బెంగళూరు(బనశంకరి): తమతో సెల్ఫీ దిగడానికి నిరాకరించిన బుల్లి తెర నటుడిపై ముగ్గురు యువకులు దాడి చేసి అతని కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులోని విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు... కన్నడ సీరియల్ నాగిణిలో నటిస్తున్న దీక్షిత్ శెట్టి గురువారం అర్ధరాత్రి కారులో వస్తుండగా మారుతి మందిరం వద్ద మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అతడిని గమనించి కారును అడ్డుకుని తమతో సెల్ఫీ దిగాలని దీక్షిత్‌తో డిమాండ్ చేశారు. త్వరగా ఇంటికి వెళ్లే పని ఉందని చెప్పినా కూడా వారు వినకపోవడంతో వేగంగా కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు కారును వెంబడించి, దీక్షిత్‌ను దూషించడంతో పాటు కారు అద్దాలు పగులగొట్టి బైక్‌లో ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment