Adibatla Woman Kidnap Case: Vaishali Comments After Saved By Police - Sakshi
Sakshi News home page

యువతి కిడ్నాప్‌ కేసు: ‘నవీన్‌ను ప్రేమించలేదు.. కారులోనే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు’

Published Sat, Dec 10 2022 7:40 PM | Last Updated on Sat, Dec 10 2022 8:53 PM

Adibatla Woman Kidnap Case: Vaishali Comments After Saved By Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్‌కు గురైన యువతి వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా యువతి శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. నవీన్‌ రెడ్డితో తనకు ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే ఉందని ప్రేమించలేదని సంచలన విషయాలు బయటపెట్టింది. నవీన్‌ తనకు ప్రపోజ్‌ చేస్తే నో చెప్పినట్లు వెల్లడించింది. కిడ్నాప్‌ చేసేందుకు వచ్చిన వాళ్లు తన పట్ల ఘోరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది.  

ఆమె మాట్లాడుతూ.. ‘మాతో కలిసి నవీన్‌ బ్యాడ్మింటన్‌ ఆడేవాడు. నాకు నవీన్‌ అంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టమని చెబితే పేరెంట్స్‌ను అడగమని చెప్పా. ఇష్టం లేదని చెపుతున్నా వినిపించుకోలేదు. నా ఇష్టంతో పనిలేదని చెప్పాడు. నా ఇష్టంతో సంబంధ లేకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. నా పేరుతో నకిలీ ఇన్‌స్టా అకౌంట్‌ క్రియేట్‌ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు. నాకు ఇష్టం ఉంటే నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. నవీన్‌తోనా పెళ్లి జరగలేదు. పెళ్లైందని చెప్పడం నిజం కాదు. 

నాతో పెళ్లి జరిగిందని చెబుతున్న రోజు ఆర్మీ కాలేజీలో డెంటల్‌ ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను. పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు మార్ఫింగ్‌ చేసి నా భవిష్యత్తును నాశనం చేశాడు. తను చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించాడు. ఫ్రెండ్స్‌ అందరం కలిసి వెళ్లాం కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్లలేదు. నా కంట్రోల్‌లో ఉంటేనే మీ ఇళ్లు సేఫ్‌గా ఉంటుందని నవీన్‌ బెదిరించాడు. 10 మంది నాపై దాడి చేసి ఇంట్లో నుంచి  ఎత్తుకెళ్లారు. నాన్ను చాలా ఘోరంగా ట్రీట్‌ చేశారు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావ్‌ అని నవీన్‌రెడ్డి ఒక్కడే నన్ను కారులోనే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నాకు దక్కకుంటే...నిన్ను ఎవరికీ దక్కనివ్వను అని చిత్రహింసలకు గురి చేశాడు.

మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను కొట్టలేదు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు చర్యలు తీసుకుంటే నాపై దాడి జరిగేది కాదు.  అంతమంది ఉన్నప్పుడే నన్ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు సెక్యూరిటీ అవసరం. నా కెరీర్‌ మొత్తాన్ని నాశనం చేశాడు. నన్ను కిడ్నాప్‌ చేసిన నవీన్‌, అతని ముఠాను కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్‌ చేశారు.
చదవండి: టెక్కీ భర్త నిర్వాకం.. స్నేహితులతో పడుకోవాలని భార్యను బలవంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement