క్రికెట్ ఆస్ట్రేలియాపై మెక్‌గిల్ దావా | Stuart MacGill sues Cricket Australia for $2.6m | Sakshi
Sakshi News home page

క్రికెట్ ఆస్ట్రేలియాపై మెక్‌గిల్ దావా

Published Tue, Jan 20 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

క్రికెట్ ఆస్ట్రేలియాపై మెక్‌గిల్ దావా

క్రికెట్ ఆస్ట్రేలియాపై మెక్‌గిల్ దావా

మెల్‌బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తనకు 2.6 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.16 కోట్లు)కు పైగా చెల్లించాలని మాజీ లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ దావా వేశాడు. విక్టోరియన్ సుప్రీం కోర్టులో వేసిన ఈ దావాలో.... సీఏ తనకు మ్యాచ్ ఫీజు, ప్రైజ్‌మనీ కింద 1.6 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉందని, అలాగే ఈ మొత్తంపై 9 లక్షల 84 వేల డాలర్లు వడ్డీ, ఖర్చుల కింద ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

1998-2009 మధ్య తాను క్రికెట్ ఆస్ట్రేలియాతో కాంట్రాక్ట్ ఆటగాడిగా ఉన్నట్టు తన పిటిషన్‌లో తెలిపాడు. అయితే గాయం కారణంగా మ్యాచ్‌లు ఆడని సమయంలో ఇంజ్యురీ పాలసీ ప్రకారం చెల్లింపులు జరిపినా.. మే 2008లో తాను అన్‌ఫిట్‌గా ఉండడంతో ఆ తర్వాత రెండేళ్ల కాలంలో సీఏ ఎలాంటి చెల్లింపులు చేయలేదని ఆరోపించాడు.
 
 ‘హెచ్‌ఐఎల్‌లో పాక్ ఆటగాళ్లు ఆడాలి’
 న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో ప్రమాణాలు మరింత మెరుగుపడాలంటే పాకిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లకు కూడా ఇందులో చోటుండాలని భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్, మాజీ సారథి అజిత్ పాల్ సింగ్ అన్నారు. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వ అనుమతి మేరకు నడుచుకోవాలని సూచించారు. ‘పాక్ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. మంచి ఆటగాళ్లకు ఈ లీగ్‌లో స్థానముండాలి. అయితే ప్రస్తుత పరిస్థితి గురించి నాకు అవగాహన ఉంది. అందుకే ఈ అంశంలో కేంద్రం సూచనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది’ అని సర్దార్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement