prithviraj chauhan
-
వివాదంలో అక్షయ్ కుమార్ చిత్రం.. దిష్టిబొమ్మ దహనం
బాలీవుడ్ కిలాడి హీరో అక్షయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పృథ్వీరాజ్ సినిమాకు వ్యతిరేకంగా చంఢీగఢ్‌లో ఆందోళనలు చేపట్టారు. గతంలో జోధా అక్భర్, పద్మావతి సినిమాలు వివాదంలో చిక్కుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. కొంచెం అలాంటి వివాదమే ఇప్పుడు పృథ్వీరాజ్‌ను చుట్టుముట్టింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ మార్చాలని కోరుతూ అఖిల భారతీయ క్షత్రియ మహాసభ నేతృత్వంలోని నాయకులు నిరసనలు చేపట్టారు. అంతేగాక అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘంలోని వ్యక్తులు మాట్లాడుతూ.. సినిమా పేరు కేవలం పృథ్వీరాజ్‌గా ఉండకూడదని.. పూర్తి పేరు ‘హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ లేదా ‘చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహన్’గా ఉండాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహన్ చివరి హిందూ చక్రవర్తి అని, అలాంటి సందర్భంలో ఈ చిత్రం పేరు అతని పేరుకు పూర్తి గౌరవం ఇవ్వాలని కోరారు. అదే విధంగా సినిమా విడుదలకు ముందే దీనిని క్షత్రియ, రాజ్‌పుత్ సమాజ ప్రతినిధులకు చూపించాలని కోరారు. అందువల్ల ఈ చిత్రంలో ఏదైనా వివాదం ఉందా అని, చిత్రం చరిత్రను దెబ్బతీస్తుందా అనే విషయం తెలుస్తుందని, అప్పుడే ఆ సన్నివేశాలను తొలగించేదుకు కోరవచ్చని అన్నారు. అయితే పృథ్వీరాజ్ సినిమా నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన అన్న వివాదాలను తొలగించాలని, లేకపోతే క్షత్రియ సమాజ్.. పద్మావతి, జోధా అక్బర్ సినిమాలకు ఎదురైన పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చిత్ర నిర్మాత, దర్శకుడితోపాటు స్టార్ అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. చదవండి: ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్ కుమార్ -
మహారాష్ట్రలో ఆధిక్యంలో ప్రముఖులు
హైదరాబాద్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఆధిక్యంలో ఉన్నారు. పర్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి నిలిచిన బీజేపీ అభ్యర్థి, గోపినాథ్ ముండే కుమార్తె పంకజాముండే ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే దక్షిణ కరాడ్‌లో మాజీ సీఎం పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), నాగ్‌పూర్‌లో దేవేంద్ర ఫడ్నవిస్ (బీజేపీ), బారమతిలో అజిత్ పవార్ (ఎన్సీపీ), కుడాల్లో మాజీ సీఎం నారాయణరావు రాణెతోపాటు మాజీ మంత్రులు ఆర్ఆర్ పాటిల్, ఛగన్ బుజబల్, అశోక్ చవాన్ భార్య అమృతా చవాన్ కూడా అధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న వారు: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రావూ షాహెబ్ షెకావత్ కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి షిండే -
మంత్రి నారాయణ్ రాణే రాజీనామా
-
మంత్రి నారాయణ్ రాణే రాజీనామా
ముంబై:మహారాష్ట్రలో అసమ్మతి సెగలు పతాకస్థాయికి చేరాయి. గత కొంతకాలంగా మహారాష్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తప్పించాలని డిమాండ్ చేస్తున్న మంత్రి నారాయణ్ రాణే సోమవారం రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ కు సేవలందిస్తామని రాణే తెలిపారు. అసలే లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తొలుత మహారాష్ట్రలో విభేదాలు తారాస్థాయికి చేరడంతో రాణే మంత్రి పదవి నుంచి వైదొలిగారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తప్పించకపోతే కేబినెట్ నుంచి వైదొలగుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో పీసీసీ చీఫ్‌ను మార్చాలని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
ముండేకు బదులు చౌహాన్‌కు నివాళులు
చెన్నై : బతికుండగానే ఆ నేతకు కార్యకర్తలు ఫోటో పెట్టి నివాళులు అర్పించేశారు. ఈ సంఘటన శనివారం చెన్నైలో చోటుచేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే సంస్మరణ సభలో ఆపార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పొరపాటున ముండే ఫోటోకు బదులుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ ఫోటో పెట్టి నివాళులు అర్పించారు. దాంతో కార్యకర్తల అత్యుత్సాహంపై బీజేపీ అధిష్టానం మండిపడింది. తొందరపాటు చర్యలు తగవని కార్యకర్తలకు సూచించింది. -
తగ్గిస్తేనే ‘పవర్’!
నాగపూర్: అవమానకరమైన పరాభవం నుంచి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించాలన్నా, మళ్లీ అధికారంలోకి రావాలన్నా విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని రైతు సంఘాలు ముఖ్యమంత్రి చవాన్‌ను కోరాయి. మరోసారి కాంగ్రెస్‌కు అధికారం దక్కాలంటే విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని విదర్భ జనాందోళన్ సమితి అధ్యక్షుడు కిషోర్ తివారీ సూచించారు. కేవలం 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఢిల్లీ రాష్ట్రమే మంచినీటి బిల్లులు, విద్యుత్ బిల్లులలో ఆ రాష్ట్ర ప్రజలకు సబ్సిడీ ఇస్తోందని, రూ.1,60,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అటువంటి సబ్సిడీలు ఇవ్వడం ఎంతైనా అవసరమన్నారు. ముఖ్యంగా ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్న విదర్భ ప్రాంతంలో ఢిల్లీ తరహా పథకాలను అమలు చేయాల్సిన అవసరముందన్నారు. ‘నయా ప్రపంచీకరణ ప్రచార కర్త చవాన్ కూడా కేజ్రీవాల్ తరహా పాలనను రాష్ట్ర ప్రజలకు అందించి, వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాల’ని తివారీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిగాఅభివర్ణించారు. రాజకీయాల్లో వ్యాపారవర్గాల జోక్యంతో 1991 నుంచి విద్యుత్, జలరంగాలను అనేక రాష్ట్రాలు ప్రైవేటీకరించే దిశగా అడుగులేస్తున్నాయని, దీనిపై ఆయా రాష్ట్రాల్లో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదలకు, గిరి జనులకు, రైతులకు ఉచితంగానే నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. రైతుల కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలని, రైతు సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఆప్ తరహా పథకాలను అమలు చేయాలని తివారీ కోరారు. -
త్వరలో తగ్గిస్తాం
భివండీ న్యూస్‌లైన్ : వచే ్చ నెల మొదటి వారంలో విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే అభయమిచ్చారు. కాగా పట్టణంలో విద్యుత్ చార్జీలు విపరీతంగా ఉన్న కారణంగా 40 శాతం మేర పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని మూతపడే దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవర్లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు శుక్రవారం ముంబైలోని మంత్రాలయకు వెళ్లి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణేని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించకపోయినపట్టయితే పరిశ్రమల్లోని యంత్రాలను పాత ఇనుప సామగ్రి రూపంలో అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదని పవర్లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు మంత్రి రాణే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు రాణే స్పందిస్తూ నాగపూర్‌లో శాసనసభ శీతాకాల సమావేశాలు జరగడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అందుబాటులో లేరని, అందువల్ల మంత్రిమండలి సమావేశం జరగలేదని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో జరిగే సమావేశంలో విద్యుత్ చార్జీల తగ్గించేవిధంగా చర్యలు తీసుకుంటామని అభయమిచ్చారు. కాగా మంత్రిని కలసినవారిలో ఎమ్మెల్సీ సంజయ్ దత్, భివండీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షోయబ్ గుడ్డూ, ఫజల్ అన్సారీ. జావేద్ దల్వి తదితరులు ఉన్నారు. కాగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్ ఏడో తేదీన మరమగ్గాల పరిశ్రమలన్నింటినీ మూసివేసి యజమానులు ఆందోళనకు దిగారు. భివండీ పవర్లూమ్ సంఘర్శ్ సమితి నేతృత్వంలో నవంబర్ ఆరు నుండి 15 వరకు పరిశ్రమల యజమానులు శాంతియుతంగా బంద్ పాటించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత రాస్తారోకోతోపాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా ఎంతమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో సమితి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సురేశ్ టావురే, సమితి సభ్యులు నవంబర్ 25న భివండీ నుంచి ముంబైలోని మంత్రాలయదాకా పాదయాత్ర ఆందోనలు చేపడతామంటూ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. ఇందుకు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్య మంత్రి అజిత్ పవార్లు త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి విద్యుత్ చార్జీలు తగ్గించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆయా యజమానులు ఆందోళనలను విరమించిన సంగతి విదితమే. -
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై పెరుగుతున్న విమర్శల తీవ్రత
సాక్షి, ముంబై: రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణ దర్యాప్తు నివేదికను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తోసిపుచ్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సొంత పార్టీకి చెందిన నేత, కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ట్విట్టర్ స్పందిస్తూ ఆదర్శ్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని పోస్టు చేయడం ఆ పార్టీలో కలకలానికి దారి తీసింది. ఇదే బాటలో మరికొందరు నాయకులు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే పరిస్థితి ఏంటా అని అగ్రనాయకులు కలవరపడుతున్నారు. దీనికి తోడు ఆదర్శ్ నివేదికను సీఎం పృథ్వీరాజ్ చవాన్ నిరాకరించాడని, తమకేమీ సంబంధం లేదని మిత్రపక్ష పార్టీ ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టినట్లయ్యింది. పెరుగుతున్న విమర్శల తీవ్రత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతోంది. ఈ కేసులో కాంగ్రెస్‌కు చెందిన ‘ముఖ్య’నేతల పేర్లు ఉండటంతో అగ్నికి అజ్యం పోసినట్టైంది. ఇదేనా ‘ఆదర్శ’వంతమైన పాలనా అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రూ.కోట్లలో విలువచేసే ప్లాట్లను అధికార దుర్వినియోగంతో తక్కువ రేట్లకే బంధువులకు దోచిపెట్టడమేనా అని మన ‘ముఖ్య’నేతల సంస్కృతి అన్న విమర్శల దాడి పెరుగుతోంది. ఆదర్శ్ కుంభకోణంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఆశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండేలతో పాటు పలువురు మంత్రుల ప్రమేయంపై రూపొందించిన ద్విసభ్య కమిషన్ విచారణ నివేదికను గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌తో పాటు శాసనసభలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తోసిపుచ్చడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో మాజీ సీఎం ఆశోక్ చవాన్‌ను సీబీఐ విచారించేందుకు గవర్నర్ కె.శంకర్ నారాయణన్ నిరాకరించడంతో ఇక ఈ కేసు నీరుగారినట్టేనని అందరూ భావించారు. అయితే నాగపూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆదర్శ్ నివేదికను ప్రవేశపెట్టాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో సర్కార్ ప్రవేశపెట్టింది. ప్రజాహితం దృష్ట్యా ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మిస్టర్ క్లీన్ అని పేరున్న చవాన్ ఈ ప్రకటనతో అవినీతి బురదను తనకు అంటించుకునే సాహసం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే ఇదే విషయమై సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు వస్తుండటం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పృ థ్వీరాజ్ చవాన్‌కు రాబోయే రోజుల్లో ఆదర్శ్ మరింత తలనొప్పిగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడైన మిలింద్ దేవరా ఆదర్శ్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సూచించారు.రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మిలింద్ దేవరా ఇలా సొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడంపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరోవైపు మిలింద్ వ్యాఖ్యలు ప్రతిపక్షాల వాదనలను మరింత బలం చేకూర్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదర్శ్ నివేదకను తోసిపుచ్చడంపై నిరసన వ్యక్తం చేస్తూనే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని మిలింద్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. తోసిపుచ్చింది ముఖ్యమంత్రే: అజిత్ పవార్ ఆదర్శ్ నివేదికను సభలో తోసిపుచ్చాలన్న నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవానేనని, ఆ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఆదర్శ్ అంశం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారే అవకాశాలున్నాయి. ఆదర్శ్ దర్యాప్తు నివేదికను తోసిపుచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఎన్సీపీ తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక నుంచి ఈ అంశంపై ఎన్సీపీ ఆచితూచి అడుగు ముందుకువేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ పరిశీలిస్తే మద్దతిస్తాం ఆదర్శ్ విచారణ నివేదికను తిరస్కరించిన నిర్ణయాన్ని మళ్లీ పరిశీలిస్తే సీఎం చవాన్‌కు మద్దతిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం మీడియాకు తెలిపారు. హౌసింగ్ కుంభకోణంలో ఎన్సీపీ మంత్రులు సునీల్ తట్కరే, రాజేశ్ తోపేల పాత్ర ఏమీ లేదన్నారు. -
క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటాం
పింప్రి, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రెండు నెలల్లోగా ఆర్డినెన్స్‌ను తీసుకొస్తామన్నారు. చికిలీలో నిర్మించిన గృహ సముదాయాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పింప్రి-చించ్వడ్, పుణే శివారు ప్రాంతాలలో అక్రమ కట్టడాలను కొనసాగించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమించామన్నారు. నగరంలో అక్రమ కట్టడాల సంఖ్య ఎంత వాటిలో ఎన్నింటిని కొనసాగించవచ్చు? అందువల్ల ఎంతమందికి న్యాయం జరుగుతుంది? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. నివేదిక అందిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించి చట్టాల్లో మార్పులుచేర్పులపై శాసనసభ్యులందరితోనూ చర్చిస్తామన్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలనంటూ నగరవాసులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్, ఉపముఖ్య మంత్రి అజిత్ పవార్, శివసేన ఎంపీలు శివాజీరావ్, అడల్‌రావ్‌పాటిల్, గజానన్ బాబర్, ఎమ్మెల్యేలు విలాస్ లాండే, చంద్రకాంత్, కేంద్రీయ గృహనిర్మాణ, నగర దారిద్య్ర నిర్మూలన విభాగం కార్యదర్శి అరుణ కుమార్ మిశ్రా, నగర మేయర్ మోహినీ లాండే, ఉపమేయర్ రాజు మిసాల్, మంగళా కదమ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది పుణే మెట్రో పనులు
సాక్షి, ముంబై: పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. ఈ పనులు ఐదేళ్లలో పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది, దీని కారణంగా స్థలాలు కోల్పోనున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించే అంశాన్ని శిశిర్ షిండే, బాలా నంద్గావ్కర్ తదితర ఎమ్మెల్యేలు లేవనెత్తారు. దీనిపై చవాన్ పైవిధంగా సమాధానమిచ్చారు. మెట్రో ప్రాజెక్టు రూ.10,183 కోట్ల వ్యయంతో కూడుకున్నదని అన్నారు. దీన్ని పింప్రి నుంచి స్వార్గేట్ వరకు, వనాజ్ నుంచి రామ్వాడి వరకు నిర్మించనున్నారన్నారు. ఈ పనులకయ్యే వ్యయం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వాటా 20 శాతం చొప్పున ఉంటుందని స్పష్టం చేశారు. పుణే, పింప్రి-చించ్వడ్ కార్పొరేషన్ల వాటా 10 శాతం చొప్పున ఉంటుంది. అంతేకాకుండా వనాజ్ నుంచి రామ్వాడి మార్గం పనుల్లో పుణే కార్పొరేషన్ 10 శాతం వ్యయాన్ని భరించనుందని చవాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వచ్చే ఏడాది ప్రత్యక్షంగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2019 వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు కోసం ప్రైవేటు స్థలాలను సేకరిస్తామని, ప్రతిఫలంగా బాధితులకు ప్రభుత్వ నియమాల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ఆ భూమి నాకొద్దు కేంద్ర మంత్రి శుక్లా ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి రాజీవ్‌శుక్లా జుహూలో చౌకధరకు భూమిని కేటాయించిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడం, ఆక్రమణల కారణంగా భూమిని స్వాధీనం చేసుకోకూడదని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తాము ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ నెల నాలుగున లేఖ రాశానని శుక్లా మంగళవారం ఇక్కడ తెలిపారు. తనకు సంబంధించిన సొసైటీకి కేటాయించిన స్థలంలో ఆక్రమణల కారణంగా ఎటువంటి కార్యకలాపాలూ చేపట్టనందున వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సదరు స్థలంలో పలు మురికివాడలు వెలిసినందున దానిని తాము స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నో విద్యాసంస్థలకు తక్కువ ధరలకు భూములు కేటాయించారని, తనకూ ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి మాత్రమే ఆ స్థలం కోరామని, వాణిజ్య కార్యకలాపాల ఆలోచనే లేదని రాజీవ్ శుక్లా తెలియజేశారు. శుక్లాకు భూకేటాయింపులపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మంత్రికి కారుచౌకగా రెండు ప్లాట్లను కట్టబెట్టారని ఆ పార్టీ సీనియర్ నేత కిరీట్సోమయ్య ముంబైలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అయితే ఈ భూమి ఎక్కడుందో రెవెన్యూ అధికారులు కనుక్కోలేకపోయారని తెలిపారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ భూమిని కేటాయించారని వివరించారు. -
26/11 అమరులకు ముంబైకర్ల శాల్యూట్
సాక్షి, ముంబై: నగరంలో ముష్కరులు నరమేథం సృష్టించి మంగళవారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులను గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. వీరి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 166 మంది భారతీయులు, విదేశీయులను ముంబైకర్లు స్మరించుకున్నారు. వీరి స్మృత్యర్థం మెరైన్లైన్స్లోని పోలీసు జింఖానాలో నిర్మించిన అమరవీరుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, కేంద్ర మానవ వనరుల సహాయ శాఖ మంత్రి శశిథరూర్ పుష్పాగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు, నగర పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్, పోలీసులు కూడా అమరులను గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కొనే క్రమంలో వీర మరణం పొందిన జవాన్లు, పోలీసు అధికారులను స్మరించుకున్నారు. మారణహోమం సృష్టించిన తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు, జాతీయ భద్రతా దళం సేవలను ప్రశంసించారు. ఆ తర్వాత భారీ సంఖ్యలో హాజరైన బాధిత కుటుంబసభ్యులు తమవారిని తలచుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇలాంటి సంస్మరణ కార్యక్రమాలను తాజ్ మహల్ ప్యాలెస్, టవర్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్లు, లియోపోల్డ్ కేఫ్, నారీమన్ హౌస్‌లోనూ నిర్వహించారు. 2008, నవంబర్ 26 నుంచి 29 వరకు ఉగ్రవాదులు వీటిని లక్ష్యంగా ఎంచుకొని అనేక మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదులు మొదటగా లక్ష్యంగా ఎంచుకున్న ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో అమరులకు నివాళులర్పించేందుకు రైల్వే అధికారులు ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. ‘జీవితం ముందుకు సాగుతోంది. అప్పటి భయంకర రోజులను మళ్లీ ప్రజలకు గుర్తు చేయలేమ’ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆ రోజు రాత్రి జరిగిన భయంకర దృశ్యాలను మరిచిపోయానని లియోపొల్ట్ కేఫ్‌లో జరిగిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ భరత్ గుజ్జర్ అన్నారు. ఆ విషాద ఘటన గురించి ఆలోచిస్తూ, ఆ జ్ఞాపకాలతో ఎన్ని రోజులు బతకాలన్నారు. ఉగ్రవాది కసబ్‌ను పట్టుకునేందుకు సహచరులకు సహకరించే సమయంలో చౌపాటి బీచ్ సమీపంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి బాలసాహెబ్ భోన్సలే కుమారుడు సచిన్ భోన్సలే మాట్లాడుతూ ఆ రోజు జ్ఞాపకాలు ఇప్పటికీ తమ కుటుంబసభ్యులు గుర్తు చేస్తుంటారని అన్నారు. ‘ప్రతి బుధవారం, గురువారం వచ్చిందంటే అమ్మ కలవరపడుతుంది. బుధవారం విధుల కోసం బయటకు వెళ్లిన నాన్న బాలసాహెబ్ లేరన్న విషయం మరుసటి రోజు తెలిసింద’ని విచారం వ్యక్తం చేశారు. సోదరుడు ముంబై పోలీసు శాఖలో, తాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని వివరించాడు. శాంతి పరిఢవిల్లాలని కాంక్షిస్తూ సోమవారం వందలాది మంది అంతర్జాతీయ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. షోలాపూర్‌లో... షోలాపూర్, న్యూస్‌లైన్: 26/11 దాడుల్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో అమరులైన వీర జవాన్లకు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో మంగళవారం నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అల్కారాటోడ్, కార్పొరేషన్ కమిషనర్ చంద్రకాంత్ గూడెం వార్, పోలీసు కమిషనర్ ప్రదీప్ రాసుకర్ తదితరులు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. -
మూడు మహా ప్రాజెక్టులకు ఓకే
న్యూఢిల్లీ: రెండు నూతన విమానాశ్రయాల నిర్మాణంతోపాటు మరొక దాని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులను సత్వరమే చేపట్టాలని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన బుధవారం దేశరాజధానిలో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య రాజధానితోపాటు ఇతర ప్రధాన నగరాలను అభివృద్ధి బాటలో ముందుంచేందుకు కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించారు. పుణే, నవీముంబైలలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంతోపాటు నాగపూర్ విమానాశ్రయాన్ని విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేవన్నారు. కాగా ముంబై నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 60 కిలోమీటర్ల పొడవున రూ. 20 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి విదితమే. కాగా, చర్చిగేట్-విరార్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు కోసం నగరవాసులు మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు. ఇందుకు కారణం ముంబైలో ట్రాఫిక్ స్థితిగతులపై మరొకసారి అధ్యయనం చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. 60 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 20 వేల కోట్లు ఖర్చవ్వచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాగా ప్రతిపాదిత ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చ వాన్ ఈ సందర్భంగా పీఎం మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు. -
చవాన్‌పై పవార్ ఫైర్
సాక్షి, ముంబై: వారసత్వ రాజకీయాలను అంతం చేస్తామని ఘనంగా ప్రకటించుకున్న ఎన్సీపీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైందంటూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ ఆదివారం చేసిన విమర్శలపై ఆ పార్టీ మండిపడింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దీనిపై ఘాటుగా స్పందించారు. ఎన్సీపీని స్థాపించడం వల్లే పృథ్వీరాజ్ చవాన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. ఎన్సీపీ తమ లక్ష్యసాధనలో విఫలమైనందున, ప్రజలు దానిని నిలదీయాలని చవాన్ అన్నారు. ఎన్సీపీ స్థాపించడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కూడా మండిపడ్డారు. దీనికి పవార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. షోలాపూర్ జిల్లా మాలీనగర్లో ఆదివారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎన్సీపీ స్థాపించడం వల్లనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) కూటమి అధికారంలోకి వచ్చింది. మా పార్టీ స్థాపన వల్ల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు అత్యధిక లాభం చేకూరింది. ఆయనతోపాటు పలువురికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి లభించింది’ అని అన్నారు. వారసత్వ రాజకీయాల విమర్శలపై మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులెవరికీ తాను పదవులు కట్టబెట్టలేదని వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఓట్ల ద్వారా గెలిచి పదవులు చేపట్టారంటూ పృథ్వీరాజ్ చవాన్‌కు చురకలంటించారు. సీట్ల పంపకాలపై చర్చలు జరగాల్సి ఉంది... లోకసభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి కాలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ‘దీపావళి పండుగ అనంతరం సీట్ల పంపకాలు, నియోజకవర్గాల్లో మార్పులపై చర్చలు జరిపేందుకు సమావేశం కావాలని భావించాం. కొన్ని అవాంతరాల వల్ల సమావేశం వాయిదా పడింది. లోక్‌సభ అభ్యర్థులు ఎవరనేదానిపై ఇప్పట్లో నిర్ణయం ఉండకపోవచ్చు. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు’ అని పవార్ అన్నారు. మిస్టర్క్లీనే కానీ మోసగాడు కూడా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మూడేళ్ల పాలనపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చవాన్ తన మిస్టర్‌క్లీన్ పేరును నిలబెట్టుకున్నా, ఆ ముసుగులో అవినీతిపరులకు సహకరించారని ఆరోపించింది. నీటిపారుదల, సాగునీటి కుంభకోణాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఆదర్శ్ కుంభకోణం నివేదిక వచ్చి ఆరు నెలలు అవుతున్నా, దానిని అసెంబ్లీ ప్రవేశపెట్టకుండా అవినీతిపరులకు కొమ్ముకాయడానికి చవాన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నివేదికను సభలో ప్రవేశపెడతామని కోర్టుకు ఇచ్చిన హామీ కూడా ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు. తన శక్తియుక్తులన్నింటినీ ఎన్సీపీని ఎదుర్కోవడానికే పృథ్వీరాజ్ చవాన్ వినియోగిస్తున్నారని ఫడ్నవిస్ విమర్శించారు. -
బరువు తగ్గిన సీఎం
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రతి అడుగు ప్రణాళికాబద్ధంగా వేస్తున్నారు. మామూలు సమయంలో కంటే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రుల పర్యటనలు రెట్టింపవుతాయి. అటువంటి పరిస్థితుల్లో శారీరక దృఢత్వం (ఫిట్నెస్) అత్యంత అవసరం. ఆవిధంగా ఉన్నట్టయితే ఎన్ని సభల్లో పాల్గొన్నా, ఎన్ని పర్యటనలు చేసినా అంత ఇబ్బంది అనిపించదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆలోచనలు కూడా ఇదే రీతిలో ఉన్నట్టుంది. అందుకేనేమో తన శారీరక బరువును ఐదు కిలోలమేర తగ్గించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ మరాఠీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పలువురు మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాగా రాబోయే లోక్‌సభ ఎన్నికలు పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో జరుగుతాయని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు సత్ఫలితాలను సాధించేందుకు తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో తమ బలం పెరిగిందని, అందువల్ల తమకు మరిన్ని స్థానాలు కావాలని మిత్రపక్షమైన ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీని కోరుతోంది. కాగా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గతంలో బాగా లావుగా ఉండేవారు. అయితే పర్యటనలు తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకుని బరువును తగ్గించుకున్నారు. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు యత్నించారు. ఈ విషయాన్ని పలుసార్లు గడ్కరీ బహిరంగంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సైతం అదే బాటలో కొనసాగుతున్నారు. -
నగరానికి దీపకళ
సాక్షి, ముంబై: వెలుగుల పండుగ దీపావళికి నగరం ముస్తాబైంది. వీధులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి. దీపావళి శుభాకంక్షలు తెలియజేస్తూ ఇళ్లపై ఏర్పాటు చేసిన ఆకాశదీపాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాణసంచా దుకాణాలు, గిఫ్ట్ షాపులు, పూజా సామగ్రి దుకాణాలు, మిఠాయి దుకాణాలు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చర్చిగేట్ పరిసరాల్లోని ఫ్యాషన్ స్ట్రీట్, దాదర్ పరిసరాల్లో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా రద్దీ పెరిగినప్పటికీ శుక్రవారం మరింత ఎక్కువైంది. కొనుగోళ్ల కోసం అందరూ మార్కెట్లకు రావడంతో నడవడానికి కూడా కష్టంగా మారింది. పెరిగిన విక్రయాలు... ధన త్రయోదశిని పురస్కరించుకుని శుక్రవారం బంగారం, వెండి ఆభరణాలతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను కొనడం సంప్రదాయంగా వస్తుండడంతో జువెలరీ షాపులముందు జనం బారులు తీరారు. బంగారం ధర ఆకాశాన్నంటుతున్నా ఎంతో కొంత కొనుగోలు చే యాలనే అభిప్రాయంతో ఇక్కడికి వచ్చినట్లు నగరవాసులు చెబుతున్నారు. ఇక ఎలక్ట్రానిక్ దుకాణాల ముందు కూడా భారీగానే సందడి కనిపించింది. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేవారి సంఖ్య అధికంగా కనిపించింది. అమ్మకందారులు ఈఎంఐల ఆశ చూపడంతో కొనుగోలుదారులు భవిష్యత్తులో ఎలా చెల్లించాలన్న విషయాన్ని పక్కనబెట్టి మరీ వస్తువులు కొనేందుకు ఎగబడ్డారు. కలుషితం చేయకండి: ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని దీపావళి పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు మతాలవారిలో ఐక్యతను పెంచేందుకు దోహదపడే దీపావళి పండుగకు ఎంతో ప్రాధాన్యముందని, ఈ సందర్భంగా వెలిగించే దీపాలు చీకటిని తొలగించి, పరిసరాలను కాంతిమయం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోనుంచి చీకటి తొలగిపోయి వెలుగులు నిండాలని కోరుకుంటున్నానన్నారు. టపాసులు పేల్చడం ఆనవాయితీ అయినప్పటికీ వాయు, ధ్వని కాలుష్యం కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. టపాసులులేని దీపావళి కార్యక్రమాలకు విశేష స్పందన... పర్యావరణానికి హాని తలపెట్టవద్దన్న అభిప్రాయంతో గత మూడేళ్ల నుంచి ‘టపాసులులేని దీపావళి’ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర పర్యావరణశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండడం శుభపరిణామమని పర్యావరణ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టపాసులు పేల్చడంతో ధ్వనితోపాటు వాయి కాలుష్యం పెరుగుతుందని, ఇది ప్రజల ఆరోగ్యంపై దుష్ర్పభావాలను చూపుతుందన్నారు. దీనిపై ప్రజల్లో జాగృతి తీసుకొచ్చి టపాసులు పేల్చకుండా పండుగ జరుపుకోవాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాలల విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. భద్రత పెంపు.... దీపావళి పండుగను పురస్కరించుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల బీహార్ రాష్ర్టం పాట్నాలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సభా ప్రాంగణం వద్ద జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భద్రతను పెంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ముంబై ముందుందని, దీపావళి టపాసుల పేలుళ్లను అవకాశంగా తీసుకొని ఉగ్రమూకలు బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశముందంటూ నిఘావర్గాల నుంచి అందిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాలపై నిఘా పెంచామన్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సంఖ్యను పెంచామని, మరి కొన్ని ప్రాంతాల్లో నాకాబందీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు, వస్తువులు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముంబై పోలీసులు సూచించారు. వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
