సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ కిడ్నాప్ కేసు సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తన తప్పేమీ లేదంటూ నిందితుడు నవీన్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో వైశాలిని సాక్షి టీవీ సంప్రదించగా కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ రెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు వైశాలి. తమకు పెళ్లి జరగలేదని తేల్చి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
‘మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రోజుకొక కొత్త విషయం చెబుతున్నాడు. నవీన్ రెడ్డిది వన్‌సైడ్ లవ్. అతడి తల్లి చెపినవన్నీ అబద్ధాలే. నవీన్ రెడ్డే నాతో పెళ్లి కాలేదని ఒప్పుకున్నాడు. గోవాకు నవీన్‌తో ఒంటరిగా వెళ్లలేదు.. ఫ్యామిలీతో కలిసి వెళ్లా. అతడిని స్నేహితుడిగా మాత్రమే చూశా. ఆరోగ్యం బాలేదని గోవాకు ఎందుకు వెళ్లాడు. జనవరిలోనే పెళ్లి చేసుకోనని చెప్పాను. నవీన్‌రెడ్డి లాంటి వారిని ఏ అమ్మాయి ఒప్పుకోదు.’ అని స్పష్టం చేసింది వైశాలి.
ఇదీ చదవండి: Manneguda Kidnap Case: వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో
Comments
Please login to add a commentAdd a comment