ఫర్హాన్ నవాజ్(ఫైల్)
భైంసాటౌన్: సహచరుల వేధింపులతో మనస్తాపం చెందన ఓ విద్యార్థి కళాశాలలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా భైంసాలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర కళాశాలలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఫర్హాన్‌నవాజ్ (17) స్థానిక మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నా డు. ఆదివారం తెల్లవారుజామున కళాశాలలోని ప్రార్థనా మందిరంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
ఉదయం ప్రార్థన కోసం మందిరంలోకి వెళ్లిన విద్యార్థులు ఫర్హాన్ నవాజ్ చనిపోయి ఉండటం గమనించి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడి జేబులో నుంచి సూసైడ్‌నోట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఫర్హాన్‌నవాజ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌లో ‘కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు నన్ను ‘సార్‌కు రైట్ హ్యాండ్’అంటూ ఆట పట్టిస్తున్నారు. ఈ విష యం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా వారిపై చర్య తీసుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. ఆత్మహత్య చేసుకున్నందుకు వారి ని ఏమీ అనొద్దు’అని ఫర్హాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment