టాబ్లెట్‌ గొంతులో అడ్డుపడి బాలుడి మృతి | toddler dies of tablet struck in throught | Sakshi
Sakshi News home page

టాబ్లెట్‌ గొంతులో అడ్డుపడి బాలుడి మృతి

Published Sun, Jan 1 2017 4:26 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

టాబ్లెట్‌ గొంతులో అడ్డుపడి బాలుడి మృతి - Sakshi

టాబ్లెట్‌ గొంతులో అడ్డుపడి బాలుడి మృతి

పాలకుర్తి(జనగామ): అస్వస్థతకు గురైన బాలుడు స్వయంగా టాబ్లెట్‌ వేసుకోగా.. గొంతులో అడ్డు పడటంతో ఆ బాలుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన యార శ్రీను, లలిత దంపతుల కుమారుడు యార దీక్షిత్‌(4) స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు.

ఆ బాలుడికి శనివారం తండ్రి ట్యాబ్లెట్‌ వేయబోతుండగా.. తానే వేసుకుంటానని గొంతులో వేసుకున్నాడు. ఆ ట్యాబ్లెట్‌ గొంతులో అడ్డుపడటంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో దీక్షిత్‌ మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement