
సాక్షి, తిరుపతి : అలిపిరిలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాలుడ్ని కనుగొన్నారు పోలీసులు. ఈ నెల 27న అలిపిరి బస్టాండ్ వద్ద సాహూ అనే బాలుడ్ని కర్ణాటకలోని మున్నియనపల్లికి చెందిన శివప్ప అనే వ్యక్తి అపహరించిన సంగతి తెలిసిందే. శివప్పకు వి.కోటకు చెందిన కళావతితో వివాహం అయింది. వీరికి పుట్టిన నలుగురు పిల్లల్లో ముగ్గురు అనారోగ్యంతో చనిపోగా.. డిప్రెషన్‌కు గురయ్యాడు.
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాహూ ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశాడు. నిందితుడ్ని గత 14 రోజులుగా పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతడు బాలుడ్ని విజయవాడలో వదిలేశాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి బాలుడ్ని గుర్తించారు. బాలుడితో విజయవాడనుంచి తిరుపతి బయలుదేరారు.
చదవండి : మైనర్‌తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో..
Comments
Please login to add a commentAdd a comment