బాబ్లీకి తాళం | 12 gates are locked in babli project | Sakshi
Sakshi News home page

బాబ్లీకి తాళం

Published Wed, Oct 30 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

12 gates are locked in babli project

 భైంసా, న్యూస్‌లైన్ : మహారాష్ట్ర సర్కారు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ప్రాజెక్టు గేట్లను దించే విషయంలో మహారాష్ర్ట సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గేట్లు దించే కార్యక్రమానికి మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి అజీత్‌రావుపవార్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చౌహాన్, జలవనరుల శాఖ మంత్రి సునిత్‌తట్కారే, నాందేడ్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డీపీ సావంత్ హాజరయ్యారు. మూడు రోజులుగా అక్కడి పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే సోమవారం అర్ధరాత్రి 12 గంటలు తర్వాత ప్రాజెక్టు 14 గేట్లలో 12 గేట్లను కిందికి దించేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో బాబ్లీ చేరుకున్న అమాత్యులు మిగిలిన రెండు గేట్లను మధ్యాహ్నం 3.16 గంటలకు కిందికి దిం చారు. సుప్రీంకోర్టు తీర్పును క్షణం కూడా ఆల స్యం చేయకుండా కిందికి దించిన వైనం అక్కడి అమాత్యులు ఆ ప్రాంత రైతుల కోసం అక్కడి ప్రాజెక్టుల నిర్వహణ కోసం పట్టిన పట్టుదల ఈ కార్యక్రమంతో మరోసారి మన పాలకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
 మా వాటా వదులుకోం..
 బాబ్లీ గేట్లు కిందికి దించడాన్ని మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. ఎన్నో వివాదాలతో పూర్తయిన బాబ్లీ ప్రాజెక్టుతో నాలుగు పట్టణాలతోపాటు 20 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. మహారాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రాంతం లో ప్రవహించే నదులపై ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించేందుకు వెనక్కి తగ్గేదిలేదని ఉప ముఖ్యమంత్రి అజీత్‌పవార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దాదాగిరి తాము కొనసాగించబోమని తమకు అందాల్సిన నీటి వాటాను వదులుకోలేమని అన్నారు. గ్రామం నుంచి జిల్లా వరకు, రాష్ట్రం నుంచి దేశాల వరకు నీటి గొడవలు జరుగుతూనే  ఉన్నాయన్నారు. గోదావరి నదిపై గాయక్‌వాడ్ నుంచి బాబ్లీ వరకు ఉన్న 15 ప్రాజెక్టులతో ఈ ప్రాంత రైతులందరికి సాగునీరు అందిస్తామన్నారు. నాలుగు దశాబ్దాల కల నిజమైందని జలవనరు ల శాఖ మంత్రి సునీత్ తట్కారే స్పష్టం చేశారు. మహారాష్ట్ర పరీవాహక ప్రాంతంలోని నీటిని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు.
 మన నీళ్లు మనకే..
 మహారాష్ట్ర నీళ్లు మాకే చెందాలని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చౌహాన్ బాబ్లీ సభలో స్ప ష్టం చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టు వివాదాలపై వెనక్కి తగ్గలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు రాజకీయం చేస్తే పీఎం మన్మోహన్‌సింగ్‌ను కలిసి  ఈ ప్రాం త కష్టాలను వివరించామన్నారు. బాబ్లీ విషయంలో ధర్మాబాద్‌కు వచ్చిన చంద్రబాబు బృందానికి ఔరంగాబాద్ తీసుకువెళ్లి ప్రత్యేక విమానంలో పంపించామని తెలిపారు. మహా రాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్ల దించివేత చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తమవారికి దీపావళి రెం డు రోజుల ముందే వచ్చేసిందన్నారు. బాబ్లీ ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్‌వాడి, బిలోలి, ఉమ్రి పట్టణాలకు తాగునీరు 7,395 హెక్టార్లకు సాగునీరు అందనుందన్నా రు. ఇక త్వరితగతిన లెండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయం లో మహారాష్ట్ర 1975 నుంచి పోరాటం చేస్తుం దని నాందేడ్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డీపీ సావం త్ పేర్కొన్నారు. దక్షిణ గంగపై బాబ్లీ ప్రాజెక్టు పూజలు చేయడం మరిచిపోలేమన్నారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ ప్రవహించే నదుల్లో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
 భారీ బందోబస్తు
 ప్రాజెక్టు గేట్ల కిందికి దించే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేసింది. గేట్లను కిందికి దించే విషయంలో మూడు రోజులుగా ప్రాజెక్టు ప్రాం తంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు మోహరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నూ అనుమతి ఉన్న పాత్రికేయులకే లోపలకు ఆహ్వానించారు. గేట్లు కిందకు దించగానే అక్కడికి చేరుకున్న వేలాది రైతులు టపాసులు మో గించి సంబరాలు జరుపుకున్నారు. అమాత్యులు గోదారమ్మకు పచ్చచీరలు, టెంకాయలు పై నుంచి కిందకు జారవిడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement