తిరుపతి : అలిపిరిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్ కేసులో కిడ్నాపర్‌ను శివప్పగా పోలీసులు గుర్తించారు. కానీ ఇంతవరకు అతని ఆచూకీ దొరకలేదు. దీంతో అపహరణకు గురైన బాలుడు ఇంకా అతని చెరలోనే ఉన్నాడు. వివరాల ప్రకారం..చత్తీస్‌గఢ్ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్‌పాత్ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు.ఆ సమయంలో వారి పక్కనే పేపర్ చదువుతున్నట్టు నటించిన ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అప్పటినుంచి బాలుడి కోసం గాలించినా ఎలాంటి క్లూ దొరకలేదు.
కిడ్నాప్‌కు నాలుగు రోజుల ముందే శివప్ప పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకుపై అమితమైన ప్రేమ చూపించే శివప్ప..కుమారుడి మృతితో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి బస్టాండు వద్ద ఆడుకుంటున్న సాహుని కిడ్నాప్ చేశాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా ఇంకా బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో సాహు కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి : (తిరుపతిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు)
Comments
Please login to add a commentAdd a comment