
సాక్షి, హైదరాబాద్: భైంసా ఘటనలో నిరాశ్రయులై, భయభ్రాంతులకు గురైన పిల్లలు, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే డిమాండ్ చేశారు. నగరంలోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భైంసాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, బాధితులు ఇంకా భయంభయంగానే బతుకుతున్నారన్నారు. ఘటనకు కారకులైన వారిని వదిలేసి, అమాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. ఒక వర్గం వాళ్లు మరో వర్గం వారిపై కావాలనే దాడి చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పూరి గుడిసెలు, పెంకుటిళ్లలో పెట్రోబాంబులు వేయడం, రాళ్లు వేయడం వంటి చర్యలు చూస్తుంటే పథకం ప్రకారం చేసినట్లే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. భైంసా ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని తెలిపారు. అక్కడి పరిస్థితులను దాచిపెట్టే ందుకు మీడియాపై ఆంక్షలు విధించినా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment