
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒకప్పుడు సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.బుధవారం తెల్లవారుఝామున వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయంలోకి వెళితే.. 50 ఏళ్ల మెక్‌గిల్‌ను గత నెల 14న ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఓ వాహనంలో సిడ్నీ నుంచి దూరమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఓ బిల్డింగ్‌లో బంధించి అతన్ని తీవ్రంగా కొట్టి గన్‌తో బెదిరించారు. అతని నుంచి వాళ్లు భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. అనంతరం గంట తర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ ఘటన జరిగిన వారం తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment