అనంతపురం: బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితునికి ఐదేళ్ల జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ అనంతపురం సహాయ సెషన్స్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. గతేడాది ఎప్రిల్ 3న ఉద్దేహాల్ గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన హరిజన దగ్గుపర్తి రవి(32) బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ మేరకు ఆ బాలిక తల్లిదండ్రులు బొమ్మనహాల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యప్తు చేపట్టిన పోలీసులు ఆరోపణలు నిజమేనని తేల్చడంతో నిందితునికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
(బొమ్మనహాల్)
బాలిక కిడ్నాప్ కేసులో నిందుతునికి ఐదేళ్ల శిక్ష
Published Thu, Feb 19 2015 8:18 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
Advertisement
Advertisement