deekshith
-
Snehil Dixit Mehra: ఇంజినీర్ టు క్రియేటివ్ డైరెక్టర్..
నేర్చుకోవాలనే తపన ఉంటే... అదే తపస్సు. ఆ తపస్సు ఫలితాలు ఊరకే పోవు. విజయాలకు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి డిగ్రీలు, అనుభవం లేకుండానే ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది స్నేహిల్ దీక్షిత్ మెహ్రా. వేగంగా నేర్చుకోవాలనే తపన ఆమె బలం. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, కంటెంట్ క్రియేటర్, యాక్టర్, క్రియేటివ్ డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.జర్నలిస్ట్ కావాలనుకుంది స్నేహిల్. ‘అదేం కుదరదు. ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాల్సిందే’ అన్నారు తల్లిదండ్రులు. దీంతో భో΄ాల్లో ఇంజినీరింగ్ చేసింది. చదువు పూర్తయిన తరువాత ముంబైలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసింది. ఉద్యోగం చేస్తున్న మాటేగానీ తన మనసంతా టీవీ రంగంపైనే ఉండేది. ఒక ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక చానల్లో ట్రైనీగా చేరింది. తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు.‘జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకుండా నెగ్గుకు రావడం కష్టం’ అన్నారు.ఆ తరువాత తల్లి మాత్రం ‘ఫరవాలేదు’ అన్నట్లుగా మాట్లాడింది. అండగా నిలబడింది. ముంబైలో ఉండే సోదరుడుప్రోత్సహించాడు.కొత్త ప్రయాణంలో స్నేహిల్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ‘ఓటమిని దరి చేరనివ్వవద్దు’ అని బలంగా అనుకునే స్నేహిల్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ వెళ్లింది. సవాళ్లను అధిగమించే శక్తి తనకు త్వరగా నేర్చుకునే నైపుణ్యం నుంచి వచ్చింది.స్టోరీ టెల్లింగ్పై ఉన్న ΄ాషన్తో టెలివిజన్ నుంచి ఓటీటీకి అక్కడి నుంచి సోషల్ మీడియాకు వచ్చిన స్నేహిల్ ప్రతిచోటా తనను తాను నిరూపించుకుంది. ఎన్నో షోలు చేసి రైటర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘అప్‌హరణ్’ వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా నటిగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇదంతా ఒక్క ఎత్తయితే ‘హీరామండీ’ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ టీమ్‌లో చేరడం మరో ఎత్తు.రైటింగ్ విభాగంలో పనిచేసిన స్నేహిల్‌కు సంజయ్ లీలా భన్సాలీ కొన్ని సీన్లను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సీన్లు బాగా చేయడంతో ‘హీరామండీ’ సిరీస్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా ప్రమోట్ అయింది.‘ఇది పదిహేడు సంవత్సరాల కష్టఫలితం. భన్సాలీతో పని చేయడం వరంలాంటిది. ఫిల్మ్‌మేకర్,ప్రొడ్యూసర్‌గా ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయనతో పనిచేయడం అంటే ఫిల్మ్ స్కూల్లో చేరి ఎన్నో విషయాలు నేర్చుకోవడంలాంటిది’ అంటుంది స్నేహిల్.ఇక ఇన్ఫ్లూయెన్సర్గా తన అనుభవాన్ని గురించి చెబుతూ... ‘కామెడీ అనేది రిస్క్. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో ఊహించలేము. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా నా వీడియోల నుంచి ఇన్స్టంట్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేదాన్ని. ఫలానా వీడియో అభ్యంతరకరంగా, నొప్పించేలా ఉంది అనే కామెంట్స్ కనిపిస్తే వెంటనే ఆ వీడియోను తొలిగించేదాన్ని. ఎవరినీ నొప్పించకుండా అందరూ హాయిగా నవ్వుకునేలా కంటెంట్‌ను రూ΄÷ందించడం అనేది నిజంగా సవాలే’ అంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలి స్నేహిల్ దీక్షిత్ మెహ్ర. కలల దారిలో...కలలు కనడం అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. కల కనడం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఉత్సాహం దగ్గర మాత్రమే ఆగిపోకుండా నా కలను సాకారం చేసుకోవడానికి కష్టపడ్డాను. నేర్చుకోవాలనే ఉత్సాహం, నిరంతర కష్టం మనకు విజయాన్ని చేకూరుస్తాయి. – స్నేహిల్ దీక్షిత్ మెహ్ర -
