
సాక్షి, ఆదిలాబాద్ : బైంసాలోని సాయిబాబా మందిరంలో 18 సంవత్సరాలుగా పెంచిన పలికే చిలుక మృతి చెందింది. ఈ జాతి రామ చిలుకలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ చిలుకను ఆలయ పరిసరంలోని దశరత్ కుటుంబం పెంచుకున్నారు. ఈ చిలుకతో ఎవరైనా కాసేపు మాట్లాడితే కొద్ది సమయానికి ఆ పదాలను తిరిగి పలుకుతుంది. ఇది దీని ప్రత్యేకత. చిలుకను చూడడానికి రోజు చాలా మంది వస్తూ ఉండేవారు. అయితే చిలుక మృతితొ కుటుంబ సభ్యుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలొ ఒకరిగా ఉన్న చిలుకకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం)
Comments
Please login to add a commentAdd a comment