సాక్షి, విశాఖపట్నం: నగరంలో కిడ్నాప్ వ్యవహారం వెలుగుచూసింది. ఓ రియల్టర్‌ను భార్యతో సహా కిడ్నాప్ చేశారు దుండగులు. అయితే అంతేవేగంగా స్పందించిన పోలీసులు కేసును చేధించారు. బాధితుల్ని రక్షించడంతో పాటు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. రియల్టర్ శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు అంతే చాకచక్యంగా చేధించారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు.
భర్తపై ఛీటింగ్ కేసు.. కిడ్నాపర్ల డిమాండ్
మరోవైపు శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖ కి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. గతంలో శ్రీనివాస్‌పై విజయవాడ పడమటలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జూన్ 2021లో శ్రీనివాస్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ సమయంలో రూ.3 కోట్లు కాజేజినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ తరుణంలో వాళ్ల దగ్గరి నుంచి రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తూ కిడ్నాప్‌కు దిగారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుండగా.. ఈస్ట్ ఏసిపి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో అదృశ్యం.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం
Comments
Please login to add a commentAdd a comment