అతడికి మరణ శిక్ష పడేలా కృషిచేయండి
సాక్షి, మహబూబ్‌నగర్ : నగరానికి చెందిన మందా సాగర్ అనే యువకుడి చేతిలో కిడ్నాప్, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడు సాగర్‌ను మరోసారి విచారించి, వెంటనే శిక్షించాలని కోరారు. పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ‘‘ ఈ నెల 18వ తేదీ సాయంత్రం దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి, వెంటనే హత్య చేశారు. ఇది దురదృష్టకరం. 300 మంది పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా దీక్షిత్ రెడ్డి ఆచూకీ లభించలేదు. మీడియా, ప్రజలు బాగా కష్ట పడ్డారు. ( డెంటల్ డాక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతం ) దీక్షిత్ రెడ్డి క్షేమంగా వస్తాడని ఎదురు చూశారు. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ ఉదంతాన్ని చూసి హైదరాబాద్‌లో మరో సంఘటన జరిగింది. భవిష్యత్‌లో ఇది రోల్ మోడల్‌గా మారే అవకాశం ఉంది. దేశంలో తెలంగాణ పోలీసులు అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ దురదృష్టవశాత్తు దీక్షిత్ తిరిగిరాలేదు. ఇది మా దురదృష్టం. నిందితుడికి వెంటనే మరణ శిక్ష పడే విధంగా పోలీసులు కృషి చేయాలి. రాష్ట్ర ప్రజలంతా ఆ శిక్ష కోసం ఎదురు చూస్తున్నార’’ని అన్నారు. -
దీక్షిత్‌ను చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలి
సాక్షి, మహబూబాబాద్ : చిన్నారి దీక్షిత్‌ను అతి కిరాతకంగా చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ నేత విరహత్ అలీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన దీక్షిత్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఘటన జరిగిన తీరును తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అనంతరం జరలిస్ట్ నేతలు ఎస్పీ కోటిరెడ్డిని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని నిందితుడికి కఠిన శిక్ష పదేవిధంగా చూస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కాగా, నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన 2 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ సాగర్ హత్య చేసిన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలుడికి ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి, కర్చీఫ్‌తో చేతులు కట్టి.. చిన్నారి టీషర్ట్‌తోనే మెడకు ఉరి బిగించి చంపాడు. ఆ హత్య తర్వాతే బాలుడి తల్లిదండ్రులనుంచి 45 లక్షలు డిమాండ్ చేశాడు. దీక్షిత్‌రెడ్డి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. (దీక్షిత్ హత్య: అంతా ఆ ఒక్కడే! ) -
దీక్షిత్ హత్య.. ఎన్నో అనుమానాలు?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్‌లో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి(9) హత్య కేసులో నిందితుడి వివరాలపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఇంటర్ చదివి ఆటో మెకానిక్‌గా పనిచేస్తున్న సాగర్ ఒక్కడే కిడ్నాప్, హత్యచేయటం, ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఎవరైనా రూ.10 లక్షలు, రూ.20లక్షల అడుగుతారు కానీ ప్రత్యేకంగా రూ.45 లక్షలే డిమాండ్ చేయడం ఏమిటనే ప్రశ్న కూడా ప్రజలను వెంటాడుతోంది. ఒక్కడే చేశాడా? పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం హత్యలో సాగర్ ఒక్కడి ప్రమేయమే ఉందని వెల్లడించారు. అయి తే, నిందితుడు మరో నలుగురి పేర్లు చెప్పినా, కావాలనే చెప్పినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. కాగా, కేవలం డబ్బు మాత్రమే నిందితుడి టార్గెట్ కాకపోవచ్చని, డబ్బులే కావాల్సి ఉంటే హత్య చేయకపోయి ఉండేవాడని చెబుతున్నారు. నలుగురు కలిసి ప్లాన్ చేశారని, దీక్షిత్ సమాచారం ఇచ్చిన దగ్గరి వ్యక్తికి రూ. 15లక్షలు, మిగిలిన వారు తలా రూ.10లక్షల చొప్పున తీసుకునేలా నిర్ణయించుకుని ఉంటారని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. (దీక్షిత్ హత్య: నిందితుల ఎన్కౌంటర్?) రూ.1,500 కోసమే హత్యకు బీజం పడిందా? దీక్షిత్ తండ్రి రంజిత్‌రెడ్డి ఓ ఛానెల్లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తూ రెండు ట్రాక్టర్ల ద్వారా ఇసుక వ్యాపారం చేసేవాడు. అలాగే, రంజిత్ భార్య వసంత చీటీల వ్యాపారం చేసేది ఈ క్రమంలో ఖాళీగా ఉన్న తమ దగ్గరి బంధువును డబ్బు వసూలు కోసం తీసుకువచ్చారు. ఆయన ఓసారి ట్రాక్టర్ ఇసుకను రూ.7,500కు పోసి, రంజిత్‌కు రూ.6వేలే ఇచ్చాడని సమాచారం. దీంతో విషయం తెలిసి రంజిత్ ఆయనను పక్కకు పెట్టడంతో కక్ష్య పెంచుకుని, మంద సాగర్ ఇతరులతో కలిసి హత్యకు బీజం వేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అవన్నీ తప్పు డు ప్రచారాలని కొట్టిపారేశారు. ఎవరూ లేనప్పుడు డబ్బు తీసుకుందామని.. నిందితుడు సాగర్ బాలుడి తల్లికి బుధవారం ఫోన్‌చేసి డబ్బును తన మెకానిక్ షాపు ఉన్న మూడు కొట్ల చౌరస్తా వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో రంజిత్‌రెడ్డి డబ్బులను బ్యాగ్‌లో ఉంచి చౌరస్తా వద్ద వాహనంతో పాటు వేచి చూశాడు. అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లిపోయాక తెచ్చుకోవాలని భావించినా సాధ్యం కాలేదని సమాచారం. అందుకే రాత్రి మరోసారి ఫోన్ చేసి ఇంకో స్థలం వద్దకు రమ్మనడం, అంతలోనే పోలీసులు సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఇక రంజి త్ డబ్బుతో వేచి ఉన్నప్పుడు అక్కడికి సమీపంలోని సొంత మెకానిక్ షాపులో ఉన్న నిందితుడు సాగర్ ఓసారి ఆయన దగ్గరకు వెళ్లి విషయమేమిటని ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని రంజిత్ సూచించాడట. అంతేకాకుండా సాగర్ షాపులోనే కొంద రు మఫ్టీ కానిస్టేబుళ్లు ఉండగా, వారిని చూసి అందరినీ ఫూల్స్ చేయడంపై తనలో తాను నవ్వుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడని సమాచారం. నిందితుడు చిక్కింది ఇలా.. కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ డబ్బును తన మెకానిక్ షాపు ఎదురుగా ఉన్న మూడు కొట్ల చౌరస్తా దగ్గరికి తీసుకుమ్మని ఫోన్ చేయగా, డబ్బు సంచితో బాలుడి తండ్రి రంజిత్ వచ్చి రోడ్డుపై నిలబడ్డాడు. అలాగే, చుట్టూ పోలీసులు మప్టీలో ఉండి కిడ్నాపర్ కోసం వేచిచూస్తున్నారు. ఇందులో కొందరు పోలీసులు కిడ్నాపర్ మెకానిక్ షాపులో కూర్చున్నారు. ఈ మేరకు షాపుకు వచ్చిన కొందరు మాట్లాడుతూ బ్యాగ్‌లో రూ.45 లక్షలు లేవని, నకిలీ నోట్లు ఉండవచ్చ ని చర్చించుకోవడం నిందితుడు విన్నాడు. దీంతో మరోసారి బాలుడి తండ్రికి ఫోన్ చేసి ‘బ్యాగ్‌లో నకిలీ నోట్లు ఉంచి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, నేను అంతా చూస్తున్నా.. డ్రోన్ కెమెరా, మఫ్టీ పోలీసులు’ అంటూ మాట్లాడాడు. అయితే, ఇవి నిజమైన నోట్లేనని రంజిత్ చెప్పగా, అప్పటి వరకు వాయిస్ ఛేంజ్ యాప్ ద్వారా ఇంటర్నెట్ కాల్ చేసిన నిందితుడు... ఆ తర్వాత స్కైప్ ద్వారా ఫోన్ చేసి బ్యాగులోని నోట్లను చూశాడు. తన ముఖం కనపడకుండా జాగ్రత్తపడినా.. ఆయన మాట్లాడిన ఫోన్ నంబర్ డిస్ప్లే కావడంతో సైబర్ క్రైం టీం నిందితుడిని అరెస్టు చేసింది. వెలుగులోకి వస్తున్న నేరాలు నిందితుడు సాగర్ ఇద్దరు బావలు పోలీసుశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తానని పదేపదే చెప్పేవాడట. అందులో భాగంగానే ఈజీ మనీ సంపాదించడం కోసం యూట్యాబ్ ద్వారా నిరంతరం టెక్నాలజీ మీద పట్టు సాధించాడు. గతంలో ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోని, ఒక యువతిని వేధించాడు. ఈ వేధింపుల కేసులో సాగర్ పోలీసులకు చిక్కలేదు. తాజా ఘటనతో సాగర్ లీలలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. యూట్యాబ్‌లో చూసి ఇంటర్నెట్ కాలింగ్ నేర్చుకున్న నిందితుడు ‘ఐ డోంట్ వాంట్ ఏ ఫర్ఫెక్ట్ లైఫ్... ఐ వాంట్ ఏ హ్యాపీ లైఫ్’ ఇదీ దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ తన ఫేస్బుక్ వాల్‌పై రాసుకున్న వ్యాఖ్యలు. సులువుగా డబ్బు సంపాదించడం, జల్సా చేయడానికి డబ్బు కోసం అభంశుభం తెలియ ని తొమ్మిదేళ్ల దీక్షిత్‌ను నిందితుడు మంద సాగర్ కిరాతంగా గొంతునలిమి చంపి, ఆపై పెట్రోలు పోసి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ సమయాన కూడా ఆయన ‘గ్రేట్ పోలీస్’ అంటూ ఫేస్బుక్లో కామెంట్ చేశాడు. ఇప్పుడు కూడా నిందితుడు సాగర్‌ను దిశ నిందితుల మాదిరిగా ఎన్కౌంటర్ చేసి తగిన బుద్ధి చెప్పాలని హత్య జరిగిన గుట్ట వద్ద ప్రజలు ధర్నా నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. కంట్రోల్ చేయలేక గంటలోనే హత్య జల్సాలకు అలవాటుపడిన నిందితుడు సాగర్ సులువుగా డబ్బు సంపాదించేందుకు తమ ఇంటి పక్కనే ఉన్న రంజిత్‌రెడ్డి కుమారుడిపై కన్ను పడింది. బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాత –నానమ్మ ఉన్న శనిగపురానికి బాలుడు వచ్చినప్పుడు చనువు పెంచుకున్నాడు. ఇందులో భాగంగా మహబూబాబాద్ కృష్ణా కాలనీలో ఆదివారం ఆడుకుంటున్న దీక్షిత్(9)ను నిందితుడు మంద సాగర్ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం శివారు దానమయ్య గుట్టపైకి తీసుకెళ్లాడు. అయితే, తెలిసిన వ్యక్తే కావడంతో దీక్షిత్ స్నేహితులకు టాటా చెప్పి వెళ్లాడు. కొద్దిసేపటికి చీకటి పడగా ఇంటికి తీసుకెళ్లాలని దీక్షిత్ గొడవ చేశాడు. ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అప్పటికే తన వద్ద ఉన్న మత్తు గోళీ వేసినా దీక్షిత్ పడుకోకపోవడంతో గొంతు నులిమి, తలను బండ రా యికి బాదగా మృతి చెందాడు. ఆ తర్వాత జిల్లా కేంద్రానికి వెళ్లి పెట్రోలు తీసుకుని మృతదేహం వద్దకు వచ్చి పెట్రోల్ పోసి కాల్చివేశాడు. హత్య చేసిన అనంతరమే రాత్రి 9.15 గంటలకు ఇంటర్నెట్ కాల్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు. రైలులో ప్రయాణించేటప్పుడు.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు ఇంటర్నెట్ ద్వారా కా లింగ్ చేయటంపై తెలుసుకున్న ఆసక్తికర విషయాన్ని చెప్పినట్లు సమాచారం. ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన స్నేహితు డు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా సాగర్‌కు ఫోన్ చేసి వేరెవరో ఫోన్ చేసినట్లు ఆట పట్టించాడు. అలా మొదటిసారి ఇంటర్నెట్ కాలింగ్ వివరాలను ఇంటర్ చదివిన ఆటో మెకానిక్ మంద సాగర్ తెలుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా అవగాహన పెంచుకున్నాక, అదే విధానంలో బాలుడి తల్లికి ఫోన్ చేశాడు. ఆది నుంచి వివాదాలే.. నిందితుడు మంద సాగర్ శనిగపురంలో ఆది నుంచి వివాదాస్పదంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయనకు ఓ యువతితో వివాహం నిశ్చయం కాగా, ఆ అమ్మాయిని శివా రు ప్రాంతానికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. అలాగే ఇటీవల తన తాత చేయి విరగొట్టాడని సమాచారం. గతంలో పోలీసుల వద్ద డ్రైవర్‌గా పని చేసిన సాగర్ పట్టణంలో రెండేళ్లుగా మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. గుట్టపైనే పంచనామా, స్వగ్రామంలో అంత్యక్రియలు దీక్షిత్‌రెడ్డి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. దీంతో ఘటనా స్థలా నికే ఫోరెన్సిక్ నిపుణులు, జిల్లా ప్రధాన వైద్యశాల వైద్యులను తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహన్ని పోలీసులు ఆయన తండ్రి స్వగ్రామమైన శనిగపురానికి తరలించగా వారి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
దీక్షిత్ టీషర్ట్‌ను మెడకు చుట్టి హత్య
సాక్షి, మహబూబాబాద్ : నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు నిందితుడు మంద సాగర్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన 2 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ సాగర్ హత్య చేశాడు. బాలుడికి ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి, కర్చీఫ్‌తో చేతులు కట్టి.. చిన్నారి టీషర్ట్‌తోనే మెడకు ఉరి బిగించి చంపాడు. ఆ హత్య తర్వాతే బాలుడి తల్లిదండ్రులనుంచి 45 లక్షలు డిమాండ్ చేశాడు. నిందితుడు సాగర్ బాలుడిని హత్య చేసిన చోట నుంచే డబ్బుల కోసం దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. 45 లక్షల రూపాయలు ఇవ్వకపోతే దీక్షిత్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఇంటర్నెట్ కాల్స్ అవ్వటం వల్ల వెంటనే ఫోన్ కాల్ ట్రేస్ చేయలేకపోయాం. హైదరాబాద్, వరంగల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన.. ఎక్స్పర్ట్ ద్వారా సాగర్ ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశాం. బాలుడిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టాడు. మంద సాగర్ ఒక్కడు మాత్రమే ఈ హత్యలో పాల్గొన్నాడు. మిగితా వారికి ఎలాంటి సంబంధం లేద’’ని తెలిపారు. ( కంగనాపై మరో కేసు నమోదు..) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు సాగర్ సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ను వాడుతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసేందుకు ఈ యాప్‌ను సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నాడు. ఈ యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో బాలుడి ఆచూకీ కనుక్కోవటం పోలీసులకు 3 రోజులు పాటు సవాలుగా మారింది. పెట్రోల్ బంక్ వద్దకు వెళదామని చెప్పి బాలుడిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు సాగర్. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే దీక్షిత్ అతడి బైక్ ఎక్కాడు. అప్పటికే స్థానిక మెడికల్ స్టోర్ నుండి సాగర్ రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మార్గం మధ్యలో ఒక చోట మంచినీళ్లు తాగెందుకు ఆపాడు. ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు వేశాడు. బాబు మత్తులోకి జారుకుని, స్పృహలోకి వచ్చేలోపే బాలుడిని హత్య చేశాడు. అనంతరం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడి తండ్రిని రమ్మని చెప్పి షాపులో నుండి రంజిత్ రెడ్డి కదలికలను గమనించాడు. మఫ్టీలో పోలీసులు ఫాలో అవుతున్నారన్న అనుమానంతో మళ్లీ యాప్ నుండి రంజిత్ రెడ్డికి ఫోన్ చేశాడు. హత్య చేసిన వెంటనే మనోజ్ రెడ్డి ఇంటికి బాలుడి తలిదండ్రుల రియాక్షన్ చూసేందుకు వెళ్లాడు. -
సెల్ఫీ నిరాకరించాడని.. టీవీ నటుడిపై దాడి
బెంగళూరు(బనశంకరి): తమతో సెల్ఫీ దిగడానికి నిరాకరించిన బుల్లి తెర నటుడిపై ముగ్గురు యువకులు దాడి చేసి అతని కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులోని విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు... కన్నడ సీరియల్ నాగిణిలో నటిస్తున్న దీక్షిత్ శెట్టి గురువారం అర్ధరాత్రి కారులో వస్తుండగా మారుతి మందిరం వద్ద మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అతడిని గమనించి కారును అడ్డుకుని తమతో సెల్ఫీ దిగాలని దీక్షిత్‌తో డిమాండ్ చేశారు. త్వరగా ఇంటికి వెళ్లే పని ఉందని చెప్పినా కూడా వారు వినకపోవడంతో వేగంగా కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు కారును వెంబడించి, దీక్షిత్‌ను దూషించడంతో పాటు కారు అద్దాలు పగులగొట్టి బైక్‌లో ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల కోసం గాలింపు చేపట్టారు. -
షార్ట్‌ఫిల్మ్ టూ ఫీచర్ ఫిల్మ్
యూ ట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్.. యూత్ క్రియేటివిటీకి మంచి వేదిక. ఫ్రెండ్స్‌తో కలిసి అతి తక్కువ ఖర్చుతో మంచి చిత్రాలు చేస్తున్నారు. తక్కువ నిడివిలో సందేశాలిస్తున్నారు. కొందరు చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు. విజయవాడ లయోల కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన దీక్షిత్చంద్ నాయక్ కూడా అంతే. మంచు విష్ణుతో తీయబోతున్న చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదుగుతున్నాడు. తన ఫిల్మ్ ట్రావెల్ గురించి దీక్షిత్ అంతరంగం.. సినిమానే నా ప్రపంచం లయోల కళాశాలలో 2014లో బీటెక్ పూర్తిచేశాను. చదువుకునే రోజుల నుంచే నాకు షార్ట్‌ఫిల్మ్స్ అంటే ప్రాణం. మొదట్లో మా పేరెంట్స్ నన్ను నిరుత్సాహపరిచారు. వారిని కన్విన్స్ చేయడానికి ఆరు నెలలు పట్టింది. ఇక నా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా ఫ్రెండ్ రఘురామ్ ఎంకరేజ్‌మెంట్‌తో 2013లో ‘మై ఫ్రెండ్’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను. ఆ ఫిల్మ్‌కు కేవలం రూ.300 ఖర్చయింది. అలా ప్రారంభమైంది నా షార్ట్‌ఫిల్మ్స్ కెరీర్. ఇప్పటివరకు మొత్తం పది లఘుచిత్రాలు తీశాను. డైరెక్టర్ కావాలంటే పుస్తక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. నేను watt pad appలో వచ్చే కొత్తకొత్త ఇంగ్లిష్ నవలలు ఎక్కువగా చదువుతాను. బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయాలి ‘లవ్ బిఫోర్ వెడ్డింగ్’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమారు 8 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ నా ఇష్టం కొద్దీ తీశాను. నాకు ఎమోషనల్ అండ్ లవ్ ఓరియెంటెడ్æ ఇష్టం. ఒకే జానర్ కాకుండా థ్రిల్లర్ కూడా చేయాలి. నేను రామ్‌గోపాల్‌వర్మ ఫ్యాన్. యండమూరి గారి నవలలు ఎక్కువగా చదువుతాను. ఆయన నవల చదువుతుంటే, కథగా మార్చి సినిమా చేయాలనేంత కోరిక కలుగుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్ గవిర్రెడ్డి (సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ డైరెక్టర్) దగ్గర మంచు విష్ణుతో రాబోయే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. నాకు మెలొడీ మ్యూజిక్ అంటే ఇష్టం. హిందీ, తమిళ చిత్రాలను ఎక్కువ ఇష్టపడతాను. నేటివిటీ కోల్పోకుండా, ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ, బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీస్తేనే సక్సెస్ అవుతాం. 2014లో విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో నేను తీసిన ‘మూడు ఉత్తరాలు’ ఫిల్మ్‌కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఫెస్టివల్‌కు సుమారు 90 లఘుచిత్రాలు పోటీపడ్డాయి. వైజాగ్‌లో జరిగిన పోటీలో ‘ఇలా ఎలా’ షార్ట్‌ఫిల్మ్‌కు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకున్నాను. -
టాబ్లెట్ గొంతులో అడ్డుపడి బాలుడి మృతి
పాలకుర్తి(జనగామ): అస్వస్థతకు గురైన బాలుడు స్వయంగా టాబ్లెట్ వేసుకోగా.. గొంతులో అడ్డు పడటంతో ఆ బాలుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన యార శ్రీను, లలిత దంపతుల కుమారుడు యార దీక్షిత్(4) స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. ఆ బాలుడికి శనివారం తండ్రి ట్యాబ్లెట్ వేయబోతుండగా.. తానే వేసుకుంటానని గొంతులో వేసుకున్నాడు. ఆ ట్యాబ్లెట్ గొంతులో అడ్డుపడటంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో దీక్షిత్ మృతి చెందాడు.