సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారం క్రికెట్ ఆస్ట్రేలియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు రెండు గంటల పాటు కారులో తిప్పారు. సిడ్నీ నగరానికి దూరంగా గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి గన్‌తో బెదిరించారు. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మెక్‌గిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బుధవారం మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నలుగురు కిడ్నాపర్లలో ఒక వ్యక్తి మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు కావడంతో కొత్త మలుపు తీసుకుంది.
ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారియా సొటిరోపౌలోస్‌తో పరిచయం పెరిగి అది ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి వారిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ విషయం మారినో సోదరుడికి తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా కిడ్నాప్ వ్యవహారంపై మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ మారియా స్పందించింది.
స్టువర్ట్ గిల్‌ను బంధించిన ప్రదేశం
'ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను భయపడుతూనే ఉన్నా. కిడ్నాప్ తర్వాత ఆ భయం మరింత పెరిగింది.. ఈ సమయంలో నేను సురక్షితంగా ఉంటానో లేదో తెలియదు. అసలు ఇప్పటికి ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. కిడ్నాప్ వ్యవహారంలో నా సోదరుడు పాత్ర ఉందని తెలుసుకున్నా. అయినా మేమిద్దరం తోడబుట్టినవాళ్లమే అయినా ఎవరి జీవితాలు వారివి. నా సోదరునితో నాకు మంచి రిలేషన్‌షిప్ లేదు.. అందుకే అతనికి దూరంగా ఉంటున్నా. మెక్‌గిల్ విషయంలో నా సోదరుడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అంటూ చెప్పుకొచ్చింది. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు.
చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment