పూ జలు చేసిన భక్తులు శనివారం నిమజ్జనోత్సవాన్ని అంతే వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలగంగాధర్‌తిలక్ విగ్రహం వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యాన సమితి గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధ్వజారోహణ చేశారు. అనంతరం క్లాక్‌టవర్‌లో నిర్మించిన వేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. గణనాథుల ఊరేగింపు... క్లాక్‌టవర్ చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాల యం వరకు, ఇటు పాత బస్టాండ్, రాయచూరు రోడ్డు తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపు కొనసాగింది. గడియారం చౌరస్తా ప్రాంతానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో జాతరను తలపించింది. విభి న్న, విచిత్ర రూపాలు, సెట్టింగులతో కూడిన వినాయక విగ్రహాలు తీర్చిన రథాలు చిన్నాపెద్దా అంద రినీ అలరించాయి. క్లాక్‌టవర్‌లోని వేదిక నుంచి ఎంపీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఎర్ర శేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ రాధ, వైస్ చైర్మన్ రాములుతోపాటు గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి ప్రధాన కార్యదర్శి బాలయ్య, పడాకుల రాంచం ద్రయ్య, రాజేశ్వర్‌గౌడ్, గోపాల్‌యాదవ్, బుచ్చారెడ్డి, పట్లోళ్ల లక్ష్మారెడ్డి, పద్మజాయాదవ్, శాంతికుమార్, మల్యాద్రి రెడ్డి, నలిగేశి లక్ష్మీనారాయణ తదితరులు గణనాథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణపతిబొప్ప మోరియా అంటూ భక్తుల నినాదాలతో ఆధ్యాత్మికత నెలకొంది. పూజలు.. బందోబస్తు మహబూబ్‌నగర్ క్రైం : నిమజ్జనం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ రాత్రి క్లాక్‌టవర్, అంబేద్కర్ చౌరస్తా, పాతపాలమూరు. పాన్ చౌరస్తాల్లో గణేష్ శోభాయాత్రను ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఇక నిమజ్జనంలో ఇద్దరు డీఎస్పీలు, 9మంది సీఐలుతో పాటు ఎస్ఐలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇక క్లాక్‌టవర్ వద్ద పూజలు చేశాక విగ్రహాలను హన్వాడ, బీచుపల్లి, రంగపూర్ వైపు పంపించారు. అలాగే, ఐదున్నర అడుగులు ఉన్న విగ్రహాలను బీచుపల్లి, రంగపూర్‌కు తరలిం చడానికి ఆర్టీఏ, మున్సిపల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బీచుపల్లి, రంగపూర్‌కు గణనాథులను తరలించడానికి మున్సిపాలిటీ మైదానంలో 20 లారీలు ఏర్పాటు చేశారు. ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు జావేద్‌బేగ్ పర్యవేక్షించారు. ఇక స్థానిక మున్సిపల్ మైదానంలో ఐదు శాఖల అధికారులను కలిపి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సందర్భంగా క్లాక్ టవర్‌లో భక్తుల రద్దీ వాహనంపై భారీ గణనాథుడు యువతుల సంబరం ప్రతిభ కళాశాలలో పూజలు చేస్తున్న యాజమాన్యం, విద్యార్థులు -
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాధుడు