సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతిని సినీ ఫక్కీలో వంద మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు పోలీసులు. శుక్రవారం రాత్రి యువతిని రక్షించారు. అయితే.. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం. తండ్రికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేశారు.
వైశాలిని రహస్య ప్రదేశంలో ఉంచిన పోలీసులు.. ఆమె తండ్రిని మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెకు ఓ పరీక్ష ఉండడం, ఆ పరీక్షకు తండ్రే దగ్గరుండి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 28 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడంతో కనిపెడ్డడానికి ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ‘ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. వైశాలి షాక్‌లో ఉంది. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లను పట్టుకుంటాం.’ అని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో..
Comments
Please login to add a commentAdd a comment