‘బాబ్లీ’కి తాళం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహారాష్ర్ట జలదోపిడీకి శ్రీకారం చుట్టింది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేకుండా వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను దింపివేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సోమవారం అర్ధరాత్రే ప్రాజెక్టు 14 గేట్లలో 12 గేట్లను మూసివేసిన అధికారులు మంగళవారం మధ్యాహ్నం మిగిలిన రెండు గేట్లను దించివేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫృథ్వీరాజ్ చౌహాన్, ఉప ముఖ్యమత్రి అజీత్ పవార్ల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించి, విజయోత్సవం జరుపుకున్నారు. బాబ్లీ ప్రాజెక్టులాగే అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టును పూర్తిగా దక్కించుకుంటామన్న కుట్రను బహిర్గతం చేశారు. మహారాష్ర్టలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని ఇక్కడి రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఆలస్యంగా మేల్కొన్న మన ప్రభుత్వం న్యాయపోరాటం చేసినా.. చివరికి మహారాష్ట్రకే విజయం వరించింది. దీని వెనుక మన సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందనే ఆరోపణలున్నాయి. అయితే బాబ్లీపై సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పు మేరకు ఏటా అక్టోబర్ 28 నుంచి జూన్ 30 వరకు బాబ్లీ గేట్లను మూసేసే అధికారం మహారాష్ట్రకు ఇచ్చారు. దీంతో సోమవారం అర్ధరాత్రి కొన్ని గేట్లను, మంగళవారం మధ్యాహ్నం మిగిలిన గేట్లను దించి వేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టు ఏడారే: బాబ్లీ గేట్ల మూసివేతతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని 18.82 లక్షల ఎకరాల పంటసాగు ఏడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సుమారు ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఒకటవ దశలో 9.68 లక్షల ఎకరాలు, రెండవ దశలో 4.40 ఎకరాలు, ఇందిరమ్మ వరద కాలువ కింద 2.20 లక్షల ఎకరాలు, సదర్మంట్ ఆనకట్ట కింద 12 వేలు, కడెం ప్రాజెక్టు కింద 68వేలు, అలీసాగర్ ఎత్తిపోతల కింద 57 వేలు, గుత్ప ఎత్తిపోతల కింద 38 వేలు, హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల కింద 11 వేల ఎకరాలు, అలాగే నిజామాబాద్‌లోని 14 ఎత్తిపోతల కింద 34 వేల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ఎత్తిపోతల కింద 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, బాబ్లీ గేట్లను దింపడంతో వీటి భవితవ్వం ఆగమ్యగోచరంగా మారనుంది. వర్షాకాలంలో వరదలతో ఎస్సారెస్సీ జలాశయం నిండిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. 1984 నుంచి 2005 వరకు 21 ఏళ్లలో రెండేళ్లు మినహా మిగిలిన 19 ఏళ్లలో నవంబర్ నుంచి జూన్ నెలలో వచ్చిన నీటితోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండింది. బాబ్లీ బారేజీ నిర్మాణాన్ని ప్రారంభించిన 2005 నుంచి 2012 వరకు ఆరేళ్లలో చుక్కనీరు కూడా ఈ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్‌లోకి రాలేదు. బాబ్లీ గేట్ల మూసివేతతో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. లెండిపై కన్ను : మహారాష్ట్ర సరిహద్దులోని నిజామాబాద్ జిల్లాలో రెండు రాష్ట్రాలు సమష్టిగా చేపట్టిన లెండి ప్రాజెక్టును బాబ్లీలాగానే పూర్తిగా దక్కించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విధితమవుతోంది. దీనిపై కేంద్ర జలసంఘంతో చర్చలు జరుపుతున్నామని మహారాష్ట్ర నేతలు మంగళవారం ప్రముఖంగా పేర్కొనడం చూస్తే వారి దోపిడీ ఇంతటితో ఆగదనే విషయం స్పష్టమవుతోంది. అదే జరిగితే నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ పరిధి రెండు మండలాల పరిధిలోని 22,700 ఎకరాల ఆయకట్టుకు లెండి ప్రాజెక్టు నీరు అందని పరిస్థితి. అదే విధంగా మహారాష్ట్ర- ఆంధ్రరాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీర నదిపై లెండి ప్రాజెక్టు ఎగువ భాగంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని మహారాష్ట్ర సీఎం పేర్కొనడంతో మనకు నీటి సమస్య తలెత్తక తప్పదని తెలుస్తుంది. -
బాబ్లీకి తాళం
భైంసా, న్యూస్‌లైన్ : మహారాష్ట్ర సర్కారు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ప్రాజెక్టు గేట్లను దించే విషయంలో మహారాష్ర్ట సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గేట్లు దించే కార్యక్రమానికి మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి అజీత్రావుపవార్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చౌహాన్, జలవనరుల శాఖ మంత్రి సునిత్తట్కారే, నాందేడ్ జిల్లా ఇన్చార్జి మంత్రి డీపీ సావంత్ హాజరయ్యారు. మూడు రోజులుగా అక్కడి పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే సోమవారం అర్ధరాత్రి 12 గంటలు తర్వాత ప్రాజెక్టు 14 గేట్లలో 12 గేట్లను కిందికి దించేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో బాబ్లీ చేరుకున్న అమాత్యులు మిగిలిన రెండు గేట్లను మధ్యాహ్నం 3.16 గంటలకు కిందికి దిం చారు. సుప్రీంకోర్టు తీర్పును క్షణం కూడా ఆల స్యం చేయకుండా కిందికి దించిన వైనం అక్కడి అమాత్యులు ఆ ప్రాంత రైతుల కోసం అక్కడి ప్రాజెక్టుల నిర్వహణ కోసం పట్టిన పట్టుదల ఈ కార్యక్రమంతో మరోసారి మన పాలకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మా వాటా వదులుకోం.. బాబ్లీ గేట్లు కిందికి దించడాన్ని మహారాష్ర్ట సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. ఎన్నో వివాదాలతో పూర్తయిన బాబ్లీ ప్రాజెక్టుతో నాలుగు పట్టణాలతోపాటు 20 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. మహారాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రాంతం లో ప్రవహించే నదులపై ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించేందుకు వెనక్కి తగ్గేదిలేదని ఉప ముఖ్యమంత్రి అజీత్పవార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దాదాగిరి తాము కొనసాగించబోమని తమకు అందాల్సిన నీటి వాటాను వదులుకోలేమని అన్నారు. గ్రామం నుంచి జిల్లా వరకు, రాష్ట్రం నుంచి దేశాల వరకు నీటి గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నారు. గోదావరి నదిపై గాయక్వాడ్ నుంచి బాబ్లీ వరకు ఉన్న 15 ప్రాజెక్టులతో ఈ ప్రాంత రైతులందరికి సాగునీరు అందిస్తామన్నారు. నాలుగు దశాబ్దాల కల నిజమైందని జలవనరు ల శాఖ మంత్రి సునీత్ తట్కారే స్పష్టం చేశారు. మహారాష్ట్ర పరీవాహక ప్రాంతంలోని నీటిని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. మన నీళ్లు మనకే.. మహారాష్ట్ర నీళ్లు మాకే చెందాలని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చౌహాన్ బాబ్లీ సభలో స్ప ష్టం చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టు వివాదాలపై వెనక్కి తగ్గలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు రాజకీయం చేస్తే పీఎం మన్మోహన్సింగ్ను కలిసి ఈ ప్రాం త కష్టాలను వివరించామన్నారు. బాబ్లీ విషయంలో ధర్మాబాద్‌కు వచ్చిన చంద్రబాబు బృందానికి ఔరంగాబాద్ తీసుకువెళ్లి ప్రత్యేక విమానంలో పంపించామని తెలిపారు. మహా రాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్ల దించివేత చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తమవారికి దీపావళి రెం డు రోజుల ముందే వచ్చేసిందన్నారు. బాబ్లీ ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి, ఉమ్రి పట్టణాలకు తాగునీరు 7,395 హెక్టార్లకు సాగునీరు అందనుందన్నా రు. ఇక త్వరితగతిన లెండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయం లో మహారాష్ట్ర 1975 నుంచి పోరాటం చేస్తుం దని నాందేడ్ జిల్లా ఇన్చార్జి మంత్రి డీపీ సావం త్ పేర్కొన్నారు. దక్షిణ గంగపై బాబ్లీ ప్రాజెక్టు పూజలు చేయడం మరిచిపోలేమన్నారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ ప్రవహించే నదుల్లో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. భారీ బందోబస్తు ప్రాజెక్టు గేట్ల కిందికి దించే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేసింది. గేట్లను కిందికి దించే విషయంలో మూడు రోజులుగా ప్రాజెక్టు ప్రాం తంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు మోహరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నూ అనుమతి ఉన్న పాత్రికేయులకే లోపలకు ఆహ్వానించారు. గేట్లు కిందకు దించగానే అక్కడికి చేరుకున్న వేలాది రైతులు టపాసులు మో గించి సంబరాలు జరుపుకున్నారు. అమాత్యులు గోదారమ్మకు పచ్చచీరలు, టెంకాయలు పై నుంచి కిందకు జారవిడిచారు. -
విగ్రహాలకు హాని జరిగితే బీఎంసీదే బాధ్యత!
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సమయంలో విగ్రహాలకు ఏదైనా హాని జరిగితే దాని బాధ్యత బీఎంసీ పరిపాలన విభాగానిదేనని బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు నరేశ్ దహిబావ్కర్ హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో గణేశ్ ఉత్సవ మండళ్ల పదాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముందుగా ఉత్సవాల సమయంలో నాలుగు రోజులపాటు అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతినిచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో నగర రహదారులపై పడిన గుంతలను పూడ్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు చవాన్ సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేశారు. మరో పక్క బీఎంసీ కూడా ఉత్సవాలకు ముందే వాటిని పూడ్చివేయిస్తామని మండళ్లకు హామీ ఇచ్చింది. కాని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గత ఏడాది నిమజ్జనాల సమయంలో ఊరేగింపులోని ఓ సార్వజనిక గణేశ్ మండలి భారీ విగ్రహం ట్రాలీ చ క్రం గుంతలో ఇరుక్కుని పక్కకు ఒరిగిపోయింది. దీంతో విగ్ర హానికి హాని జరిగింది. అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఇదిలా ఉండగా ఉత్సవాల సమయంలో వినాయకుని దర్శనం కోసం క్యూలో నిలబడిన మహిళలు, బాలికలపై ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండళ్లదే అని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్ ప్రకటించడంపై కూడా మండళ్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.