సాక్షి, మహబూబాబాద్ : చిన్నారి దీక్షిత్‌ను అతి కిరాతకంగా చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ నేత విరహత్ అలీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన దీక్షిత్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఘటన జరిగిన తీరును తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అనంతరం జరలిస్ట్ నేతలు ఎస్పీ కోటిరెడ్డిని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని నిందితుడికి కఠిన శిక్ష పదేవిధంగా చూస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కాగా, నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన 2 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ సాగర్ హత్య చేసిన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలుడికి ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి, కర్చీఫ్‌తో చేతులు కట్టి.. చిన్నారి టీషర్ట్‌తోనే మెడకు ఉరి బిగించి చంపాడు. ఆ హత్య తర్వాతే బాలుడి తల్లిదండ్రులనుంచి 45 లక్షలు డిమాండ్ చేశాడు. దీక్షిత్‌రెడ్డి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. (దీక్షిత్ హత్య: అంతా ఆ ఒక్కడే! )
Comments
Please login to add a commentAdd a comment