Stuart McGill
-
అసలు విషయం ఇదీ! ఆసీస్ మాజీ స్పిన్నర్ వక్రబుద్ధి
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ డ్రగ్స్ సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 2021 ఏప్రిల్‌లో కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్‌నకు ప్రయత్నించి కొట్టారంటూ మెక్‌గిల్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు చేయగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు నిందితులను విచారించగా, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో మెక్‌గిల్ కూడా ఒకడని తెలిసింది. ఈ క్రమంలో వారి మధ్య వచ్చిన విభేదాల వల్లే కిడ్నాప్ ఉదంతం జరిగిందని విచారణలో తేలింది. దాంతో గిల్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. మెక్‌గిల్‌కు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ లభించింది. కాగా తనను కిడ్నాప్ చేసిన సమయంలో నిందితులు.. ఒంటిపై దుస్తులు తీసేసి.. దారుణంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారంటూ మెక్‌గిల్ గతంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా అతడి వక్రబుద్ధి గురించి నిజం బయటకు వచ్చింది. ఇక ఆసీస్ స్టార్ స్పిన్నర్‌గా ఎదిగే సమయంలో షేన్ వార్న్ నుంచి పోటీ మెక్‌గిల్ అవకాశాలను దెబ్బతీసింది. 52 ఏళ్ల ఈ లెగ్‌స్పిన్నర్ ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టుల్లో 208 వికెట్లు పడగొట్టాడు. -
'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు'
ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. గతేడాది మార్చిలో దుండగులు సిడ్నీలోని తన నివాసంలోనే మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేశారు. ఇది జరిగిన 15 నెలల తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారంపై ఎట్టకేలకు నోరు విప్పాడు. ‘ఆ ఘటనను తలుచుకుంటేనే చాలా భయమేస్తోంది. మనం అసహ్యించుకునే శత్రువులకు కూడా అలా జరుగకూడదరని కోరుకుంటున్నా. కొందరు దుండగులు సిడ్నీలోని నా ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్లు నన్నెక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు. నా కళ్లకు గంతలు కట్టి కార్ లో పడేశారు. నేను కార్లోకి ఎక్కనంటే ఆయుధాలతో బెదిరించారు. సుమారు గంటన్నర పాటు కార్లో ప్రయాణం చేశాం. అయితే వాళ్లు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారనే దానిపై స్పష్టత లేదు. ఒక చోటుకు తీసుకెళ్లిన తర్వాత పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి నా బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిల్చోబెట్టి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఒక చోట నన్ను విడిచి వెళ్లిపోయారు. ఎక్కడున్నానో అర్థం కాక మూడు గంటల పాటు అలాగే నిల్చుండిపోయా. మళ్లీ వచ్చిన దుండగులు కార్లో తీసుకెళ్లి బెల్మోర్ సిటీలో విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడి స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని సిడ్నీలోనే ఒక హోటళ్లో రెండు-మూడు వారాల పాటు గడిపాను. ఆ తర్వాత తెలిసిన స్నేహితుడిని ద్వారా ఫ్రేజర్ ఐలాండ్‌లోని నా గెస్ట్ హౌస్‌లో మరికొన్ని వారాలు గడిపాను. నన్ను కిడ్నాప్ చేసిన దుండగులు అరెస్ట్ అయ్యారని తెలుసుకొని తిరిగి ఇంటికి చేరుకొన్నా.. కానీ ఆ మూడు నెలలు మాత్రం చాలా నరకం అనుభవించా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మొదట్లో మెక్ గిల్‌ను డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని చాలా మంది భావించారు. కానీ ఈ కేసులో మెక్ గిల్ భార్య తమ్ముడి హస్తం ఉందని తేలింది. మత్తు పదార్థాల సరఫరా విషయంలో మెక్ గిల్ ఇన్వాల్వ్ అయ్యాడని.. అందుకే దుండగులతో కిడ్నాప్ చేయించి వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక 1998-2008 మధ్య ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడాడు. 44 టెస్టులాడిన మెక్‌గిల్ 208 వికెట్లు.. మూడు వన్డేలాడి 6 వికెట్లు తీశాడు. చదవండి: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి -
'ఇప్పటికీ భయపడుతున్నా.. కిడ్నాప్‌తో నాకు సంబంధం లేదు'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారం క్రికెట్ ఆస్ట్రేలియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు రెండు గంటల పాటు కారులో తిప్పారు. సిడ్నీ నగరానికి దూరంగా గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి గన్‌తో బెదిరించారు. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మెక్‌గిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బుధవారం మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నలుగురు కిడ్నాపర్లలో ఒక వ్యక్తి మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు కావడంతో కొత్త మలుపు తీసుకుంది. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారియా సొటిరోపౌలోస్‌తో పరిచయం పెరిగి అది ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి వారిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ విషయం మారినో సోదరుడికి తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా కిడ్నాప్ వ్యవహారంపై మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ మారియా స్పందించింది. స్టువర్ట్ గిల్‌ను బంధించిన ప్రదేశం 'ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను భయపడుతూనే ఉన్నా. కిడ్నాప్ తర్వాత ఆ భయం మరింత పెరిగింది.. ఈ సమయంలో నేను సురక్షితంగా ఉంటానో లేదో తెలియదు. అసలు ఇప్పటికి ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. కిడ్నాప్ వ్యవహారంలో నా సోదరుడు పాత్ర ఉందని తెలుసుకున్నా. అయినా మేమిద్దరం తోడబుట్టినవాళ్లమే అయినా ఎవరి జీవితాలు వారివి. నా సోదరునితో నాకు మంచి రిలేషన్షిప్ లేదు.. అందుకే అతనికి దూరంగా ఉంటున్నా. మెక్‌గిల్ విషయంలో నా సోదరుడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అంటూ చెప్పుకొచ్చింది. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు. చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్ -
ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్లో ఒకప్పుడు సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.బుధవారం తెల్లవారుఝామున వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయంలోకి వెళితే.. 50 ఏళ్ల మెక్‌గిల్‌ను గత నెల 14న ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఓ వాహనంలో సిడ్నీ నుంచి దూరమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి అతన్ని తీవ్రంగా కొట్టి గన్‌తో బెదిరించారు. అతని నుంచి వాళ్లు భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. అనంతరం గంట తర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ ఘటన జరిగిన వారం తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు. చదవండి: 'నాన్న తొందరగా వచ్చేయ్.. నిన్ను మిస్సవుతున్నాం' కరోనా.. విరాళం అందించిన మరో ఆసీస్ క్రికెటర్ -
క్రికెట్ ఆస్ట్రేలియాపై మెక్‌గిల్ దావా
మెల్బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తనకు 2.6 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.16 కోట్లు)కు పైగా చెల్లించాలని మాజీ లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ దావా వేశాడు. విక్టోరియన్ సుప్రీం కోర్టులో వేసిన ఈ దావాలో.... సీఏ తనకు మ్యాచ్ ఫీజు, ప్రైజ్‌మనీ కింద 1.6 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉందని, అలాగే ఈ మొత్తంపై 9 లక్షల 84 వేల డాలర్లు వడ్డీ, ఖర్చుల కింద ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 1998-2009 మధ్య తాను క్రికెట్ ఆస్ట్రేలియాతో కాంట్రాక్ట్ ఆటగాడిగా ఉన్నట్టు తన పిటిషన్లో తెలిపాడు. అయితే గాయం కారణంగా మ్యాచ్‌లు ఆడని సమయంలో ఇంజ్యురీ పాలసీ ప్రకారం చెల్లింపులు జరిపినా.. మే 2008లో తాను అన్‌ఫిట్‌గా ఉండడంతో ఆ తర్వాత రెండేళ్ల కాలంలో సీఏ ఎలాంటి చెల్లింపులు చేయలేదని ఆరోపించాడు. ‘హెచ్ఐఎల్లో పాక్ ఆటగాళ్లు ఆడాలి’ న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ప్రమాణాలు మరింత మెరుగుపడాలంటే పాకిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లకు కూడా ఇందులో చోటుండాలని భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్, మాజీ సారథి అజిత్ పాల్ సింగ్ అన్నారు. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వ అనుమతి మేరకు నడుచుకోవాలని సూచించారు. ‘పాక్ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. మంచి ఆటగాళ్లకు ఈ లీగ్‌లో స్థానముండాలి. అయితే ప్రస్తుత పరిస్థితి గురించి నాకు అవగాహన ఉంది. అందుకే ఈ అంశంలో కేంద్రం సూచనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది’ అని సర్దార్ అన్నాడు.