ముంబై:మహారాష్ట్రలో అసమ్మతి సెగలు పతాకస్థాయికి చేరాయి. గత కొంతకాలంగా మహారాష్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తప్పించాలని డిమాండ్ చేస్తున్న మంత్రి నారాయణ్ రాణే సోమవారం రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ కు సేవలందిస్తామని రాణే తెలిపారు.
అసలే లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తొలుత మహారాష్ట్రలో విభేదాలు తారాస్థాయికి చేరడంతో రాణే మంత్రి పదవి నుంచి వైదొలిగారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తప్పించకపోతే కేబినెట్ నుంచి వైదొలగుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో పీసీసీ చీఫ్ను మార్చాలని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
మంత్రి నారాయణ్ రాణే రాజీనామా
Published Mon, Jul 21 2014 3:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement