నాయుడుపేట టౌన్(నెల్లూరు జిల్లా): బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహిళను బుధవారం ప్రజలు పట్టుకున్నారు. ఈ సంఘటన నాయుడుపేటలోని ముస్లింవీధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జి.భాస్కర్ కుమార్తె హాసిని (7) ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఓ మహిళ చిన్నారిని పిలిచి నీకు కొత్త వస్తువులు కొనిపెడతానని తీసుకెళ్లింది. అక్కడున్న పిల్లలు హాసినీని ఎవరో తీసుకెళ్తున్నట్లు చెప్పారు. చిన్నారి తల్లి అనిత స్థానికులతో కలిసి వెతుకులాట ప్రారంభించింది.(చదవండి: తెలంగాణలో ఒకరిని.. ఆంధ్రాలో మరొకరిని..)
కాగా మార్కెట్ సమీపంలో హాసినీని ముస్లింవీధికి చెందిన పఠాన్ నప్రూల్లా అనే యువకుడు గుర్తించాడు. వెంటనే వెళ్లి మహిళను పట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె చిన్నపిల్లలకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి వారి వద్ద కాళ్ల పట్టీలు, కమ్మలను అపహరిస్తుందని గుర్తించారు. మహిళ కావమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటుందని చెప్పారు. భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: బైక్‌పై వెనుక కూర్చుని.. కసితీరా పొడిచేసింది)
Comments
Please login to add a commentAdd a comment