girl kidnap case
-
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లిదాకా వెళ్ళింది కానీ..
-
ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
మన్నెగూడ కిడ్నాప్ ఘటన షాక్‌కు గురిచేసింది: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ ఘటన తనను షాక్‌కు గురి చేసిందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. యువతి భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. యువతి కుటుంబానికి భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని కోరారు తమిళిసై. Shocked to see the incidence.Concerned about the safety of the women kidnapped Assure her family that the culprits will booked as per law.Request @TelanganaDGP for necessary action to safeguard the family & girl https://t.co/VziafBZQud — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 9, 2022 యువతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అపహరణకు గురైన వైద్య విద్యార్థిని వైశాలి కుటుంబ సభ్యులను మన్నెగూడకు వెళ్లి పరామర్శించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా.. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇదీ చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి -
మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతిని సినీ ఫక్కీలో వంద మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు పోలీసులు. శుక్రవారం రాత్రి యువతిని రక్షించారు. అయితే.. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం. తండ్రికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేశారు. వైశాలిని రహస్య ప్రదేశంలో ఉంచిన పోలీసులు.. ఆమె తండ్రిని మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెకు ఓ పరీక్ష ఉండడం, ఆ పరీక్షకు తండ్రే దగ్గరుండి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 28 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడంతో కనిపెడ్డడానికి ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ‘ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. వైశాలి షాక్‌లో ఉంది. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లను పట్టుకుంటాం.’ అని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, ధర్మపురి(కరీంనగర్): యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి, కిడ్నాప్‌కు యత్నించిన ఘటన ధర్మపురిలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన ఓ యువతి(23)కి వెల్గటూర్ మండలంలోని కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో సోమవారం పెళ్లి నిశ్చయమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఇది చూసిన వెంటనే సారంగాపూర్ మండలంలోని రేచపెల్లికి చెందిన మంగళారపు రాజేందర్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. లోపల ఉన్న ఆమెను లాక్కొచ్చి, కారులో ఎక్కించారు. జాతీయ రహదారి పక్కనున్న దుర్గమ్మ కాలనీ నుంచి కమలాపూర్ రూట్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కారు ఆగిపోయింది. బాధితురాలు రోదిస్తూ కేకలు వేయడంతో రాజేందర్ కోపోద్రిక్తుడై కత్తితో ఆమెను గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం జరగగా యువతి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు, సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ నలుగురు పారిపోయారు. పోలీసులు కారును ఠాణాకు తరలించారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషను చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. ఇద్దరూ డిగ్రీ క్లాస్మేట్స్.. రాజేందర్, బాధిత యువతి డిగ్రీ క్లాస్మేట్స్. ఈ క్రమంలో రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుంటానని రాజేందర్ ఆమె తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు నిరాకరించారని సమాచారం. రెండు రోజుల కిందట కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో యువతికి పెళ్లి నిశ్చయించారు. ఇది తెలుసుకున్న రాజేందర్ తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమయ్యాడు. చదవండి: పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య -
బుధరావుపేటలో బాలిక కిడ్నాప్ కలకలం
ఖానాపురం(నర్సంపేట): ఆరుబయట ఆడుకుం టుండగా తొమ్మిదేళ్ల బాలికను ఇద్దరు మహిళలు, ఒక దుండగుడు ఆటోలో వచ్చి కిడ్నాప్‌నకు యత్నించిన సంఘటన శనివారం కలకలం సృష్టించింది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేటలో ఈ ఘటన జరి గింది. స్థానికులు, ఎస్సై మ్యాక అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధరావుపేట గ్రామ పరిధి లోని బోడ్యతండాకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు లకావత్ జ్యోతి, రవి దంపతులకు కుమార్తె ఝాన్సీ(9), కుమారుడు వంశీ ఉన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నారు. తండ్రి రవి నర్సంపేటలో పని నిమిత్తం వెళ్లగా, తల్లి జ్యోతి ఇంట్లో పనులు చేసుకుంటోంది. బాలిక ఝాన్సీ సమీపంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద తోటి పిల్ల లతో ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఆటోలో వచ్చారు. తమకు ఒక చిన్నారి కావాలని, గుడిలో పూజ చేసిన తర్వాత వెంటనే తీసుకువస్తామని అంగన్వాడీ ఆయాతో చెప్పగా నిరాకరించింది. దీంతో వారు ఆటోలో వెళ్లి.. మళ్లీ వెనక్కు వచ్చి బాలిక ఝాన్సీకి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయా రు. అంగన్వాడీ కేంద్రంలో నుంచి ఆయా బయటకు వచ్చి చూడగా బాలిక ఝాన్సీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వారికి తెలియజేయగా, వారు బాలిక తల్లి జ్యోతికి చెప్పారు. ఆమె భర్త రవికి తెలియజేయగా వెంటనే 100కు డయల్ చేశాడు. మంగళవారిపేటలో ఎంపీపీ రవీందర్రావు, అక్కడి యువకులకు సమాచారం అందించారు. రెండు గ్రామాలకు చెందిన యువకులు ఆటోలను ఆపి తనిఖీలు చేయడం ప్రారంభించారు. అప్పటికే ముగ్గురు స్థానిక మురారీ హోటల్లో బాలికతో కలిసి టిఫిన్ చేస్తున్నారు. గమనించిన యువకులు వెళ్లి వారిని పట్టుకున్నారు. బాలిక తండ్రి రవి చేరుకుని వారిపై ఆగ్రహిస్తూ చేయిచేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్ వెంటనే సిబ్బందితో వచ్చి దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోతో పాటు ఇద్దరు మహిళలు, పురుషుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించా రు. కాగా కిడ్నాప్‌నకు యత్నించిన వారి ద్వారా గతంలో మృతిచెందిన ఇర్షద్ మృతి వివరాలు తెలుస్తాయని ముస్లింలు సైతం తరలివచ్చారు. కాగా ఎస్సై అభినవ్ విచారణ చేస్తున్నామని, వివరాలు తెలియలేదని వారికి చెప్పి పంపారు. రూరల్ సీఐ సతీష్‌బాబు చేరుకొని ఎస్సై అభినవ్‌తో కలిసి విచారణ చేపట్టారు. కాగా డీసీపీ అనురాధ సాయంత్రం ఖానాపురానికి చేరుకుని కిడ్నాప్‌నకు యత్నం ఘటనపై పోలీస్ సిబ్బందితో చర్చించారు. అక్కడే ఉన్న ఎంపీపీ రవీందర్రావు, జడ్పీటీసీ సభ్యుడు జగన్మోహన్రెడ్డి, బాలిక తండ్రి లకావత్ రవితో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నా రు. ఏసీపీ సునితామోహన్, సీఐ, ఎస్సై ఉన్నారు. భయాందోళనలో గ్రామస్తులు గ్రామంలో పట్టపగలే బాలికను కిడ్నాప్‌కు యత్నించడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇదే గ్రామానికి చెందిన ఇర్షద్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇలాగే మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేయగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విధితమే. ఇదే తరహాలో మళ్లీ ఏడాది తర్వాత బాలిక ఝాన్సీని కిడ్నాప్‌నకు యత్నించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. -
కటకటాల పాలైన కామపిశాచి
శంషాబాద్: విద్యాబుద్దులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామాంధుడిలా మారి బాలికను మాయమాటలతో వంచించాడు. కొంతకాలం పాటు శారీరకంగా లొంగదీసుకున్న అతడి మోసాన్ని తల్లిదండ్రులు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారైన అతడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. షాబాద్‌కు చెందిన అక్బర్(52) శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. అదే గ్రామానికి చెందిన బాలికను(17) మాయమాటలతో నమ్మించాడు. శారీరకంగా సైతం లొంగదీసుకున్నాడు. ఈ ఏడాది మే 8న బాలిక కనిపించకపోవడంతో తండ్రి కత్తుల నర్సింహ ఉపాధ్యాయుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులకు బాలిక ఆచూకీ కనుగొని విచారించడంతో అక్బర్ మోసాలు బయటపడ్డాయి. నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని వివరించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో విషయం తెలుసుకున్న అక్బర్ సొంత గ్రామం నుంచి పరారయ్యాడు. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో దాక్కున్నాడు. అతడికి వరసకు అల్లుడయ్యే ఇమ్రాన్ సహకరిస్తుండడంతో ఫోన్ నంబర్లు మార్చుతూ అక్కడే గడిపాడు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వస్తున్న అక్బర్‌ను పోలీసులు షాద్‌నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన ఇమ్రాన్‌ను సైతం అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. -
బాలిక కిడ్నాప్ కేసులో నిందుతునికి ఐదేళ్ల శిక్ష
అనంతపురం: బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితునికి ఐదేళ్ల జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ అనంతపురం సహాయ సెషన్స్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. గతేడాది ఎప్రిల్ 3న ఉద్దేహాల్ గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన హరిజన దగ్గుపర్తి రవి(32) బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ మేరకు ఆ బాలిక తల్లిదండ్రులు బొమ్మనహాల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యప్తు చేపట్టిన పోలీసులు ఆరోపణలు నిజమేనని తేల్చడంతో నిందితునికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. (బొమ్మనహాల్)