పలికే చిలుక మూగబోయింది.. | Adilabad District: Talking Parrot Died In Bhainsa | Sakshi
Sakshi News home page

పలికే చిలుక మూగబోయింది..

Published Wed, Sep 9 2020 6:26 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

సాక్షి, ఆదిలాబాద్‌ : బైంసాలోని సాయిబాబా మందిరంలో 18 సంవత్సరాలుగా పెంచిన పలికే చిలుక మృతి చెందింది. ఈ జాతి రామ చిలుకలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ చిలుకను ఆలయ పరిసరంలోని దశరత్ కుటుంబం పెంచుకున్నారు. ఈ చిలుకతో ఎవరైనా కాసేపు మాట్లాడితే కొద్ది సమయానికి ఆ పదాలను తిరిగి పలుకుతుంది. ఇది దీని ప్రత్యేకత. చిలుకను చూడడానికి రోజు చాలా మంది వస్తూ ఉండేవారు. అయితే చిలుక మృతితొ కుటుంబ సభ్యుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలొ ఒకరిగా ఉన్న చిలుకకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement