గణనాథా... ఇక సెలవు | Vinayaka Chavithi Nimajjanam Mahabubnagar | Sakshi
Sakshi News home page

గణనాథా... ఇక సెలవు

Published Sun, Sep 23 2018 12:45 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Vinayaka Chavithi Nimajjanam Mahabubnagar - Sakshi

శోభాయాత్రలో భాగంగా క్లాక్‌ టవర్‌ వద్దకు గణనాథుడి ప్రతిమతో వస్తున్న భక్తులు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు పూ జలు చేసిన భక్తులు శనివారం నిమజ్జనోత్సవాన్ని అంతే వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలగంగాధర్‌తిలక్‌ విగ్రహం వద్ద గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యాన సమితి గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజారోహణ చేశారు. అనంతరం క్లాక్‌టవర్‌లో నిర్మించిన వేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు.

గణనాథుల ఊరేగింపు... 
క్లాక్‌టవర్‌ చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాల యం వరకు, ఇటు పాత బస్టాండ్, రాయచూరు రోడ్డు తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపు కొనసాగింది. గడియారం చౌరస్తా ప్రాంతానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో జాతరను తలపించింది. విభి న్న, విచిత్ర రూపాలు, సెట్టింగులతో కూడిన వినాయక విగ్రహాలు తీర్చిన రథాలు చిన్నాపెద్దా అంద రినీ అలరించాయి. క్లాక్‌టవర్‌లోని వేదిక నుంచి ఎంపీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఎర్ర శేఖర్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధ, వైస్‌ చైర్మన్‌ రాములుతోపాటు గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి ప్రధాన కార్యదర్శి బాలయ్య, పడాకుల రాంచం ద్రయ్య, రాజేశ్వర్‌గౌడ్, గోపాల్‌యాదవ్, బుచ్చారెడ్డి, పట్లోళ్ల లక్ష్మారెడ్డి, పద్మజాయాదవ్, శాంతికుమార్, మల్యాద్రి రెడ్డి, నలిగేశి లక్ష్మీనారాయణ తదితరులు గణనాథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణపతిబొప్ప మోరియా అంటూ భక్తుల నినాదాలతో ఆధ్యాత్మికత నెలకొంది.

పూజలు.. బందోబస్తు
మహబూబ్‌నగర్‌ క్రైం : నిమజ్జనం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ రాత్రి క్లాక్‌టవర్, అంబేద్కర్‌ చౌరస్తా, పాతపాలమూరు. పాన్‌ చౌరస్తాల్లో గణేష్‌ శోభాయాత్రను ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఇక నిమజ్జనంలో ఇద్దరు డీఎస్పీలు, 9మంది సీఐలుతో పాటు ఎస్‌ఐలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులతో బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇక క్లాక్‌టవర్‌ వద్ద పూజలు చేశాక విగ్రహాలను హన్వాడ, బీచుపల్లి, రంగపూర్‌ వైపు పంపించారు. అలాగే, ఐదున్నర అడుగులు ఉన్న విగ్రహాలను బీచుపల్లి, రంగపూర్‌కు తరలిం చడానికి ఆర్టీఏ, మున్సిపల్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బీచుపల్లి, రంగపూర్‌కు గణనాథులను తరలించడానికి మున్సిపాలిటీ మైదానంలో 20 లారీలు ఏర్పాటు చేశారు. ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు జావేద్‌బేగ్‌ పర్యవేక్షించారు. ఇక  స్థానిక మున్సిపల్‌ మైదానంలో ఐదు శాఖల అధికారులను కలిపి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

శోభాయాత్ర సందర్భంగా క్లాక్‌ టవర్‌లో భక్తుల రద్దీ

వాహనంపై భారీ గణనాథుడు

యువతుల సంబరం                            ప్రతిభ కళాశాలలో పూజలు చేస్తున్న యాజమాన్యం, విద్యార్థులు 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

శోభాయాత్ర సందర్భంగా క్లాక్‌ టవర్‌లో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement