Idol Design
-
రాముణ్ణి చెక్కిన చేతులు
ఎంబిఏ చేసిన అరుణ్ యోగిరాజ్ కొన్నాళ్లు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు.కాని అనువంశికంగా వస్తున్న కళ అతనిలో ఉంది.నా చేతులున్నది శిల్పాలు చెక్కడానికిగాని కీబోర్డు నొక్కడానికి కాదని ఉద్యోగం మానేశాడు.2008 నుంచి అతను చేస్తున్న సాధన ఇవాళ దేశంలోనే గొప్ప శిల్పిగా మార్చింది. అంతే కాదు ‘బాల రాముడి’ విగ్రహాన్ని చెక్కి అయోధ్య ప్రతిష్ఠాపన వరకూ తీసుకెళ్లింది.తమలో ఏ ప్రతిభ ఉందో యువతా, తమ పిల్లల్లో ఏ నైపుణ్యం ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలనడానికి ఉదాహరణ అరుణ్. జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో ఒక్కో విశేషం తెలుస్తూ వస్తోంది.ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహాల్లో ‘బాల రాముడి’ విగ్రహం సమర్పించే గొప్ప అవకాశం మైసూరుకు చెందిన 40 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు దక్కింది. కర్ణాటకకు చెందిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయోధ్య రామమందిరంలో ‘బాల రాముడి’ విగ్రహం ప్రతిష్ట కోసం శిల్పం తయారు చేయమని దేశంలో ముగ్గురు శిల్పులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్‌క్షేత్ర ట్రస్ట్ బాధ్యత అప్పజెప్పింది. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఇతని కుటుంబం ఐదు తరాలుగా శిల్ప కళలో పేరు గడించింది. అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవణ్ణ శిల్పులుగా కర్ణాటకలో పేరు గడించారు. అయితే అరుణ్ ఈ కళను నేర్చుకున్నా అందరిలాగే కార్పొరేట్ ఉద్యోగం వైపు దృష్టి నిలిపాడు. కాని రక్తంలో ఉన్న శిల్పకళే మళ్లీ అతణ్ణి తనవైపు లాక్కుంది. 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తున్న అరుణ్ ఇప్పటికే అనేకచోట్ల శిల్పాలు స్థాపించి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అరుణ్ తయారు చేసిన శిల్పాల్లో కేదార్‌నాథ్‌లోని ఆది శంకరాచార్య విగ్రహంతో మొదలు మైసూరులోని ఆర్.కె.లక్ష్మణ్ విగ్రహం వరకూ ఉన్నాయి. మైసూర్ రైల్వే స్టేషన్లో ‘లైఫ్ ఈజ్ ఏ జర్నీ’ పేరుతో ఒక కుటుంబం లగేజ్‌తో ఉన్న శిల్పాలు ప్రతిష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు అరుణ్. అలా రాముడి విగ్రహం చెక్కే అవకాశం ΄÷ందే వరకూ ఎదిగాడు. 51 అంగుళాల విగ్రహం అరుణ్ చెక్కిన బాల రాముడి విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. అరుణ్ భార్య విజేత వివరాలు తెలియచేస్తూ ‘అరుణ్‌కి ఈ బాధ్యత అప్పజెప్పాక శిల్ప ఆకృతి గురించి అతడు ఎంతో పరిశోధించాల్సి వచ్చింది. దానికి కారణం బాల రాముడి విగ్రహం ఇలా ఉంటుందనడానికి ఎలాంటి రిఫరెన్స్ లేక΄ోవడమే. అందుకని అరుణ్ పురాణాల అధ్యయనంతో పాటు రాముడి వేషం కట్టిన దాదాపు 2000 మంది బాలల ఫొటోలు పరిశీలించాడు’ అని తెలిపింది. ఈ విగ్రహం కోసం ట్రస్ట్ శిలను అందించింది అరుణ్‌కు. ‘మామూలు గ్రానైట్ కంటే ఈ శిల దృఢంగా ఉంది. చెక్కడం సవాలుగా మారింది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశం ఎంత విలువైనదో గ్రహించిన అరుణ్ రేయింబవళ్లు శిల్పాన్ని చెక్కి తన బాధ్యత నిర్వర్తించాడు’ అని తెలిపింది విజేత. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తల్లి ఆనందం కుమారుడు చెక్కిన శిల్పం రామ మందిరంలోప్రాణప్రతిష్ఠ చేసుకోనుందన్న వార్త విన్న అరుణ్ తల్లి ఆనందంతో తబ్బిబ్బవుతోంది. మరణించిన భర్తను తలచుకొని ఉద్వేగపడుతోంది. ‘అరుణ్ వాళ్ల నాన్న దగ్గరే శిల్పం చెక్కడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్న పేరు నిలబెడుతున్నాడు’ అంది. తల్లిదండ్రులు తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల బాగు కోరుతారు. అయితే అన్నీ తాము ఆదేశించినట్టుగా పిల్లలు నడుచుకోవాలన్న «ధోరణి కూడా సరి కాదు. పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదవాలనుకుంటే ఎందుకు ఆ కోరిక కోరుతున్నారో పరిశీలించాలి. కళాత్మక నైపుణ్యాలుండి ఆ వైపు శిక్షణ తీసుకుంటామంటే వాటి బాగోగుల గురించి కనీసం ఆలోచించాలి. కఠినమైన చదువులకు అందరు పిల్లలూ పనికి రారు. రాని చదువును తప్పక చదవాల్సిందేనని హాస్టళ్లల్లో వేసి బాధించి ఇవాళ చూస్తున్న కొన్ని దుర్ఘటనలకు కారణం కారాదు. ఐశ్వర్యంతో జీవించడానికి కొన్నే మార్గాలు ఉండొచ్చు. కాని ఆనందంగా జీవించడానికి లక్షమార్గాలు. పిల్లల ఆనందమయ జీవితం కోసం చిన్నారుల ఆలోచనలను కూడా వినక తప్పదు. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను ..
ముంబైలో గణేశ్ నిమజ్జనం రోజున వేలాది విగ్రహాలు సముద్రం వైపు కదులుతాయి. వాటిలో భారీ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ విగ్రహాల్లో దాదాపు సగం రేష్మ ఖాతు తయారు చేసినవే. తండ్రి మరణించాక గణేశుడి విగ్రహాల తయారీ పరంపరను భుజానికెత్తుకుంది రేష్మ. ఇవాళ ముంబైలో ఆమె నంబర్ 1 గణేశ శిల్పి. ‘మనల్నందరిని దేవుడు తయారు చేశాడు. కాని ఆ దేవుణ్ణి తయారు చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది’ అంటుంది రేష్మ ఖాతు. నలభై ఏళ్ల రేష్మ ఖాతును ముంబైలో ‘మూర్తికార్’ అని పిలుస్తారు. అంటే దేవుని మూర్తుల రూపశిల్పి అని అర్థం. ‘ఇవాళ మా నాన్న నన్ను చూస్తే చాలా ఆశ్చర్యపోయి ఉండేవాడు’ అంటుందామె తండ్రి విజయ్ ఖాతును తలుచుకుని. ఎందుకంటే తండ్రి జీవించి ఉండగా ఆమె ఎప్పుడూ ఆయన వర్క్‌షాప్‌లోకి పెద్దగా అడుగు పెట్టేది కాదు. ఇవాళ ఆ వర్క్‌షాప్‌కు ఆమే సర్వస్వం. ‘ముంబైలోనే కాదు దేశ విదేశాల్లోనే మా నాన్న విజయ్ ఖాతు చాలా ప్రఖ్యాతుడు. ఇవాళ మనం చూస్తున్న గణేశ్ విగ్రహాల భిన్న రూపాలకు ఆయనే ఆద్యుడు. గతంలో గణేశుడు విగ్రహం అంటే అందరూ కూర్చుని ఉన్న మూర్తే తయారు చేసేవారు. మా నాన్న గణేశుడి చేతులకు, కాళ్లకు కదలికలు తెచ్చాడు’ అంటుంది రేష్మ. 2017లో విజయ్ ఖాతు మరణించాక ఆయన శిల్ప సామ్రాజ్యాన్ని రేష్మ సమర్థంగా నిర్వహిస్తోంది. సినీ దర్శకురాలు అవుదామని రేష్మ ఖాతు కుటుంబం తాతల కాలం నుంచి గణేశ్ విగ్రహాల తయారీలో ఉంది. ఆ శిల్పాల తయారీ రేష్మకు సర్వం తెలిసినా తాను మాత్రం సినీ దర్శకురాలు కావాలని ఆ కోర్సులు చేసింది. అయితే తండ్రి హఠాత్ మరణంతో మొత్తం కార్ఖానా స్తంభించింది. ‘మా నాన్న చనిపోయాక ఆయన విలువ మరింత తెలిసింది. ఎందరో మండపాల నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి ప్రతి ఏటా వినాయక చవితికి మీ దగ్గరే విగ్రహాలు తీసుకెళ్లేవాళ్లం... ఇక మీదట కూడా అలాగే చేస్తాం అని చెప్పేవారు. ముంబైలో ప్రఖ్యాతమైన లాల్బాగ్, ఖేత్వాడి, చందన్వాడి, తులసివాడి మంటపాల్లో ప్రతి ఏటా మేము తయారు చేసిన విగ్రహాలే పెడతారు. వీరందరినీ చిన్నబుచ్చడం నాకు నచ్చలేదు. మా మేనమామ నాతో– నువ్వు చేయగలవమ్మా అన్నాడు. ధైర్యంగా మా నాన్న సీట్లో కూచున్నాను’ అంటుంది రేష్మ. మగవాళ్లకు నచ్చలేదు గత ఐదారేళ్లుగా రేష్మ విజయవంతంగా గణేశ్ విగ్రహాల తయారీని కొనసాగిస్తున్నా ఇంకా ఆ సంగతి మింగుడుపడని మగవారు ఉన్నారు. ‘మా ఫ్యాక్టరీలో శిల్పులు, మౌల్డర్లు, మేనేజర్లు అందరూ నేను బాస్‌గా రావడం చూసి ఆశ్చర్యపోయారు. కొందరు చాలా ఏళ్లుగా మా నాన్న సీట్ మీద కన్నేసి ఉంచారు. వారంతా నేను రావడంతో సహాయ నిరాకరణ చేశారు. నేను శిల్పి కూతురిని. శిల్పం చేయడం నా జీన్స్‌లో ఉంది. నేనే రంగంలో దిగి కొత్త విగ్రహాలు ఎలా చేయాలో సూచనలు ఇస్తూ సరైన దారిలో కార్ఖానాను పెట్టేసరికి తల వొంచారు’ అంటుంది రేష్మ. పార్వతీదేవి చేతుల్లో గణేశుడు తయారైన చందాన ముంబైలో ఒక స్త్రీ చేతుల మీదుగా ప్రతి వినాయక చవితికి విగ్రహాలు తయారవుతాయి. పూజలు అందుకుంటాయి. గణేశుడి మూర్తుల తయారీలో ఒక స్త్రీ ఈ విధాన ముందుండటం తప్పక సంతోషపడాల్సిన విషయం. ---శభాష్ రేష్మ. (చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట!అందులో ప్రోటీన్, విటమిన్ బీ..) -
ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గణేష్ విగ్రహ చిత్రపట ఆవిష్కరణకు తనను పిలవలేదని వైస్ ప్రెసిడెంట్ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అతను ఈ కార్యక్రమం జరిపేది లేదంటూ మైక్ విరగొట్టారు. ఖైరతాబాద్ గణపతి నమూనా చిత్రాన్ని విడుదల చేసిన కమిటీ సభ్యులు ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఆ పటంలో శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. కాగా ఈ ఏడాది 40 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు ప్రతిష్ఠించనున్నారు. వినాయకుడికి కుడివైపు కృష్ణకాళీ, ఎడమవైపు కాలనాగేశ్వరి ఉన్నారు. -
ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు
సాక్షి, హైదరాబాద్: : 65 ఏళ్ల ఖైరతాబాద్ చరిత్రలోనే ఈసారి తయారు చేస్తున్న ద్వాదశాదిత్య మహాగణపతిని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఏకంగా 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 12 ముఖాలు, 24 చేతులతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా మూడు నెలల ముందు నుంచే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు ప్రారంభిస్తారు. విగ్రహ తయారీలో 150 మంది పని చేస్తారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు ఇప్పటికే 80శాతం పూర్తయ్యాయి. ఈ నెల 27 వరకు పనులన్నీ పూర్తవుతాయి. వీరే పాత్రధారులు... షెడ్డు పనులు: ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ ఆధ్వర్యంలోని 20 మంది బృందం. వెల్డింగ్ పనులు: మచిలీపట్నంకు చెందిన జి.నాగబాబు ఆధ్వర్యంలోని 20 మంది. క్లే వర్క్: చెన్నైకి చెందిన గురుమూర్తి ఆధ్వర్యంలోని 25 మంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్: మహారాష్ట్రకు చెందిన సుభాష్ ఆధ్వర్యంలోని 23 మంది. మోల్డింగ్ పనులు: హైదరాబాద్‌కు చెందిన కోఠి ఆధ్వర్యంలోని 22 మంది బృందం. ఫినిషింగ్ పనులు: బిహార్, బెంగాల్‌కు చెందిన గోపాల్, సంతోష్‌ల ఆధ్వర్యంలోని 15 మంది. పెయింటింగ్: కాకినాడకు చెందిన భీమేశ్ ఆధ్వర్యంలోని 25 మంది బృందం. విగ్రహం వివరాలివీ... పేరు: ద్వాదశాదిత్య మహాగణపతి తలలు 12 సర్పాలు 12 చేతులు 24 24 చేతుల్లో 24 ఆయుధాలు ఉంటాయి. అవి అభయహస్తం, లడ్డూ, శంఖం, చక్రం, గద, పరశు, పాశం, శూలం, అంకుశం, కత్తి, రుద్రాక్షలు, పుష్పశరం, పద్మం, చెరుకుగడ ధనస్సు, బాణం, నాగం, వీణ, దండం, కమండలం, సుల్లా, గ్రంథం, గొడ్డలి, భగ్న దంతం, ధ్వజం. సామగ్రి, ఖర్చులు ఇలా.. సర్వీ కర్రలు 80 టన్నులు, వ్యయం రూ.3 లక్షలు. షెడ్డు నిర్మాణానికి లేబర్ రూ.లక్ష గోవా తాడు 100 బెండళ్లు, రూ.11 వేలు స్టీల్ 30 టన్నులు, ఖర్చు రూ.20 లక్షలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 45 టన్నులు (మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఉచితంగా అందజేసింది) కొబ్బరి నార 60 బెండళ్లు, రూ.90 వేలు గోనె క్లాల్ 2వేల మీటర్లు, రూ.60 వేలు బంకమట్టి 600 బ్యాగులు, రూ.1.25 లక్షలు ఫ్రెంచ్ పాలిస్ రూ.11 వేలు వాటర్ పెయింట్స్ 120 లీటర్లు, రూ.80 వేలు వెల్డింగ్, మోల్డింగ్, డిజైన్ వర్క్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సెక్యూరిటీ ఇతరత్రా లేబర్ చార్జీలు రూ.35 లక్షలు ప్రతిరోజు లేబర్‌కు భోజనం రూ.10 లక్షలు ట్రాన్స్పోర్ట్, ఇతరత్రా ఖర్చులు రూ.3 లక్షలు 1954లో స్వాతంత్ర సమరయోధుడు సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఏటా ఒక అడుగు పెరుగుతూ వస్తోంది. సింగరి శంకరయ్య 1994లో మరణించిగా... ఆయన తమ్ముడు సింగరి సుదర్శన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన బావమరిది సందీప్‌రాజ్, కుమారుడు రాజ్‌కుమార్‌ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నమూనాలో మార్పులు.. మహాగణపతి ప్రధాన తలపై మూడు తలలు ఉండేలా తొలుత శిల్పి నమూనా సిద్ధం చేశారు. అయితే తయారీ సమయంలో 12 తలలను సెట్ చేసేందుకు ప్రధాన తలపై మూడు తలలకు బదులుగా ఐదు తలలను పెట్టి డిజైన్ ఫైనల్ చేశారు. దీంతో నమూనాను రెండుసార్లు మార్చారు. 12 తలలు, 12 సర్పాలు, 24 చేతులతో మహాగణపతిని తయారు చేయాలంటే తప్పనిసరిగా 61 అడుగులు ఉండాలని... ఈ నేపథ్యంలో ఎత్తు పెంచాల్సి వచ్చిందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. -
మొదలైన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఏర్పాట్ల పనులు