ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: రేప్ అండ్ కిడ్నాప్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలైంది. మొత్తం ఆరు వందల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు రాచకొండ పోలీసులు. ఛార్జ్‌షీట్‌లో అన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో రెండు నెలలపాటు జైల్లోనే ఉన్న నాగేశ్వరరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక పోలీస్ విభాగం ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని పేర్కొంటూ.. నాగేశ్వరరావును హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. సర్వీసు నుంచి తొలగించారు.
ఛార్జ్‌షీట్‌లో సీసీ ఫుటేజ్, డీఎన్‌ఏ రిపోర్ట్, యాక్సిడెంట్ వివరాలు, వెపన్ దుర్వినియోగం, బాధితురాలి స్టేట్‌మెంట్.. ఇలా మొత్తం వివరాలను నమోదు చేశారు. నాగేశ్వరరావుకు శిక్ష పడేలా కోర్టుకు ఆధారాలు సమర్పించింది పోలీస్ శాఖ.
Comments
Please login to add a commentAdd a comment